బాలికలకు భవిష్యత్తునిద్దాం…

నేటి ఆధునిక రంగంలో ఎంతోమంది బాలికలు విభిన్న రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. నేడు వారు అడుగుపెట్టని రంగం అంటూ లేదు. దేశ రక్షణ రంగంలో  కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. బాలికలకు సరైన  విద్య, పౌష్టికాహారం, ఆరోగ్యం, రక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఆకాశమే హద్దుగా ఎదుగుతారని అనడంలో  ఎలాంటి సందేహం లేదు. సేవారంగంలో అందరికీ అమ్మగా పేరుందిన మదర్‌ థెరిస్సా , క్రీడల్లో రాణించిన పి.టి.ఉష, కరణం మల్లీశ్వరి, అంతరిక్షంలో అడుగిడిన కల్పనా చావ్లా, సునీత విలియమ్స్‌, తొలి మహిళ ఐపీఎస్‌ అధికారి కిరణ్‌ బేడీ ఇలా ఎందరో మహిళలు భిన్నమైన రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఎంతోమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారు. చదువుల్లో, ఉద్యోగాల్లో బాలికలు తమ సత్తా చాటుతున్నారు. నేటి బాలికలే రేపటి శ్రామిక శక్తి. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో, దేశ పురోగతిలో వారి ప్రాధాన్యతని గుర్తించాలి.

బాలికలు సురక్షితమైన జీవితానికి హక్కు కలిగి ఉన్నారు. వారికి సురక్షితమైన జీవితం అందించాలి. పితృ స్వామిక సమాజం విధించిన అనేక కట్టుబాట్లను దాటుకొని ఇప్పుడిప్పుడే విభిన్న రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. దుర్విచక్షణ లేని సమాజం కోసం, ల్కెంగిక హింసకు తావులేని సమాజం కోసం, ఆరోగ్య వ్యవస్థలు అందుబాటులో ఉండే వ్యవస్థల కోసం, ఉజ్వల భవిష్యత్తు కల్పించే అవకాశం కోసం నేటి బాలికలు తమ గొంతు విప్పుతున్నారు. అవగాహన కల్పించడమే కాకుండా వారికి ఉజ్వల భవిష్యత్తును అందించే అవసరాన్ని గుర్తుచేస్తుంది. ఈ సంవత్సరపు అంతర్జాతీయ బాలికా దినోత్సవం థీమ్‌.. ‘’భవిష్యత్తు కోసం బాలికల దృష్టి’’. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికల సామర్ధ్యాలను గుర్తించి వారికి అదనపు అవకాశాలు, ఉజ్వల భవిష్యత్తు అందించే దిశగా అవగాహన కార్యక్రమాలు, చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో బాలికలపై జరుగుతున్న హత్యాచార ఘటనలు ఆడపిల్లలకు సరైన రక్షణ కొరవడిరదని విషయాన్ని నిరూపిస్తున్నవి. వారిపై శారీరక, మానసిక ,ల్కెంగిక వేధింపులు నానాటికి పెరిగిపోవుచున్నవి.

బాగా తెలిసిన వారు నమ్మకస్తులు వారిపై వేధింపులకు పాల్పడుతున్నారు. బాలికలకు గుడిలో, బడిలో, దారిలో, ప్రయాణాల్లో,ఇంట్లో ,చివరికి అమ్మ గర్భంలో కూడా వారికి రక్షణ కరువైందని చెప్పవచ్చు. బాలికలు ఎదుర్కొంటున్న మరో అతిపెద్ద సమస్య వారి అక్రమ రవాణా జాతీయ నేర రికార్డుల ప్రకారం అపహరణకు గురైన బాలికల్లో 28 శాతం మంది 18 సంవత్సరాలలోపు వారే. ప్రభుత్వము బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి రక్షణ కల్పించాల్సిన అవకాశం కలదు. దేశంలో మాయమైపోతున్న బాలికల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నది. అపహరించిన బాలికలను విక్రయించడము, వ్యభిచార కూపంలోకి దింపడం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కోసం వాడుకోవడం జరుగుతున్నది. బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై కలదు. బాలికలు లింగపరమైన దుర్విచక్షణ కారణంగా గత 50 సంవత్సరాల్లో భారత్‌ లో సుమారు 4.5 కోట్ల మంది ఆడ శిశువులు కనుమరుగైనట్లు నివేదికలు తెలుపుతున్నవి.

