ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా పథకాల అమలు జరగాలి!

 ఉచితాలను  ప్రోత్సహించవొద్దు ..

రాష్ట్రం ఏదైనా ఆర్థిక సమర్థత ఎంతన్నది బేరీజు వేయాలి. ఇల్లు మొదలకుని అన్ని వ్యక్తిగత వివరాలు సేకరించాలి. తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులకు తెరలేపారు. ఇప్పుడు ఇళ్లు, కార్డులు అనగానే ప్రతి ఒక్కరూ అర్హులమేనని తమ వివరాలను సిద్దం చేసుకుంటున్నారు. దీనికి ప్రాతిపదిక ఏద్కెనా పక్కాగా వివరాల సేకరణ జరగాలి. అప్పుడే అసలుసిసలు లబ్దిదారులకు న్యాయం జరగగలదు. ఇక బియ్యం పథకాన్ని తీసుకుంటే కిలో రూపాయి బయ్యం పథకంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దుబారా జరుగుతోంది. ఎపిలో ఇటీవల టన్నుల కొద్దీ బియ్యం దేశం దాటించిన విషయాన్ని గుర్తించారు. పోర్టుల ద్వారా బియ్యం దాటిన వైనాన్ని ఆ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ బయటపెట్టారు. తెలంగాణలో కూడా పౌరసరఫరాల శాఖ అప్పుల్లో కూరుకు పోయింది. ఇలా పథకం వృధా అవుతున్నప్పుడు అప్పులు మోయాల్సిన బాధ్యత ఉందా అన్న విషయాన్ని ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. పోటీపడి పాలకులు ఉచిత పథకాలను వరదలా పారిస్తున్నారు. ప్రజలు చెమటోడ్చి కడుతున్న పన్ను డబ్బులు పందేరం చేస్తున్నారు.

ఎపిలో గత సిఎం జగన్‌ హయాంలో బటన్‌ నొక్కితే..కెసిఆర్‌ బటన్‌ నొక్కకుండానే పంచారు. అందుకే ఇద్దరు సిఎంలు కలసి రాష్ట్రాలను దివాళా తీయించారు. వారు ఓడినా హాయిగానే నాలుగు రాల్లు వెనకేసుకుని బతుకుతున్నారు. కానీ రాష్ట్రాల ఖజానా ఎప్పుడో ఖాళీ అయ్యింది. ఇప్పుడు అప్పులు.. భూతంలా వెంటాడుతున్నాయి. ఇదేమిటని అడిగితే ..అప్పులు చేయకుంటే అభివృద్ది ఎలా అని ఎదురుదాడి చేసారు. అప్పులతో ఆస్తులు సృష్టిస్తున్నామని, పేదల కడుపు నింపుతున్నామని ఘనంగా చెప్పుకున్నారు. సబ్సిడీ పథకాలకు ప్రజలను అలవాటు చేసి వారిని నిర్వీర్యులుగా చేయడంలో నేటికీ ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో కూలీలు దొరకడం కష్టంగా మారింది. వ్యవసాయ కూలీల సంగతి చెప్పనక్కర్లేదు. ధరల విషయంలో పల్లెలకు పట్టణాలకు తేడా లేకుండా పోయింది. కూలీనాలీ చేసుకునే వారు కిక్కులేనిదే ఉండడం లేదు. దీంతో సంపాదించిన దాంట్లో అధిక భాగం తాగడానికే తగలేస్తున్నారు. ఉపాధిహావిరీ కింద నిర్మాణాత్మక పనులు చేయించాలన్న డిమాండ్‌పై కేంద్రం నిర్ణయాలు తీసుకోవడం లేదు.

వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్న వినతులను పక్కన పెట్టింది. ఉపాధి హావిరీకింద ఏటా వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నా ..పనికి తగ్గట్లుగా చేసిన పనులు జరగడం లేదు. దీనిని సవిరీక్షించాలన్న కనీస పరిజ్ఞానం కూడా ప్రభుత్వానికి కలగడం లేదు. దీంతో గ్రామాల్లో వ్యవసాయ కూలీలు కరువయ్యారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత దేశంలో కూలీలు ఎందుకు దొరకడం లేదన్న విషయం ప్రపంచాన్ని సైతం ఆందోళనకు గురి చేస్తోంది. దీన్ని ఎలా అధిగమించాలో ఆలోచన చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా రూపాయికే కిలో బియ్యం పథకాన్ని కొనసాగించడం సబబుకాదని గుర్తించడం లేదు. రూపాయి బియ్యం తినేవారు ఇప్పుడు రాష్ట్రాల్లో ఎవ్వరూ లేరు. ఈ పథకాన్ని పున సవిరీక్షించడం వల్ల వేలకోట్ల రూపాయల వృధాను అడ్డుకోవొచ్చు. అయినా సవిరీక్షించడంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సాహసించడం లేదు. రూపాయికి కొత్తతివిరీర కట్ట కూడా రాని రోజుల్లోఈ పథకం కోసం వేలకోట్లు ప్రజల ధనాన్ని దుబారా చేస్తున్నారు. ఈ బియ్యం పథకం ప్రభుత్వాలకు గుదిబండగా మారినా వోటు బ్యాంక్‌ కోసం దీని జోలికి వెళ్లడం లేదు.

