అబద్దాల్లో గోబెల్స్ ను మించిపోయారు..

హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, అక్టోబ‌ర్ 30 : పిల్లలు ఎక్కడ చెడిపోతారోనన్న భయంతో.. తల్లిదండ్రులు టీవీలు బంద్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అబద్దాలు చూసి గెబెల్స్ కూడా సిగ్గు పడ‌తారు. ఆయ‌న మాటలపై ప్రజలకు నమ్మకం పోతోంది. ముఖ్య‌మంత్రి మాటలు విన్న పిల్లలు.. వాటినే పరీక్షల్లో రాస్తే పరిస్థితి ఏంటి? హైద‌రాబాద్ కు మూడు దిక్కులా సముద్రం ఉందన్న రేవంత్ కామెంట్స్ పై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టాడని అంటాడు. దిల్‌సుఖ్‌నగర్ లో విమానాలు అమ్ముతారని రేవంత్ అనటం హాస్యాస్పదం. మల్లన్న సాగర్‌లో 50,000 ఎకరాలు ముంపునకు గురైందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. మొత్తం ప్రాజెక్ట్ సేకరించిన భూమి 17,871 ఎకరాలు. అందులో 3280 ఎకరాలు ప్రభుత్వ ల్యాండ్ ఉంది. మొత్తం సేకరించిన భూమి 14,591 ఎకరాలు మాత్రమే. మరి 50వేల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది. నిర్వాసితులకు 2013 చట్టం కంటే మెరుగైన ప్యాకేజీ ఇచ్చాం.

అవన్నీ ప్రభుత్వ రికార్డులే.. గోబల్స్ సిగ్గుపడే లాగా సీఎం రేవంత్‌ అబద్ధాలు చెబుతున్నార‌ని హ‌రీష్‌ రావు విమ‌ర్శించారు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి, మళ్లీ వొచ్చి మల్కాజ్‌గిరిలో పోటీ చేశాడ‌ని, ఆగస్టు 15లోగా రుణమాఫీ పూర్తి చేస్తామని మాట తప్పాడు. మాట మీద నిలబడని ముఖ్యమంత్రిగా రేవంత్ చరిత్రలో నిలుస్తారు. 31 రకాల సాకులతో రుణమాఫీ ఎగ్గొట్టారు. దాన్ని పూర్తి రుణమాఫీ కాదు.. పాక్షిక రుణమాఫీ అంటారు. ఏడాది కావ‌స్తున్నా ఇంకా పూర్తి క్యాబినెట్ వేయలేక పోయార‌ని ఎద్దేవా చేశారు. రాష్ట్రం సమస్యల కుప్పగా మారింద‌ని, ముఖ్యమంత్రి చేయాల్సిన పనులు పక్కన పెట్టీ రాజకీయాలు చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. కేసీఆర్‌కి రేవంత్ కు పోలిక, పొంతన ఉందా.. నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంద‌ని, కేసీఆర్ లేకపోతే తెలంగాణ వొచ్చేదా..? రాకపోతే నువు తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతుండేనా. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి.. కేసీఆర్ పెట్టిన భిక్ష అని హ‌రీష్‌రావు అన్నారు.

ఇప్పుడు ఎన్నికలు పెడితే.. బీఆర్ఎస్ కు 100 సీట్లు వస్తాయని, సీనియర్లు తన కుర్చీని గుంజుకోకుండా రేవంత్ చూసుకోవాలని, కుర్చీని ఎప్పుడు ఎవరు గుంజుకుపోతారోనన్న భయంతో రేవంత్ ఉన్నాడని, ఐదేళ్ళ తర్వాత వొచ్చేది బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మేన‌ని, సీఎం అయ్యేది కేసీఆర్ అని ప్రజలు డిసైడ్ అయ్యారని తెలిపారు. దేశంలో కాంగ్రెస్ మూడు సార్లు ఓడింది. కాంగ్రెస్ ఖతం అయిపోయింది. రుణమాఫీ విషయంలో రేవంత్ రైతులను మోసం చేశాడు. ఆరు మంత్రి పదవులను నింపడానికే రేవంత్ కు హైకమాండ్ అనుమతి ఇవ్వట్లేదు. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులును కూడా భ‌ర్తీ చేయ‌లేదు. ఈ మధ్య కాలంలో ఒక మంత్రి గవర్నర్‌ను కలిశాడు. ఇంకో మంత్రి హెలికాప్టర్ ఇవ్వలేదని అలిగాడు. మరో మంత్రి ఏమో దిల్లీకి వెళ్లాడు.

