కాశ్మీర్ పై కుట్ర‌ చేసే ప్ర‌తీ శ‌క్తినీ ఓడిస్తాం..

  • ఆర్టికల్‌ 370 ‌రద్దుతోనే అభివృద్ధి
  • యువత చేతిలో రాళ్లు పోయి పెన్నులు వ‌చ్చాయి..
  • కాశ్మీర్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

ప్ర‌జాతంత్ర‌, ఇంట‌ర్నెట్ డెస్క్‌ సెప్టెంబర్ 19:‌ జమ్మూకశ్మీర్‌పై కుట్రలు చేసే ప్రతీ శక్తినీ ఓడించి తీరతామ‌ని, ఆర్టికల్‌ 370 ‌రద్దు చేసిన తర్వాత ఇక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతోంద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. ఇప్పుడు కశ్మీర్‌ ‌యువత రాళ్లను వదిలి పుస్తకాలు, పెన్నులు పట్టుకుంటున్నారు తెలిపారు. గురువారం జమ్మూకశ్మీర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించారు. జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం శ్రీనగర్‌లో జ‌రిగిన‌ భారీ బహిరంగ సభలో మోదీ ప్ర‌సంగిస్తూ..

కాంగ్రెస్‌ ‌సహా ప్రతిపక్షాలపై మరోసారి ధ్వజమెత్తారు. ఈ కేంద్రపాలిత ప్రాంతం అభివృద్ధికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. విద్యకు దూరమైన మన యువత చేతిలో కాంగ్రెస్‌, ‌నేషనల్‌ ‌కాన్ఫరెన్స్, ‌పీడీపీ పార్టీలు రాళ్లు పెట్టాయి. వారి స్వప్రయోజనాల కోసం మన పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. జమ్ము కశ్మీర్‌ను దోచుకోవటం తమ జన్మహక్కు అన్నట్లు ఆ మూడు కుటుంబాలు ప్రవర్తిచాయి. మూడు పార్టీలు జమ్ము కశ్మీర్‌ ‌యువత భవిష్యత్తు నాశనం చేశాయి.

ఆ మూడు పార్టీలు కశ్మీర్‌ ‌యువత చేతికి రాళ్లు ఇచ్చి విధ్వంసాలు సృష్టించేవి.. బీజేపీ మాత్రం పుస్తకాలు, పెన్స్ ఇస్తోందన్నారు. స్కూల్స్‌ను కూడా ఉగ్రవాదులు టార్గెట్‌ ‌చేశారంటే.. వారు ఎంత ద్వేషంతో ఉన్నారో అర్థమ‌వుతుంది. ఇప్పుడు జమ్ము కశ్మీర్‌ ‌యువత చేతిలో రాళ్లు కాదు.. బుక్స్, ‌పెన్నులు కనిపిస్తున్నాయి. ఎయిమ్స్, ఐఐటీ ఏర్పాటు వార్తలు ఇప్పుడు జమ్ములో వినిపిస్తున్నాయి. కశ్మీర్‌లో ఉపాధి అవశాలు లభించేలా ఏర్పాట్లు చేస్తున్నాం అని మోదీ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page