చాలామంది బాలికలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. 6 నుంచి 13 ఏళ్ల వయసులోపు బాలికలు ఆర్థిక సమస్యలతో .. లింగ వివక్షత కారణంగా మధ్యలోనే చదువులు మానేస్తున్నారు. చాలామంది బాలికలు బడికి వెళ్లకుండా ఇంటి పనులకు పరిమితమవుతున్నారు. ప్రతి బాలిక తన విద్యను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి. స్వేచ్ఛ, ప్రోత్సాహం, అవకాశాలు కల్పిస్తే బాలికలు మేలిమి నారీమణులుగా ఎదుగుతారని నిపుణులు పేర్కొంటున్నారు. అమ్మాయిలను పెంచే తీరులో ఎటువంటి లింగ వివక్ష తలెత్తకుండా తల్లిదండ్రులు చూసుకోవాలి. అమ్మాయి పుడితే పండుగ జరుపుకోవాలి. మనదేశంలో ఆడపిల్ల పుట్టింది అంటే మహాలక్ష్మి పుట్టింది అని అంటారు. కూతురైన కుమారుడ్కెన ఇరువురిని సమానంగా పెంచాలి. ఈ మధ్యకాలంలో తల్లిదండ్రుల ఆలోచన కొంతవరకు మారిందని చెప్పవొచ్చు. ఆడపిల్లలను చదివిస్తున్నారు. నేటి ఆధునిక రంగంలో ఎంతోమంది బాలికలు విభిన్న రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. నేడు వారు అడుగుపెట్టని రంగం అంటూ లేదు. దేశ రక్షణ రంగంలో కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు.

బాలికలకు సరైన విద్య, పౌష్టికాహారం, ఆరోగ్యం, రక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఆకాశమే హద్దుగా ఎదుగుతారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. సేవారంగంలో అందరికీ అమ్మగా పేరుందిన మదర్‌ థెరిస్సా , క్రీడల్లో రాణించిన పి.టి.ఉష, కరణం మల్లీశ్వరి, అంతరిక్షంలో అడుగిడిన కల్పనా చావ్లా, సునీత విలియమ్స్‌, తొలి మహిళ ఐపీఎస్‌ అధికారి కిరణ్‌ బేడీ ఇలా ఎందరో మహిళలు భిన్నమైన రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఎంతోమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారు. చదువుల్లో, ఉద్యోగాల్లో బాలికలు తమ సత్తా చాటుతున్నారు. నేటి బాలికలే రేపటి శ్రామిక శక్తి. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో, దేశ పురోగతిలో వారి ప్రాధాన్యతని గుర్తించాలి. ‘‘దేశ అభివృద్ధి అన్నది మహిళాభివృద్ధి పైనే ఆధారపడి ఉంటుంది’’ అనే డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ మాటలను మరువరాదు. చిన్నప్పటి నుంచే బాలికలకు సరైన దిశా నిర్దేశం చేస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచి వారు విజయతీరాలకు చేరేలా చూడాలి. వారి అభివృద్ధి కోసం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలి, అప్పుడే అమ్మాయిల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండి వారు జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించగలుగుతారు. మానవజాతి మనుగడకు ప్రాణం పోసే బాలికలను రక్షించుకోవడం, వారి హక్కులను కాపాడటం, వారిని అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించడం వారికి ఉజ్వల భవిష్యత్తు అందించడం మనందరి బాధ్యత.
-పి.వి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page