జమిలి ఎన్నికలకు మేం వ్యతిరేకం : ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ‌

వన్‌ ‌నేషన్‌ ‌వన్‌ ఎలక్షన్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ ‘ఎక్స్’ ‌వేదికగా  ప్రకటించారు. ఈ విధానం ఇది ఫెడరలిజాన్ని నాశనం చేస్తుందని ఆరోపించారు. రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణంలో భాగమైన ప్రజాస్వామ్యాన్ని ఇది రాజీ చేస్తుందని విమర్శించారు. ప్రధాని మోదీ, అమిత్‌ ‌షాకు తప్ప.. ఎవరికీ బహుళ ఎన్నికలు సమస్య కాదని పేర్కొన్నారు. ఈ అంశంపై మున్సిపల్‌, ‌స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. తరచుగా ఆవర్తన ఎన్నికలు ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని మెరుగుపరుస్తాయని ఓవైసీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page