కొత్తగా బాధ్యతలు చేపట్టిన తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి, ఎపిలో చంద్రబాబు కూడా ఈ పథకాల జోలికి వెళ్లడం లేదు. వోట్లతో ముడిపడి ఉన్న ఈ పథకాన్ని తొలగించాల్సిందే. తెలుగు రాష్ట్రాల ఖజానాపై తీవ్ర ప్రభావం చూపుతున్న కిలో రూపాయి బియ్యాన్ని తక్షణం తొలగించడం ద్వారా ప్రజల సొమ్ముకు రక్షణగా నిలవాలి. బహిరంగ మార్కెట్‌లో కిలో 60 రూపాయలకు బియ్యం అమ్ముతున్నారు. ఇంత వ్యత్యాసంతో బియ్యం అందిస్తున్నా పేదలు ఈ బియ్యాన్ని అమ్ముకోవడం ద్వారా వ్యాపారాం చేస్తున్నారు. ఆర్థిక మాంద్యంతో అతలాకుతలం అవుతున్న ప్రస్తుత తరుణంలో ఈ పథకంపై సవిరీక్షించి అక్రమాలను అరికట్టాలి. కొందరికి ఈ పథకం వరంగా మారింది. బియ్యాన్ని హోటళ్లకు అమ్ముకుంటున్న ఘటనలు కూడా ఉన్నాయి. మరోవైపు కిలో రూపాయికే ఇస్తున్న చౌక బియ్యం అక్రమంగా రాష్ట్రాల సరిహద్దులు దాటుతున్నాయి. ఇటీవల ఎపిలో ఇలా సరిదహద్దులు దాటుతున్న బియ్యాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్‌ పట్టుకున్నారు. పేదలు కడుపునిండా తినాలన్న ఈ పథకం ఇప్పుడు కొందరికి వ్యాపారంగా మారింది. మరికొందరికి ఆదాయ వనరుగా మారింది.

అలాగే రీసైక్లింగ్‌ పేరుతో సన్నబియ్యంగా మార్చి అమ్ముకునే వ్యాపారంగా మారింది. చెక్‌పోస్టులు,తనిఖీ కేంద్రాలు, పోలీసులు ఉన్నా బియ్యం రవాణాను అడ్డుకోలేక పోతున్నారు. ఎవరి స్థాయిలో వారికి మామూళ్లు అందుతుండటంతో వ్యాపారం జోరుగా సాగుతోందన్నది కఠోర సత్యం. ఫలితంగా పేదలపేరుతో సర్కార్‌ అందచేస్తున్న బియ్యం అక్రమార్కులకు వ్యాపారంగా మారింది. రూపాయికి విలువ లేని సమయంలో కిలో బియ్యాన్ని అందచేసి అక్రమాలకు తావీయకుండా దీనిని ఎప్పుడో తొలగించాల్సింది. రైతు బజార్లను పటిష్టం చేసి అక్కడే అన్ని సరకులను తక్కువ ధరలకు అమ్మితే పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసినవారం అవుతాం. అంతేగాని రూపాయికే బియ్యిం ఇచ్చి వృధాను ప్రోత్సహించడం ప్రభుత్వాలకు మంచిది కాదు. ఉమ్మడి ఎపిలో సబ్సిడీ బియ్యం ధరను పెంచినందుకు అప్పట్లో సిఎంగా ఉన్న చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఆరోజుల్లోనే ఆయన దీనిని ఐదు రూపాయలకు పెంచారు. జాతీయ భద్రత చట్టం కింద కొంత కేంద్రం సబ్సిడీ బియ్యాన్ని అందిస్తోంది.

మిగిలిన లక్షల కార్డులకు పంపిణీ చేస్తున్న బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ భరించాల్సి వస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలపై అదనపు భారం పడుతోంది. తెలంగాణలో సరిహద్దు గ్రామాల గుండా కర్నాటక, మహారాష్టాల్ల్రో ఈ వ్యవహారం సాగుతోంది. రాత్రి వేళల్లో బియ్యాన్ని గోదాం నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. గోదాంలో నిల్వ ఉంచిన బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించే బియ్యంలో కలిపే ప్రయత్నాలు నిత్యం జరుగుతున్నాయన్నఆరోపణలు ఉన్నాయి. దీనికి స్థానికంగా ఉన్న కొందరు డీలర్ల సహకారం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా ఉన్న కొందరి నేతల కనుసన్నల్లోనే ఇదంతా సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరించడంతో పట్టపగలే బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.

గతంలో కెసిఆర్‌ అధికారంలోకి రాగానే సకలజనుల సర్వే చేపట్టారు. అందులో ప్రజల వివరాలు అన్నీ నమోదయ్యాయి. వాటిని ఏం చేశారో తెలియదు. ఇప్పుడు కొత్తగా బిసి గణన అంటున్నారు. కొత్తగా రేషన్‌ కార్డులు అంటున్నారు. ఇలా సర్వేలతో కాలం గడిపే బదులు ప్రజలకు ఏద్కెనా ప్రొఫార్మా అందిస్తే వారే గ్రామస్థాయిలో తమ ఆదాయ వ్యవయాలు, కులవృత్తులు, ఆస్తులు వంటి వివరాలు తెలియ చేస్తారు. ప్రజల ఆర్థిక పరిస్థితి తెలుసుకుని పథకాలు అమలు చేయాలి. అప్పుడే పేదరిక నిర్మూలన జరగగలదు.
-రేగటినాగరాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page