ధ్యానమే నీ జ్ఞానమై…!

పుట్టి నూటయాభై వసంతాలు
గడిచినప్పటికీ ఓ పురాణ అవతార
పురుషుడిలా పుడమితల్లి పై
అ”సామాన్యుడై” మన మధ్యే
బాపూజీ కదలాడుతున్నాడు..!

సత్యం గాంధీజీలా జీవం పోసుకొని
మానవ నాగరికతకు బ్రతుకు
పాటపు నడక నేర్పుతుంది.
అహింస నేటి ఉషోదయాన్ని
గుండెకత్తుకొని సత్యాగ్రహమై
ఈ జగతి గొంతుకై మాట్లాడుతుంది..!

శారీరక మానసిక ఆధ్యాత్మిక
ఎదుగుదలలో ప్రకృతి వైద్యమే
పరమాత్ముని ప్రసాదమై  కనిపిస్తుంది..!
నీ అంతర్గత వ్యర్థ పదార్థాలను నిశ్శబ్దంగా
నీ నుంచే శాశ్వతంగా విసర్జిస్తుంది.!

ప్రకృతి పరిణామమే నీ ప్రాణాన్ని బ్రతికిస్తుంటే
ఆధునిక వైద్యమే ఆశ్చర్యపోతుంది.!
ప్రకృతి చూపుతున్న”ఆరోగ్య అవసరాలను”
పరిశోధించడం మొదలుపెట్టింది.!

ఉపవాసమే నీకు ఊపిరి పోస్తుంటే
పచ్చికూరగాయలు,పండ్లే
నీకు పదికాలాలపాటు ప్రాణం పోస్తుంటే
గోరువెచ్చని నీటి స్నానమే నిన్ను సంస్కరిస్తుంది..!

ధ్యానమే నీ జ్ఞానమై ప్రకాశిస్తుంటే
యోగాసనాలే ఆరోగ్యసూత్రాలైతే
వినిపిస్తుందా..!
ఇప్పుడు ప్రకృతి పరవశిస్తుంది..!
గాంధీజీ ప్రబోధించిన ప్రకృతి వైద్యమే
నా వాదమని,అనుసరణీయ మార్గమని
మనకు మళ్ళీ మళ్ళీ మననం చేస్తుంది..!

ఫిజిక్స్ అరుణ్ కుమార్
నాగర్ కర్నూల్
9394749536

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page