హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్26:రాష్ట్ర ప్రజలకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఇంటి వద్దకే నేరుగా టీజీఎస్ ఆర్టీసీ కార్గో సేవలను అందించనున్నట్లు రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వెల్లడిరచారు. ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునేందుకు లాజిస్టిక్స్(కార్గో) సేవలను మరింతగా విస్తరిస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు. అందులో భాగంగానే రాజధాని హైదరాబాద్‌లో వేగవంతమైన సేవలను అందించేందుకు హోం డెలివరీ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆదివారం నుంచి హైదరాబాద్ లోని 31 ప్రాంతాల నుంచి హోం డెలివరీ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంటర్స్ నుంచి హైదరాబాద్ లో ఎక్కడికైనా హోం డెలివరీ చేయవచ్చని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంటి నుంచి ఇంటి వరకు సేవలు అందించేలా లాజిస్టిక్స్ విభాగాన్ని టీజీఎస్ఆర్టీసీ అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ప్రజలందరూ హోం డెలివరీ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని వినియోగదారులను మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
పార్శిళ్ల హోం డెలివరీ చార్జీలు ఇవీ..!
0 నుంచి 1 కేజీ పార్శిల్‌కు రూ.50, 1.01నుంచి 5 కేజీలకు రూ.60, 5.01 నుంచి 10 కేజీలకు రూ.65, 10.1 నుంచి 20 కేజీలకు రూ.70, – 20.1 నుంచి 30 కేజీలకు రూ.75, 30.1 కేజీలు దాటితే.. పైన పేర్కొన్న స్లాబ్‌ల ఆధారంగా ధరలు ఉంటాయనిఆర్టీసీ అధికారులు వెల్లడిరచారు.