వరంగల్‌ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తాం..

  • రాబోయే 30ఏళ్లకు సరిపడా అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం..
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

వరంగల్, ప్ర‌జాతంత్ర, నవంబర్ 3: వరంగల్ మహా నగరాన్ని రెండవ రాజధానిగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నట్లు రెవెన్యూ, హౌసింగ్ సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం మంత్రి పొంగులేటి..  నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కెఆర్ నాగరాజు, వరంగల్, హనుమకొండ జిల్లాల‌ కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, పి.ప్రావీణ్యతో కలిసి వరంగల్ భద్రకాళి బండ్ సుందరీకరణ పనులు, భద్రకాళి చెరువు బొందివాగు వరద నివారణ పనులు, భద్రకాళి మాడ వీధులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. భద్రకాళి చెరువు బొంది వాగు వరద నివారణకు ప్ర

Ponguleti Srinivas Reddy
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

భుత్వం రూ.158 కోట్లు మంజూరు చేసిందని, బొంది వాగు నాలా, భద్రకాళి నాలా, భద్రకాళి క్యాష్మెంట్ ప్రాంతాల్లో చేపట్టే వరద నివారణకు సంబంధించిన అభివృద్ధి పనుల మ్యాప్ ను మంత్రి పరిశీలించారు. అధికారుల నుంచి వివ‌రాలు తెలుసుకుని సమర్థవంతంగా పనులను పూర్తిచేసేందుకు మంత్రి తగు సూచనలు చేశారు.

 

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. క్రీస్తు పూర్వం 600 ఏళ్ల క్రితం నిర్మించిన భద్రకాళి అమ్మవారి దేవాలయానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉందని, ఉమ్మడి కరీంనగర్, ఖమం, నిజామాబాద్, మెదక్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్య‌లో భక్తులు వస్తారని తెలిపారు. ఎంతో ప్ర‌సిద్ధి చెందిన ఈ ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ న‌గ‌రంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి రెండో రాజధానిగా అభివృద్ధి చేయడానికి చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. వరంగల్ సమగ్రాభివృద్ధి చర్యల్లో భాగంగా భక్తుల అభిరుచికి అనుగుణంగా భద్రకాళి ఆలయం, మాడ వీధులను ఆగమ శాస్త్రం ప్రకారం అభివృద్ధి. చేస్తామన్నారు. ఆలయాన్ని అనుకొని ఉన్న చెరువును పరిశీలించామ‌ని, సుమారు 380 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు పూడిక పేరుకుపోయి, చెరువు లోతు తగ్గి సమాంతరంగా మారింద‌ని తెలిపారు. దీనివ‌ల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయిందని, వెంటనే చెరువు పూడికతీతకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను అదేశించామ‌ని తెలిపారు.

వ‌రంగ‌ల్ లో ఎయిర్ పోర్ట్‌

కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వొచ్చిన వెంటనే వరంగల్ ప్రాంత వాసులకు ఎయిర్ పోర్ట్‌ సేవలు అందుబాటులోకి తీసుకురానుట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఓఆర్ఆర్, ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు అండర్ డ్రైనేజీ, ఎలక్ట్రిఫికేషన్ రాబోయే 30 ఏళ్ల‌ వరకు నగర ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలను తయారు చేస్తున్నామ‌ని తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళోజీ నారాయణరావు కళాక్షేత్రాన్ని ప్రారంభించ‌డంతోపాటు , న‌గ‌రంలో ప‌లు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారని. మంత్రి పొంగులేటి తెలిపారు. భద్రకాళి చెరువు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, సర్వే చేయించి అక్రమ నిర్మాణాల‌ను తొలగిస్తామని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమాల్లో ఇంచార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, కుడా పిఓ అజిత్ రెడ్డి, జిడబ్ల్యుఎంసి ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, ఈఈ లు భీం రావు, సంతోష్ బాబు, సీతారాం, ఇరిగేషన్, ‘కుడా’, జిడబ్ల్యూ ఎంసీ, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page