కారు మబ్బుల్లో..కమ్ముకున్న చీకట్లలో..
సాగుతోంది నా ప్రయాణం
దారి చూపడానికి చంద్రుడు కూడా లేడు
బహుశా ఈరోజు అమావాస్య నేమో
అయినా ఆగదు నా ప్రయాణం..నా చుట్టూ భయంకరంగా కమ్ముకున్న చీకట్లు
అయినా నాలో అణుకు లేదు బెణుకు లేదు
చేతిలో ఓ నిప్పు కాగడ పట్టుకొని
ఛాతి నిండా ధైర్యంతో
ముందుకు సాగుతోంది నా ప్రయాణం..దారిలో మిణుకు మిణుకుమని
ఎగిరే మిణుగురు పురుగులు
సెలయేళ్ల చప్పుల్లు..పక్షుల కూనీ రాగాలు..
కీటకాల కిట కిట ధ్వనులు
నా ప్రయాణానికి స్వాగతం
పలుకుతున్నట్లుగా ఉన్నాయి.
సాగుతోంది నా ప్రయాణం
దారి చూపడానికి చంద్రుడు కూడా లేడు
బహుశా ఈరోజు అమావాస్య నేమో
అయినా ఆగదు నా ప్రయాణం..నా చుట్టూ భయంకరంగా కమ్ముకున్న చీకట్లు
అయినా నాలో అణుకు లేదు బెణుకు లేదు
చేతిలో ఓ నిప్పు కాగడ పట్టుకొని
ఛాతి నిండా ధైర్యంతో
ముందుకు సాగుతోంది నా ప్రయాణం..దారిలో మిణుకు మిణుకుమని
ఎగిరే మిణుగురు పురుగులు
సెలయేళ్ల చప్పుల్లు..పక్షుల కూనీ రాగాలు..
కీటకాల కిట కిట ధ్వనులు
నా ప్రయాణానికి స్వాగతం
పలుకుతున్నట్లుగా ఉన్నాయి.
దారిలో ఎత్తయిన పెద్ద చెట్ల మధ్య
సాగుతోంది నా ప్రయాణం
నా మీద ఏదో పడుతున్నట్లుగా
నన్ను ఎవరో వెంబడిస్తున్నట్లుగా
నా కాళ్ళ చప్పుడు
నన్నే భయపెట్టేంతగా ఉంది
నా శరీరానికి గుచ్చుకున్న ముళ్ళకంపలు
దారి పొడువునా నా ఒంటి నుంచి
కారుతున్న రక్తంతో..సాగుతోంది నా ప్రయాణం..
దారి మలుపులతో
అలుపు లేని నా కాళ్ళతో
అలసట చెందని నా శరీరంతో.. గెలుపు కోసం..
విరామమెరుగక ముందుకు సాగుతోంది నా ప్రయాణం…
గుడ్ల గూబల శబ్దాలు..
ఏనుగుల ఘీంకారాలు…
సింహాల ఘర్జనలు…
నన్ను భయపెడుతున్నా..
ఆగదు నా ప్రయాణం
గమ్యస్థానం చేరే వరకు.
-కోనేటి నరేష్, 8499847863
శ్రీ సత్యసాయి జిల్లా.