వ్యాయామం ద్వారానే ఆరోగ్యరక్షణ!

హైపో థైరాయిడిజంతో బాధపడేవారు, చేతులలో అదనపు గీతలను ముడుతలను అధికంగా కలిగివుంటారు. క్రియారహితమైన థైరాయిడ్‌ గ్రంధి, వృద్ధాప్య ఛాయలను కూడా పెంచుతుంది. క్రమంగా ముడుతలతో కూడిన చర్మానికి కారణమవుతుంది. పొడి చర్మానికి కూడా క్రియారహిత థైరాయి గ్రంథి కారణంగా ఉంటుంది. క్రమంగా ఇలాంటి అసాధారణ పోకడలకు చర్మం గురవుతుందని అనుమానం వచ్చిన తక్షణమే వైద్యుడ్ని సంప్రదించటం మేలు. హైపో థైరాయిడిజం వల్ల చర్మం లేతగా పసుపు రంగులోకి మారుతుంది. కొన్నిసార్లు చర్మం రంగు నారింజ రంగును తలపిస్తుంది. క్రియారహిత థైరాయిడ్‌ హార్మోన్‌ కారణంగా చర్మం పాలిపోయి పేలవంగా మారుతుంది. చర్మం కొన్ని సందర్భాలలో ఎరుపు, పసుపు రంగులోకి మారడమే కాకుండా పొరలు పొరలుగా కనపడవొచ్చు. క్రమంగా ఇది దురదగా మారి అసౌకర్యంగా ఉంటుంది. ఈ రంగు మారడం వంటి సమస్యలు అధికంగా అరచేతుల్లో కనిపిస్తుంటుంది.

హైపో థైరాయిడిజం కారణంగా చర్మం రంగు మారడమే కాకుండా, మీ గోర్లు కూడా అనేక సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. ముఖ్యంగా గోరుచుట్టు వంటి సమస్యలు అధికంగా తలెత్తడం, చర్మం సున్నితంగా మారడం, రంగు మారడం తదితర లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. దీనికి కారణం అంత్యభాగాలకు రక్తప్రవాహం సరిగ్గా లేకపోవటమే. రక్తప్రవాహం సరిగ్గా లేని కారణంగా ఆయా ప్రాంతాలు పాలిపోవటం క్రమంగా రంగు మారడం, సమస్యాత్మకంగా పరిణమించడం జరుగుతుంది.

పెళుసైన గోర్లు అధికంగా పొడిబారి ఉంటాయి. క్రమంగా సులభంగా విరిగిపోయేతత్వాన్ని కలిగివుంటాయి. ఒక వ్యక్తి హైపో థైరాయిడిజం సమస్యను కలిగి ఉన్నప్పుడు, గోర్ల అంత్యభాగాలకు రక్త సరఫరా తగ్గడం మూలాన పోషకాలు సరిగ్గా అందని కారణాన రంగు మారడం, పెళుసుగా తయారవడం జరుగుతుంది. అంతేకాకుండా విరిగిపోవడం, తిరిగి పెరగకుండా సమతౌల్యాన్ని కోల్పోవడం వంటివి జరుగుతుంటాయి. అందవిహీనంగా కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా గోరు ఫలకం దెబ్బతిని, ఒక్కోసారి గాయాలు కూడా కనపడటం జరుగుతుంది. చేతులు కాళ్ల అంత్య భాగాలకు ప్రధానంగా రక్తప్రవాహం లేని కారణంగా గోర్ల ఆరోగ్య క్షీణతకు దారితీస్తుంది. క్రమంగా గోర్లు ఫంగల్‌ ఇన్ఫెక్షన్లకు గురివడం జరుగుతుంది. ఈ రుగ్మతను ఓనికోలిసిస్‌ వలే సూచిస్తారు. ఈ వ్యాధి గోళ్లపై తీవ్ర ప్రభావాన్ని కలిగివుంటుంది. ఈ పరిస్థితి గోరుచుట్టు లేదా పెళుసుగా మారే తత్వాలను కలిగివున్న, హైపెర్కేరటోసిస్‌ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది గోర్లకు రక్తప్రవాహాన్ని తగ్గించి, జీవం పోయేలా చేస్తుంది కూడా. ఈ సమస్య గోరు ఫలకం పసుపు రంగులోకి మారడానికి కారణం అవుతుంది. క్రమంగా గోర్లు శిధిలాలవలే అందవిహీనంగా మారడమే కాకుండా ఆహారం తీసుకోవటంలో కూడా అసౌకర్యంగా పరిణమిస్తుంది.

