సమంత విడాకులకు కెటిఆరే ‌కారణం

సినిమావాళ్లకు డ్రగ్స్ అలవాటు చేసిన ఘనుడు
మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్‌ ‌సమంత విడిపోవడానికి బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆరే కారణమని  మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం అలవాటని.. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది ఆయనేనని ఆరోపించారు. బాపూఘాట్‌లో గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘కేటీఆర్‌కు తల్లి అక్క, చెల్లి లేరా.. హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్‌ ఆడుకున్నారు. మత్తుపదార్థాలు అలవాటు చేశారు. వాళ్ల ఫోన్లు ట్యాప్‌ ‌చేశారు.

చాలా మంది హీరోయిన్లు త్వరగా పెళ్లిళ్లు చేసుకుని సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి ఆయనే కారణం. ఆయన డ్రగ్స్‌కు అలవాటు పడి వాళ్లకూ అలవాటు చేశారు. రేవ్‌ ‌పార్టీలు చేసుకుని వాళ్లని బ్లాక్‌ ‌మెయిల్‌ ‌చేశారు. ఈ విషయం సినీ ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసు. బీఆర్‌ఎస్‌ ‌దొంగ ఏడుపులు మాకవసరం లేదు. హరీష్‌ ‌రావు మనసున్న‌   మనిషిగా స్పందించారు. నాపై ట్రోలింగ్‌ ‌జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదు? మంత్రి సీతక్క, మేయర్‌ ‌గద్వాల విజయలక్ష్మిపై అసభ్యకర పోస్టులు పెట్టారు. ఐదేళ్లు బీఆర్‌ఎస్‌లో పనిచేశా.. నా వ్యక్తిత్వం అందరికీ తెలుసు. అసభ్యకరంగా పోస్టులు పెట్టినవారిపై ఫిర్యాదు చేశాం. ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తిచూపాలి. వ్యక్తిత్వం దెబ్బతీసేలా ప్రవర్తించవద్దు. దుబాయి నుంచి నాలుగు సోషల్ ‌మీడియా అకౌంట్లతో నాపై ఫేక్‌ ‌పోస్టులు పెడుతున్నారు’అని సురేఖ అన్నారు.

జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా తాను మెదక్‌ ‌వెళ్లినప్పుడు.. చేనేత కార్మికుల సమస్యలను చెబుతూ.. బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు గౌరవసూచకంగా తనకు ఒక నూలు దండ వేస్తే.. దాన్ని బీఆర్‌ఎస్‌ ‌సోషల్ ‌మీడియా అసభ్యకరంగా ట్రోల్‌ ‌చేసిందంటూ మంత్రి కొండా సురేఖ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ట్రోలింగ్‌ ‌చూసి గడిచిన రెండ్రోజులుగా తనకు అన్నం సహించడం లేదని, నిద్ర పట్టట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కేటీఆర్‌, ‌హరీష్‌రావు ఇంట్లో ఆడవాళ్లపైనా ఇలాంటి ట్రోలింగ్‌ ‌చేస్తే వారికెలా ఉంటుందని ప్రశ్నించారు.

రఘునందన్‌రావు తనకు సోదర సమానుడని, ఆయన తనకు ఫోన్‌ ‌చేసి బాధపడ్డారని వెల్లడించారు. తనపై అసభ్యకరంగా పెట్టిన పోస్టులో డీపీ హరీష్‌రావుది ఉందన్నారు. తనపైన జరిగిన ట్రోలింగ్‌కు హరీష్‌, ‌కేటీఆర్‌లు క్షమాపణ చెప్పాలన్నారు. బీఆర్‌ఎస్‌ ‌సోషల్ ‌మీడియా ద్వారా ఇకపైన ఇలా ట్రోలింగ్‌లు చేస్తే క్షమించేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు.. కేటీఆర్‌ ‌బట్టలు విప్పించి బజారున ఉరికిస్తరని హెచ్చరించారు. తనపై అసభ్యకరంగా పెట్టిన పోస్టుపై సైబర్‌ ‌క్రైమ్‌లో ఫిర్యాదు చేశామని, సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికీ తీసుకెళ్లామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page