జమిలి ఎన్నికలతో  ప్ర‌జాధ‌నం ఆదా..

  • నిర్వహణ కోసం కేంద్రం కమిటీ ఏర్పాటు
  • కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి వెల్లడి

జమిలి ఎన్నికలు జరపాలని నిర్ణయించడం హ‌ర్ష‌ణీయమ‌ని బిజెపి అభివర్ణించింది.  ప్ర‌జాధ‌నం వృథా కాకుండా ఉండేందుకు ఏక‌కాల ఎన్నిక‌లు కీల‌క‌మ‌ని కేంద్ర బొగ్గుగనుల శాఖమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.  జమిలి ఎన్నికల నిర్వహణ అమలు కోసం కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేయనుందని ఒక‌ ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా ఐదేళ్ల పాటు ఏదో ఒకచోట పోలింగ్‌ ‌జరుగుతున్నందున ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతద్వారా విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేక ప్రభుత్వ నిర్ణయాలకు ఆటంకంగా మారాయన్నారు. కొన్నిసార్లు సాధారణ నిర్ణయాలు కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడినట్లు చెప్పారు. 

2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అసెంబ్లీలుపార్లమెంటుకు జరుగుతున్న ఎన్నికలకు ఫుల్‌స్టాప్‌ ‌పెట్టి.. జమిలి ఎన్నికలు జరపాలని నిర్ణయించడం స్వాగతించదగిన పరిణామమ‌ని  తెలిపారు. ఎన్నికల ర్యాలీలుబహిరంగ సభల కారణంగా.. ట్రాఫిక్‌ ‌జామ్‌‌ధ్వనికాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

వేర్వేరుగా ఎన్నికల నిర్వహణ కారణంగా ఖజానాపై ఆర్థికంగా భారం పడుతోందని చెప్పారు. పార్లమెంటురాష్టాల్ర అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడంతో జరుగుతున్న ఖర్చు రూ.4,500 కోట్ల పైమాటేనన్నారు. జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై.. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని ప్రస్తుతం వ్యతిరేకిస్తున్న పార్టీలు త్వరలోనే దీనికి సహకరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page