ఈ లక్షణాలు కనిపించితే హైపోథైరాయిడిజంతో కూడిన సంకేతాలను కలిగి వున్న ఎడల, తక్షణమే వైద్యుని సంప్రదించడం మేలు. తద్వారా సరైన మందులు, చికిత్సను అందించవొచ్చు. ఈ సమస్య నియంత్రణాస్థితిని కొనసాగించటం ముఖ్యం. పరిస్థితిని అనుసరించి, నోటి ద్వారా ప్రతిరోజూ టాబ్లెట్ల రూపంలో హార్మోనుల స్థాయిలను క్రమబద్దీకరించవలసిన అవసరం ఉంటుంది. ఈ మోతాదులు, రక్తపరీక్ష ద్వారా వైద్యునిచే నిర్థారిస్తారు. రక్తపరీక్షలు సమయానుసారం, వైద్యుని సూచనల మేరకు చేయిస్తూ ఉండాలి. అవసరానికి మించి వాడటం హైపర్‌ థైరాయిడిజం సమస్యకు దారితీయవచ్చు. క్రమంగా అధిక రక్తపోటు, జీవక్రియలు అతివేగం, జీర్ణ సంబంధ సమస్యలు, హార్మోనుల అసమతౌల్యం వంటి తీవ్ర సమస్యలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పైన చెప్పిన సంకేతాలు ఏమాత్రం కనిపించినా.. నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవటం మంచిది. హైపో థైరాయిడిజంతో బాధపడేవారు, నిరంతరం అలసట నిస్సత్తువతో ఉన్నట్లు భావించటం చాలా సాధారణం. అయితే మీరు కూడా ఈ కోవకు చెందినవారు అయితే, మీ శక్తిని పునరుజ్జీవింపజేయడానికి పలు మార్గాలు ఉన్నాయి. థైరాయిడ్‌ పనితీరు సక్రమంగా లేకపోయినా లేదా హైపో థైరాయియిడిజానికి గురైనా మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం కీలకం. మీరు తీసుకునే ఆహారానికి ఎంతో డబ్బు పెట్టినా అందులో పోషకాలు ఉండకపోవొచ్చు.

సంపూర్ణ ఆహార సప్లిమెంట్లు, మీ ఆహారంలో లోపించిన పోషకాలు, విటమిన్లను అందించటం ద్వారా మీకు సహాయపడుతుంది. ఈ లోపాలను గుర్తించడానికి, ఒకసారి రక్త పరీక్షను చేసి చూడాలి.అలసట అధికంగా ఉండటం: మీ శరీరంలోని మూత్రపిండాలపై ఉండే, అడ్రినల్‌ గ్రంథులు ఒత్తిడితో కూడిన పరిస్థితులను అధికమించటంలో మీకు సహాయం చేస్తాయి. అవి కార్టిసోల్‌, ఆడ్రినలిన్‌ విడుదల అవుతుంది. ప్రస్తుతం గజిబిజి జీవితం కారణంగా, అడ్రినల్‌ గ్రంధులు పనిచేయక, నిష్పలంగా మారిపోయేలా చేస్తుంది. సరిగ్గా నిద్రపట్టకపోవటం అనేది హైపో థైరాయిడిజంతో బాధపడేవారికి సర్వసాధారణంగా మారుతుంది. ప్రతిరాత్రి తప్పనిసరిగా ఎనిమిది గంటల పాటు నిద్ర పోయేటట్టు చూసుకోవాలి. దీనిని ఒక అలవాటుగా మార్చుకోవటానికి ప్రయత్నించండి. నేలమీద నిద్రిస్తే ఎంతో మంచిది. మీ రక్తంలో చెక్కర స్థాయిని సమతుల్యంగా ఉండేట్లు చూసుకోవాలి. అధిక గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ కలిగిన కార్బోహైడ్రేట్లను తీసుకోవటం వల్ల ప్యాంక్రియాస్‌ సాధారణం కన్నా ఎక్కువ మోతాదులో ఇన్సులిన్‌ను స్రవిస్తాయి.

ఇది హైపోగ్లైసీమియాకు దారితీసి, క్రమంగా మధుమేహంను కలుగుజేస్తుంది. అటువంటి సమయంలో కీటోజనిక్‌ ఆహారం తీసుకుంటే రక్తంలో చక్కెర అసమతుల్యతను పరిష్కరించుకోవచ్చు. వ్యాయమం ద్వారా థైరాయిడ్‌ను అదుపులో ఉంచవచ్చు. కెటబాలిక్‌ చర్యకు వ్యతిరేక ఫలితమిస్తోంది. యోగా, తాయ్‌ చి వంటి వ్యాయామ పద్ధతులు, అనబాలిక్‌ వ్యాయామం రూపాలుగా చెప్పవొచ్చు. కెటబాలిక్‌ వ్యాయామం వల్ల కండరాల నొప్పి, శరీరం ఒత్తిడి అలసటను కలిగించవు. విటమిన్‌ బి12 ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఆరోగ్యకరంగా, క్రియాశీలకంగా ఉండటానికి అవసరమైన శక్తి ఉత్పత్తిలో సహాయపడుతుంది. హషిమోటో వంటి థైరాయిడ్‌ సంబంధిత పరిస్థితులు బి12 లోపం వల్ల కలుగుతాయి. అలసటతో, బలహీనమైన అనుభూతి చెందే అవకాశం కూడా ఉంటుంది. ఐరన్‌ను ఉపయోగించి మన శరీరంలో ఉత్పత్తి చేయబడే ఒక ప్రోటీన్‌, రక్త కణాల ద్వారా శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ను బట్వాడా చేయటానిక సహాయపడుతుంది. మీ రక్తంలో ఐరన్‌ తక్కువగా ఉన్నప్పుడు మీరు చాలా నీరసంగా ఉంటారు. శరీరానికి బలహీనంగా అనిపించటంతో పాటుగా చికాకుగా, ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు భావించటం గమనించవచ్చు. ఐరన్‌ అధిగమించటానికి బీట్‌రూట్‌ని ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే మేలు.
-కందుల లత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page