ఔటర్‌ దాటుతున్న ‘హైడ్రా’

  • సవిూప చెరువుల రక్షణకు ప్రణాళిక
  • క్షేత్రస్థాయి పరిశీలనతో ఆక్రమణదారులకు దడ

హైదరాబాద్‌తో పాటు నగరంతోపాటు నగరం చుట్టూ ఉన్న చెరువుల సంరక్షణపై హైడ్రా పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తోంది. కొన్ని తటాకాల విషయంలో అధికారులు హద్దులు మార్చినట్లు, తప్పుడు పత్రాలు సృష్టించినట్లు హైడ్రా విచారణలో తేలింది. వాటిని చట్టపరంగా ఎదుర్కొనేందుకు కమిషనర్‌ రంగనాథ్‌ కేంద్ర ప్రభుత్వ సంస్థ సాయం తీసుకోబోతున్నారు. నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌సీ నుంచి 45 ఏళ్ల నాటి ఉపగ్రహ చిత్రాలను సేకరించేందుకు సిద్ధమయ్యారు. హైడ్రా, ఎన్‌ఆర్‌ఎస్‌సీ మధ్య త్వరలో ఒప్పందం జరగనుంది. ఇప్పుడు వెనకడుగు వేస్తే.. నగరంలో మిగిలిన అరకొర చెరువులు కూడా కబ్జా అవుతాయని, యుద్ధ ప్రాతిపదికన వాటిని రక్షించాల్సిన అవసరం ఉందని హైడ్రా భావిస్తోంది.

లక్ష్యం నెరవేరే వరకు వెనకడుగు ఉండదని కమిషనర్‌ రంగనాథ్‌ స్పష్టం చేశారు. సరైన ఆధారాలతో కూల్చివేతలు చేపట్టినప్పుడే పనులు లక్ష్యం ప్రకారం కొనసాగుతాయని హైడ్రా భావిస్తోంది. అందులో భాగంగా ఇటీవల కమిషనర్‌ రంగనాథ్‌ బాలానగర్‌లోని ఎన్‌ఆర్‌ఎస్‌సీ కేంద్రాన్ని సందర్శించారు. శాస్త్రవేత్తలతో హైడ్రా కార్యక్రమాలను పంచుకున్నారు. చెరువుల రక్షణకు సాయం కావాలని అడిగారు. అధికారికంగా చెరువుల హద్దులను నిర్ణయించి, స్పష్టమైన పటాలను ఇవ్వాలని కోరారు. కొందరు అధికారులు ఎఫ్‌టీఎల్‌ హద్దులను మార్చినట్లు తెలుస్తోంది.

అలాంటి సందర్భాల్లో ఎన్‌ఆర్‌ఎస్‌సీ పటాలు ఉపయోగపడతాయి. అధికారికంగా వాటిని కొనుగోలు చేస్తామని, త్వరగా ఏర్పాటు చేయాలని శాస్త్రవేత్తలను కోరాం అని రంగనాథ్‌ వివరించారు. ఎన్‌ఆర్‌ఎస్‌సీ సంస్థ ఇప్పటికే హైడ్రా అభ్యర్థన మేరకు 56 చెరువుల పటాలను అందజేసింది. 1979`2023 ఏళ్ల మధ్య చెరువులు ఏ విధంగా ఆక్రమణకు గురయ్యాయో చిత్రాలతో సహా వివరించింది. అనేక తటాకాలు కొన్ని రోజుల్లో కనుమరుగవుతాయని చెప్పడమే వాటి ఉద్దేశం. ఆయా పటాలను మరింత పక్కాగా రూపొందించి, హద్దులను నిర్ణయించాలని తాజాగా హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ పరిశోధన సంస్థను కోరడం గమనార్హం. ఈ క్రమంలో ఉపగ్రహ చిత్రాల ఆధారంగా గతంలో ఉన్న చెరువులు నాలాలు గుర్తించి త్వరగా చర్యలు చేపట్టబోతున్నారు. ఈ క్రమంలో చెరువుల రక్షణపై మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page