కొంత మంది మేము సీఎం అవుతామని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. నీ కుర్చీ ఎవరు లాగుతారో చూసుకో. మూసీ ప్రాజెక్టు అభివృద్ధికి మేం అనుకూలం.. కానీ, మూసీ సుందరీకరణ పేరిట కమిషన్ల కోసం పేదల ఇండ్లు కులగొడతామంటే అంగీక‌రింబోమ‌ని హ‌రీష్‌రావు స్ప‌ష్టంచేశారు. కొండ పోచమ్మ సాగర్ నుంచి మూసికి నీళ్లు తెచ్చేందుకు కేసీఆర్ డీపీఆర్ చేశారు. మీరు కొండ పోచమ్మ సాగర్ కాకుండా మల్లన్నసాగర్ నుంచి ఎందుకు మరుస్తున్నారు. 1100 కోట్లతో అయ్యే పనిని రూ.7000 కోట్లకు కమిషన్ కోసం పెంచారని ఆరోపించారు. . గచ్చిబౌలిలో ప్రభుత్వం 500 ఎకరాలు కోర్టు కేసులో ప్రభుత్వం గెలిచింద‌ని,ఆ భూమిని మూసీ బాధితులకు ఇవాల‌న్నారు. ఈ భూమిని అమ్ముకొని 10 వేల కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, మల్లన్నసాగర్‌లో మేము నిర్వాసితులకు ఇచ్చిన నష్టపరిహారం కంటే ఎక్కువ మూసి బాధితులకు ఇవాల‌ని డిమాండ్ చేశారు. మేము 250 గజాల్లో డబల్ బెడ్ రూం ఇల్లుతో పాటు ఉపాధి క‌ల్పించామ‌ని చెప్పారు. 18 ఏండ్లు నిండిన వారికి రూ.5 లక్షలు ఇచ్చామ‌ని తెలిపారు.

పోలీసుల‌ను సస్పెండ్ చేయటం అన్యాయం
ఏక్ పోలీస్ అమలు చేస్తామని ఎన్నికల్లో రేవంత్ చెప్పాడ‌ని, తనకు రక్షణ కల్పించే పోలీసులపై కూడా రేవంత్ కు నమ్మకం లేకుండా పోయింద‌ని హ‌రీష్‌ రావు విమర్శించారు. కానిస్టేబుల్స్ సమస్యలు తెలుసుకునే సమయం లేదా? సీఎంకు? బాపూఘాట్ లో భారీ గాంధీ విగ్రహాం పెడితే స్వాగతిస్తాం కేసీఆర్ పెట్టిన అంబేద్కర్ విగ్రహానికి దండం పెట్టడు.. ప్రజలు దర్శించుకునే అవకాశం ఇవ్వడు.. ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నందుకు బేగంబజార్ లో నాపై కేసు పెట్టారు. రేవంత్ రెడ్డి తప్పిదాలతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డమాల్ అయిందన్నారు.

మూసీ నుంచి వాడపల్లికి వరకు రేవంత్ తో పాదయాత్రకు రెడీ
మూసీ నుంచి వాడపల్లికి రేవంత్ తో పాదయాత్రకు తాను రెడీ అని హరీష్ రావు ప్రకటించారు. టైం చెప్తే కేటీఆర్, నేను.. ఇద్దరం వస్తామని తెలిపారు. గన్ మెన్లు లేకుండా..‌ రేవంత్ రెడ్డి మూసీపై పాదయాత్రకు రావాలన్నారు. మెదటి రేవంత్ సొంత కుర్చీని కాపాడుకోవాలి. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి, మూలధన పెట్టుబడి, సంక్షేమాల కోసం చేసిన అప్పు 4లక్షల 26వేల 499 కోట్లు మాత్రమే. కానీ గడిచిన పది నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిధిలో చేసిన అప్పు 51,188 కోట్లు. జూలై 26 నాటికే 24,887 కోట్ల ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ కు తీసుకున్నట్లు అసెంబ్లీలోనే చెప్పారు. తర్వాత టీఎస్ స్కాబ్, ఎన్సీడీసీ నుంచి మరో 5 వేల కోట్లు తీసుకున్నారు.

ఇవి గాక ఇతర సంస్థల నుంచి మరో 2,3 వేల కోట్లు తీసుకున్నారు. ఇలా మొత్తం పది నెలల కాలంలోనే 85 వేల కోట్ల దాకా అప్పు తీసుకున్నట్లు క్లియర్ గా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న బడ్జెటేతర రుణాల వివరాలను కాగే తన సెప్టెంబర్ నివేదికలో చెప్పింది. అది 85వేల కోట్లా, లక్ష కోట్లా అనేది కాగ్ కు ప్రభుత్వం చెప్పాల్సి ఉన్నది. ఎందుకు చెప్పడం లేదు. ఎందుకు దాస్తున్నరు. తీసుకున్న రుణాలను ఏం చేస్తున్నరు. రేవంత్ బెదిరింపులకు ఎవరు భయపడరు కేటీఆర్ ప్రశ్నించే గొంతుక కేటీఆర్ పై పగపడుతున్నారు. అక్రమ కేసులు పెడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page