ఫార్మా మాఫియాను కూల్చాకే పేదల ఇళ్లు కూల్చండి

సీనియర్‌ ‌పాత్రికేయులు పాశం యాదగిరి
జనాభాకు హాని కలిగించే విదంగా ప్రభుత్వ చర్యలు
ఆప్‌ ‌తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ ‌డాక్టర్‌ ‌దిడ్డి సుధాకర్‌

‌హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 06 : ‌మూసీని అత్యంత కలుషితమైన నదులలో ఒకటిగా మార్చిన ఫార్మా మాఫియాను కూల్చి, అనంతరం పునరావాసం కల్పించి పేదల ఇళ్ళు కూల్చని సీనియర్‌ ‌పాత్రికేయులు పాశం యాదగిరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేసారు. హైదరాబాద్‌ ‌శివార్లలోని ఫార్మా కంపెనీలు పరిశ్రమల వ్యర్థాలను యథేచ్ఛగా మూసి నదిలోకి వదులుతున్నా రాష్ట్ర ప్రభుత్వం వాటిని నియంత్రించే చెర్యలు తీసుకోకుండా మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ ఎలా చేపడుతారని, ప్రజల జీవన ప్రమాణాలను ఎలా కాపాడుతారని అయన ప్రశ్నించారు. మూసీ బాధితులకు న్యాయం చేయాలనీ డిమాండ్‌ ‌చేస్తూ వారికీ మద్దతుగా లిబర్టీ చౌరస్తాలో బుధవారం ఆమ్‌ ఆద్మీ పార్టీ నిర్వహించిన సామూహిక సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తన సంతకం చేసి పాశం యాదగిరి ప్రారంభించారు.

డాక్టర్‌ ‌దిడ్డి సుధాకర్‌ ‌మాట్లాడుతూ మూసీ నది పునరుజ్జీవనం కోసం నదీతీర జనాభాకు హాని కలిగించే విధంగా ప్రభుత్వం చెర్యలు చేపట్టడం దుర్మార్గమన్నారు. డిటైల్డ్ ‌ప్రాజెక్ట్ ‌రిపోర్ట్(‌డిపిఆర్‌), ‌పునరావాస పాలసీ లేకుండానే ఎందుకు ప్రాజెక్టును వేగవంతం చేసి పేదల ఇళ్ల కూల్చివేతలు చేస్తున్నారని అయన ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అమలుపై డిపిఆర్‌ ‌ప్రకటనతోపాటు అఖిల పక్ష పార్టీల కమిటీ వేసి వారి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు సాగాలని అలాగే నేషనల్‌ ‌రివర్‌ ‌కంట్రోల్‌ ‌ప్లాన్‌ ‌మరియు జల్‌ ‌శక్తి అభియాన్‌ ‌వంటి పథకాల కింద మూసీ నది శుద్దీకరణకు, సుందరీకరణకు నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ముందుగా మూసీ బాధితులకు పునరావాసం కల్పించాలని డిమాండ్‌ ‌చేసారు. ఈ కార్యక్రమంలో ఆప్‌ ‌తెలంగాణ రాష్ట్ర కోర్‌ ‌కమిటీ సభ్యులు బుర్ర రాము గౌడ్‌, ఆప్‌ ‌మహిళా విభాగం అధ్యక్షులు హేమ జిల్లోజు, దివ్యంగా కమిటీ చైర్మన్‌ ‌దర్శనం రమేష్‌, అధికార ప్రతినిధి జావేద్‌ ‌షరీఫ్‌, ‌నేతలు సుధారాణి, సునీత పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page