ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ‌లో పోలీసుల పాత్ర కీల‌కం

మన సైబర్‌ ‌క్రైమ్‌ ‌విభాగం దేశంలోనే గొప్పది..
ప్రజలు  ప్రశాంతంగా ఉంటున్నారంటే ఖాకీలే కారణం
రాష్ట్ర అభివృద్దిలోనూ వారిదే కీలక బాధ్యత
శాంతిభద్రతలతోనే రాష్ట్రానికి పెట్టుబడులకు అవ‌కాశం
మరణించిన పోలీస్‌ ‌కుటుంబాలకు రూ.2కోట్ల వరకు సాయం
అమరపోలీసులకు నివాళి అర్పించిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌21: ‌శాంతి భద్రతలు, నిఘా విషయంలో తెలంగాణ పోలీసుల పాత్ర అత్యంత‌ కీలకమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దేశ భద్రత, ప్రజల రక్షణలో పోలీసుల పాత్ర ఎనలేనిదన్నారు. అమరులైన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భ‌రోసా ఇచ్చారు. విధి నిర్వహణలో మరణించిన అధికారులను గుర్తు చేసుకోవడం అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. అమరులైన కానిస్టేబుల్‌, ఏఎస్సై కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లోని గోషామహల్‌ ‌స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. విధి నిర్వహణలో అసువులుబాసిన‌ పోలీసులకు సీఎం నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌ ‌ప్రసంగిస్తూ.. 140 కోట్ల దేశ జనాభా ప్రశాంతంగా ఉంటున్నారంటే అందుకు పోలీసులే కారణమన్నారు. రాష్ట్రం ప్ర‌గ‌తి ప‌థంపైపు నడవాలంటే పోలీసులు కీలకమన్నారు. , శాంతి భద్రతలు లేకుంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావని.. రాష్ట్రం అభివృద్ధికి పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నందుకు అభినందనలు తెలిపారు.

అమరులైన ఎస్సై, సీఐ కుటుంబాలకు రూ.కోటి 25 లక్షలు.. డీఎస్పీ, ఏఎస్పీ కుటుంబాలకు రూ.కోటి 50 లక్షలు.. ఎస్పీ, ఐపీఎస్‌ ‌కుటుంబాలకు రూ.2 కోట్ల పరిహారం ఇస్తామన్నారు. శాశ్వత అంగవైకల్యం పొందిన పోలీసులకు పరిహారం ఇస్తామని ప్రకటించారు.‘పోలీసు సిబ్బందిపై నాకు ప్రత్యేక అభిమానం ఉంది. పోలీసులు, వారి కుటుంబాలు ఆత్మగౌరవంతో జీవించాలి. ఎవరి ముందో చేయి చాచే పరిస్థితి తెచ్చుకోవొద్దని, విమర్శలకు అవకాశం ఇవ్వొద్దని కోరారు. విధి నిర్వహణలో పోలీసులకు ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకుంటామ‌ని తెలిపారు. వారి ఖర్చులు, ఇతర ఏర్పాట్లకు నిధులు కేటాయిస్తామ‌న్నారు.

మన సైబర్‌ ‌క్రైమ్‌ ‌విభాగం దేశంలోనే గొప్పది..
నేరగాళ్లు సరికొత్త విధానాలతో ముందుకొస్తున్నార‌ని, . పెరుగుతున్న ఆధునిక సాంకేతికతతో నేరాలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ పోలీసుల విధానాలను ఇతర రాష్ట్రాలు పాటిస్తున్నాయి. మన ఫోరెన్సిక్‌ ‌ల్యాబ్‌ అనేక రాష్ట్రలకు ఆదర్శంగా నిలుస్తోంది. మన సైబర్‌ ‌క్రైమ్‌ ‌విభాగం దేశంలోనే గొప్పదని కేంద్ర హోంశాఖ అభినందించింది. ఇవాళ డ్రగ్స్ ‌మహమ్మారి యువతను పట్టిపీడిస్తోంది. డ్రగ్స్ ‌వల్ల పంజాబ్‌ అనేక కష్టాలు ఎదుర్కొంటోంది. మాదకద్రవ్యాల వినియోగం రాష్ట్రంలో క్రమంగా పెరుగుతోంది. వీటి నివారణకు రాష్ట్రంలో టీజీన్యాబ్‌ను ఏర్పాటు చేశాం. ఏఐ పరిజ్ఞానంతో ట్రాఫిక్‌ ‌నియమాలు ఉల్లంఘించేవారిని గుర్తిస్తున్నాం. నేరస్థులను కఠినంగా శిక్షించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. శాంతిభద్రతలను చేతుల్లోకి తీసుకోవద్దని ప్రజలను కోరుతున్నాం. వివిధ పండుగలు ప్రశాంతంగా జరుపుకోవడంలో పోలీసుల సేవలు మరచిపోలేము. జీతం కోసం వారు పనిచేయడం లేదని అన్నారు.  బాధ్యతాయుతంగా భావించి సేవలు అందిస్తున్నారు‘ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.  తీవ్రవాదులు, మావోయిస్టు చేతుల్లో మరణించిన అధికారులను స్మరించుకోవడం అందరికి స్ఫూర్తిదాయకమన్నారు. సైబర్‌ ‌నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని.. డ్రగ్స్ ‌మహమ్మారి యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు.దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ‌సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు. మందిరాల ద, మజీద్‌ల ద దాడులు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇటీవల ముత్యాలమ్మ గుడిపై దాడి చేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. శాంతి భద్రతలు తమ చేతిల్లోకి తీసుకునే వారి పట్ల కఠినంగా ఉండాలని తెలిపారు.

