మెమోస్‌ ‌మృతి కేసులో ఆరుగురి అరెస్ట్

‌కల్తీ పదార్థాలే కారణమని గుర్తింపు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌1:  ‌మెమోస్‌  ‌తిని ఓ గృహణి చనిపోయిన కేసులో పోలీసులు ఆరుగురుని అరెస్టు చేశారుహైదరాబాద్‌ ‌చింతల్‌ ‌బస్తీలో మెమోస్‌ ‌తయారు చేస్తున్న అల్మాస్‌ను అరెస్టు చేశారుఅస్వస్థతకు కలుషితమైన మోమోస్‌ ‌కారణమా.. లేక అందులో వినియోగించిన మయోనైస్‌ ‌కారణమా అనేది నివేదిక వచ్చాక తెలుస్తుందని అధికారులు వివరించారుమరోవైపు.. కలుషిత మోమోస్‌ ‌కేసులో బంజారాహిల్స్ ‌పోలీసులు మరో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారువీరంతా దిల్లీ మోమోస్‌ ‌నుంచి ఆహార పదార్థాలను కొనుగోలు చేసి.. సంతల్లో విక్రయిస్తుంటారని పోలీసులు వివరించారుబీహార్‌ ‌నుంచి వచ్చిన అల్మాస్‌.. ‌చింతల బస్తీలో మెమోస్‌ ‌తయారు చేస్తున్నాడుమెమోస్‌ ‌తయారీకి నాసిరకం పదార్థాలు వాడడంతో ప్రమాదం సంభవించిందని గుర్తించారు.  నాసిరకంతో పాటు అపరిశుభ్రత విష పదార్థంగా మెమోస్‌ ‌మారింది

బంజారా హిల్స్‌లో వారాంతపు సంతలో పెట్టిన మెమోస్‌ను రేష్మ బేగం అనే మహిళ తిన్న వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందిహాస్పిటల్‌కి తరలించే లోపే ఆమె చనిపోయింది.కలుషిత మోమోస్‌ ‌కారణంగా రేష్మ మృతి చెందగా.. మరో 50 మంది అస్వస్థతకు గురయ్యారుఈ క్రమంలో జీహెచ్‌ఎం‌సీ అధికారులు అప్రమత్తమయ్యారుమూడు రోజుల క్రితం గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలోని 110 మోమోస్‌ ‌తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించితనిఖీ చేపట్టారుఅనుమతులు లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ఫాస్ట్‌ఫుడ్‌ ‌సెంటర్లలో మోమోస్‌ను తయారు చేస్తున్నట్లు గుర్తించారుపురుగులు పట్టిన మైదా పిండికాలం చెల్లిన ముడిపదార్థాలను మోమోస్‌ ‌తయారీకి వినియోగిస్తున్నట్లు నిర్దారించారుకొన్ని తయారీ కేంద్రాల్లో అపరిశుభ్రతడ్రైనేజీ ఓవర్‌ప్లో వంటి పరిస్థితులను గుర్తించారు69 కేంద్రాల్లో మోమోస్‌ ‌నమూనాలను సేకరించిపరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారుల్యాబ్‌ ‌నుంచి నివేదిక వచ్చాక.. సంబంధిత మోమోస్‌ ‌తయారీ కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని అదనపు కమిషనర్‌ ఎస్‌.‌పంకజ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page