కొత్త వోటర్లు పేర్లు నమోదు చేసుకోవాలి

  •  ఈనెల 9, 10 తేదీలతో స్పెషల్ డ్రైవ్.. ఈనెల 28వ తేదీ తుది గడువు
  • రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం వోటర్ల సంఖ్య 3,34,26,323 కోట్లు
  • 8.01 లక్షల నుండి 10.03 లక్షలకు పెరిగిన యువ వోటర్ల సంఖ్య
  • eci.gov.inవెబ్సైట్ ద్వారా జాబితాలో తమ పేర్లు తెలుసుకోవచ్చు
  • రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో వోటర్లుగా చేరేందుకు ఈనెల 28వ తేదీ తుది గడువు అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఓటర్లుగా చేరేందుకు ఈనెల 9, 10 తేదీలతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఆరోజు బూత్ లెవల్ అధికారులు, సిబ్బంది అన్ని నియోజక వర్గాల పరిధిలో అందుబాటులో ఉంటారని ఆయన వెల్లడించారు. వోటర్లు పేర్లు నమోదు చేసుకున్నాక 2025 జనవరి 1న డ్రాఫ్ట్ లిస్ట్ రూపొందించి, అదే నెల 6న తుది వోటర్ల జాబితాను ప్రచురిస్తామన్నారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ ఆదర్శ్ నగర్ లోని బి.ఆర్.కె భవన్(బూర్గుల రామకృష్ణ భవన్) ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల వోటర్ల జాబితాను రూపొందిస్తున్నామని, పేర్లు లేని కొత్త వోటర్లు, అలాగే ఇంటి నెంబర్లు, జిల్లా మారిన వారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

వోటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవడానికి ఈనెల 25 తుది గడువు అని, ఈ క్రమంలో ఈనెల 9, 10 తేదీల్లోనూ బూత్ లెవల్లో తమ అధికారులను సంప్రదించి వోటర్లుగా చేరాలన్నారు. వోటర్ల జాబితా తుది సవరణను 2025 జనవరి ఒకటో తేదీన ఫైనల్ డ్రాప్టు తయారు చేసి అదే నెల 6వ తేదీన వోటర్లుగా ముద్రించి అన్ని జిల్లాలకు పంపిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం వోటర్ల సంఖ్య 3 కోట్ల 34 లక్షల 26 వేల 323 గా ఉందన్నారు. వీరిలో కోటి 66 లక్షల 16 వేల 446 మంది పురుషులు, కోటి 68 లక్షల 7,100 మంది మహిళా వోటర్లు, 2 వేల 777 మంది థర్డ్ జెండర్ కు చెందినవారు ఉన్నారన్నారు. అక్టోబరు 20 లోపు పరిశీలించిన వోటర్ల జాబితా దరఖాస్తుల్లో 3 లక్షల 2 వేల 805 మంది వోటర్ల పేర్లలో చేర్పులు, 4,14,165 పేర్లను తొలగించామని, 5,93,956 మంది వోటర్ల పేర్లు సరిదిద్దామన్నారు. మార్పులు జరిగాయాన్నారు. జోడించామని, వోటర్లు తెలిపిన నిర్ణీత ఇళ్లతో లేని 4 లక్షల 14 వేల 165 మంది వోటర్లను జాబితా నుండి తొలగించామని అన్నారు. కాగా, ఈ సారి అదనంగా 15 నుంచి 19 సంవత్సరాల వయస్సు యువ వోటర్ల సంఖ్య 8.01 లక్షల నుండి 10.03 లక్షలకు గణనీయంగా పెరిగిందని అన్నారు.

అదే సమయంలో 35 ఏళ్లు పైబడిన 2 లక్షల 25 వేల 462 మంది, వికలాంగులు 5 లక్షల 28 వేల 085 మంది ఉన్నారని ఆయన వెల్లడించారు. గతంతో పోలిస్తే థర్డ్ జెండర్ వోట ర్ల సంఖ్య కూడా 2 వేల 737 నుంచి 2 వేల 777కి పెరిగిందన్నారు. జనవరి-2025 నాటికి 18 ఏళ్లు నిండబోయే యువత వోటర్ ఈ నెల 28 వరకు నమోదు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అన్నింటినీ పరిశీలించి తుది వోటర్ల జాబితా 6 జనవరి 2025న ప్రచురిస్తామని అన్నారు. వోటర్లు eci.gov.in వెబ్సైట్ ద్వారా జాబితాలో తమ పేర్లు తెలుసుకోవచ్చని అన్నారు. సందేహాలకు 1950 టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page