వివిధ పండుగలు ప్రశాంతంగా జరుకోవడంలో పోలీస్‌ ‌సేవలు మరచిపోలేమని కొనియాడారు. జీతం కోసం పోలీస్‌ ‌సిబ్బంది పనిచేయడం లేదని.. బాధ్యతాయుతంగా భావించి పోలీసులు సేవలు అందిస్తున్నారన్నారు. క్రిమినల్స్‌తో పోలీసులు ఫ్రెండ్లీగా ఉండడం కాదని.. బాధితులతో ఫ్రెండ్లీగా ఉండాలని సూచించారు. క్రిమినల్స్ ‌విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. పోలీస్‌ ‌కుటుంబాల కోసం యంగ్‌ ఇం‌డియా స్కూల్‌ను ఈరోజు ప్రారంభిస్తున్నామన్నారు. 50 ఎకరాల విస్తీర్ణంలో యంగ్‌ ఇం‌డియా పోలీస్‌ ‌స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నామని.. ఈరోజు పునాది వేస్తున్నామన్నారు. వొచ్చే అకాడ నుంచి విద్యా సంస్థ ప్రారంభిస్తామని చెప్పారు. నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహారించాలని స్పష్టం చేశారు. ‘పోలీస్‌ ‌సమస్యలు ఏమున్నా నా దగ్గరికి తీసుకువస్తే నేను పరిష్కరిస్తా‘ అని తెలిపారు. వీర మరణం పొందిన పోలీస్‌ ‌కుటుంబాలకు ఇక నుంచి రూ.కోటి నష్ట పరిహారం అందజేయనున్నట్లు ప్రకటించారు. కానిస్టేబుల్‌, ‌హెడ్‌ ‌కానిస్టేబుల్‌కు కోటి రూపాయలు, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇన్‌స్పెక్టర్‌లకు కోటి 25 లక్షలు, డీఎస్పీ, అడిషనల్‌ ఎస్పీ, ఎస్పీలకు కోటి 50 లక్షలు, ఐపీఎస్‌ ‌కుటుంబాలకు 2 కోట్లు ఇస్తామని.. అలాగే శాశ్వతంగా అంగవైకల్యం పొందిన కుటుంబాలకు కూడా నష్ట పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఇంతే కాకుండా చనిపోయిన కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని సీఎం రేవంత్‌ ‌రెడ్డి ప్రకటించారు.

దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులను స్మరించుకోవడం మన బాధ్యత అని డీజీపీ జితేందర్‌ అన్నారు. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 214 మంది పోలీసులు అమరులు అయ్యారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక పోలీస్‌ అధికారి ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రవీణ్‌ అనే కానిస్టేబుల్‌ అమరుడు అయ్యారని.. వారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిందని చెప్పారు. తెలంగాణ పోలీస్‌ ‌శాఖ శాంతి భద్రతల విషయంలో ఎక్కడ రాజీపడడం లేదని స్పష్టం చేశారు. సైబర్‌ ‌సెక్యూరిటీ వింగ్‌ ఏర్పాటు.. వాటికి కావాల్సిన సౌకర్యాలు అన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. సైబర్‌ ‌నేరాలను అరికట్టడంలో తెలంగాణ పోలీస్‌ ‌శాఖ ముందు వరుసలో ఉందని డీజీపీ జితేందర్‌ ‌పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులను స్మరించుకోవడం మన బాధ్యత అని డీజీపీ జితేందర్‌ అన్నారు. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది 214 మంది పోలీసులు అమరులయ్యారని చెప్పారు. తెలంగాణ రాష్టం నుంచి ఒక పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. సైబర్‌ ‌నేరాలను అరికట్టడంలో తెలంగాణ పోలీసు శాఖ ముందు వరుసలో ఉందని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page