హైదరాబాద్, ప్రజాతంత్ర అక్టోబర్ 28 : తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించింది. డిస్కమ్‌ల ప్రతిపాదనలను సోమవారం ఈఆర్సీ తిరస్కరించటంతో సామాన్య వినియోగదారులకు ఊరట లభించినట్లైంది. 800 యూనిట్లు దాటితే ఫిక్స్‌డ్ ఛార్జీలు రూ.10 నుంచి రూ.50 పెంచాలనే డిస్కమ్‌ల ప్రతిపాదనలను కమిషన్ తిరస్కరించింది. డిస్కమ్‌ల 8 పిటిషన్లపై కమిషన్ తన అభిప్రాయాలను వెల్లడించిందని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు వెల్లడించారు. 40 రోజుల తక్కువ సమయంలో నిర్ణయం వెలువరిస్తున్నామని, విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, వినియోగదారులు, ప్రభుత్వ సబ్సిడీ దృష్టిలో పెట్టుకొని కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. ఎనర్జీ చార్జీలు ఏ కేటగిరిగిలో కూడా పెంచడం లేదన్నారు. స్థిర చార్జీలు రూ.10 యధావిధిగా ఉంటాయని, పౌల్ట్రీ ఫామ్, గోట్ ఫామ్‌లను కమిషన్ ఆమోదించలేదని హెచ్‌టీ కేటగిరిలో ప్రతిపాదనలు రిజక్ట్ చేశామని శ్రీరంగరావు తెలిపారు.