ఎమ్మెల్యేలు బజారున పడి తన్నుకోవడం దారుణం

శాంతిభద్రలకు విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తాం
సిఎల్పీని విలీనం చేసుకుని విపక్షం లేకుండా చేసిన ఘనులు
ప్రతిపక్షం అంటే తమకు గౌరవం ఉందన్న డిప్యూటి సిఎం భట్టి
మేడారం గ్రామం సోలార్‌ ‌పైలెట్‌ ‌ప్రాజెక్టుకు ఎంపిక
బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కొట్టుకుంటే తమకేం సబంధమన్న మంత్రి శ్రీధర్‌ ‌బాబు

‌బాధ్యతగల ఎమ్మెల్యేలు బజారున పడి తన్నుకోవడం బాధ కలిగించిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లా పర్యటన సందర్భంగా..ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, అరెకపూడి గాంధీ వ్యవహారంపై స్పందిస్తూ.. ఎమ్మెల్యేలు రోడ్డెక్కి కొట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం ఏం చేయాలో అది చేస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని గౌరవించాలని ఉపేక్షించమని, గత భారాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, ప్రతిపక్ష హోదా లేకుండా సీఎల్పీ సీటును సైతం గుంజుకున్నారని, వాళ్ల మాదిరిగా తాము ప్రవర్తించడం లేదని, అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు వినిపించాలని కోరుకుంటున్నామని భట్టి అన్నారు. ప్రతిపక్ష నేతలంటే తమకు గౌరవం ఉందని, అసెంబ్లీలో అధికార పార్టీ ఎవరో.. ప్రతిపక్ష పార్టీ ఎవరో స్పీకర్‌ ‌వెల్లడించారని, శాంతిభద్రతలు కాపాడటం తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని బిజెపి ఉనికి కోసం రాజకీయ డ్రామాలు ఆడుతుందని భట్టి విక్రమార్క విమర్శించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ సిఎం రేవంత్‌ ‌రెడ్డి నాయకత్వంలో ప్రజల అకాంక్షలను..చట్టాలుగా మార్చి పాలన కొనసాగిస్తున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.

దశాబ్ద కాలంగా పెండింగ్‌ ‌లో వున్న ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామ ప్రజలకు 18 కోట్ల రూపాయలను అందజేశామని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా రుణమాఫీ విషయంలో రాజీపడే ప్రసక్తి లేదన్నారు. రైతులకు ఇన్స్యూరెన్స్ ‌డబ్బులను ప్రభుత్వమే చెల్లిస్తుందన్న భట్టి… 2030 వరకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా 20 వేల మెగవాట్ల విద్యుత్‌ ఉత్పత్తి దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. సోలార్‌ ‌విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా రైతులకు ఆదాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పైలట్‌ ‌ప్రాజెక్టుగా 30 గ్రామాలకు ప్రభుత్వ ఖర్చుతో వ్యవసాయ పంపు సెట్లకు సోలార్‌ ‌పవర్‌ అం‌దించనున్నామన్నారు. మేడారం గ్రామాన్ని సోలార్‌ ‌పవర్‌ ‌పైలట్‌ ‌ప్రాజెక్టుగా ఎంపిక చేస్తున్నామని తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా 18 వేల కోట్ల రూపాయలను 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కాంగ్రెస్‌ ‌పార్టీదేదనన్న భట్టి ఎల్లంపల్లి ముంపు గ్రామస్తులకు పెండింగ్‌ ‌లో ఉన్న 18 కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. ఆదిలాబాదు నుండి ఖమ్మం వరకి పాదయాత్ర చేసానని, మీ అందరి ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ప్రజల ఆశయాలని చట్టాలుగా మార్చి పని చేస్తుంది మా ప్రభుత్వమని, ప్రాజెక్టుల కొసం భూములని ఇచ్చిన వారికి గౌరవం ఇవ్వాలి.అందుకే నిధులు విడుదల చేస్తున్నామన్నారు.

రెండు లక్షలు రుణమాఫి చేస్తానని మాట ఇచ్చాం చేసి చూపామని, హామీ ఇవ్వకున్నా 2 లక్షల పైన ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించామని, లక్ష రుణమాఫి చేస్తానని మోసం చేసింది నాటి బిఅర్‌ఎస్‌ ‌ప్రభుత్వమన్నారు. రుణమాఫీపై బీఅర్‌ఎస్‌ ‌మాట్లాడే మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆయన మండిపడ్డారు. రెండు లక్షల పైన ఉన్నవారికి కూడ వెసులుబాటు కల్పించే యత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు. అంతేకాకుండా.’ ఓడిపోయిన కూడ రోడ్ల వి•దకి వచ్చి బిఅర్‌ఎస్‌ ఆం‌దోళన చేస్తుంది. పంటలతో పాటుగా పవర్‌ ఉత్పత్తి ద్వారా రైతుకు ఆదాయం సమకూరే ఏర్పాటు చేస్తాం. మేడారం గ్రామానికి సోలార్‌ ‌పంపు సెట్లు ఏర్పాటు చేస్తాం. భవిష్యత్తులో విద్యుత్‌ ‌రంగంలో తెలంగాణని మోడల్‌ ‌గా తయ్యారు చేస్తాం. పత్తిపాక రిజర్వాయర్‌ ‌కోసం బడ్జెట్‌ ‌లో ప్రతిపాదించాము.త్వరలోనే పనులు మొదలు పెడతాం. ’ అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఇద్దరూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కొట్టుకుంటే.. కాంగ్రెస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్‌ ‌బాబు సీరియస్‌ అయ్యారు.

ఆ ఇద్దరూ బీఆర్‌స్‌ ఎమ్మెల్యేలే.. వారి అంతర్గత విభేధాలతో కొట్టుకున్నారని క్లారిటీ ఇచ్చారు. పత్తిపాక రిజర్వాయర్‌ ‌ని ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. పనులు మొదలు పెడుతామన్నారు. పత్తపాక రిజర్వాయర్‌ ‌కి ఈ బ్జడెట్‌ ‌లో డబ్బులు కెటాయించామన్నారు. అర్థికమంత్రిగా భట్టి ఈ రాష్ట్రంని బడ్జెట్‌ ‌పరంగా గాడిలో పెడుతున్నారని అన్నారు. సాంకేతికపరమైన ఇబ్బందులు ఉంటే తప్ప అందరికీ రుణమాఫి అయ్యిందన్నారు. అంతకు ముందు పెద్దపల్లి జిల్లా మంథనిలో సెంటిలియన్‌ ‌సాప్ట్ ‌వేర్‌ ‌కంపనీని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ ‌బాబు ప్రారంభించారు. మంథని ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తున్న సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు అన్నారు. గ్రావి•ణ ప్రాంతాలలో ప్రతిభ ఉంటుందన్నారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేది తమ సంకల్పమన్నారు. మంథని ప్రాంత మేధస్సుకు ప్రపంచ వ్యాప్తంగా పేరుందన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. మంథనిలో త్వరలో స్కిల్‌ ‌సెంటర్‌ ఏర్పాటు చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page