తెలంగాణ తొలి గిరిజన కళాకారుడు
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
సంతాపం తెలిపిన ప్రధాని మోదీ, సిఎం రేవంత్
హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్26:గుస్సాడీ నృత్యాన్ని విస్తృత పరిచిన 94ఏళ్ల పద్మశ్రీ కనకరాజు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. గిరిజన బిడ్డల సంస్క•తి సంప్రదా యాలకు ప్రతీకగా నిలిచే గుస్సాడీ నృత్యంతో కనకరాజు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సొంతూరు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలం మార్లవాయి గ్రామం. ఆయన గత కొంత కాలంగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అనేక ఆసుపత్రుల్లో చూపించిన ప్రయోజనం లేకపోయింది. గుస్సాడీ నృత్యాన్ని కాపాడుతూ వచ్చిన వ్యక్తిగా పేరు ఉన్న కనకరాజుకు కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రకటించింది.
అప్పటి రాష్ట్రపతి కోవింద్ చేతుల దుగా ఆయన ఈ అవార్డును నవంబర్ 9న అందుకున్నారు. వందల మంది యువకులు ఆయన వద్ద గుస్సాడీ నృత్యం నేర్చుకొని శిష్యులుగా మారారు. గిరిజన బిడ్డలకు ఎంతో ఇష్టమైన గుస్సాడీ నృత్యానికి వన్నె తేవడమే కాకుండా పద్మశ్రీ అందుకొని తెలంగాణ ఖ్యాతిని మరింత పెంచిన కనకరాజు మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు చేస్తామని ప్రకటించారు. గుస్సాడీ కళాకారుడు కనకరాజు మృతి పట్ల సీఎం రేవంత్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికారిక లాంఛనాలతో శనివారం అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. కనకరాజు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. గుస్సాడీ నృత్యం కోసం ఆయన చేసిన సేవలు మరవలేనివన్నారు. కనకరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.