•రాష్ట్ర విద్యుత్ అంశాలపై డిప్యూటీ సీఎం చర్చ
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్ 12 : దేశ రాజధాని దిల్లీ నగరంలో మంగళవారం కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి అధ్యక్షతన, రాష్ట్రాల, కేంద్రపాలితప్రాంతాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెం టర్‌లో నిర్వహించిన ఈ కార్య క్రమానికి తెలం గాణ రాష్ట్రం తరఫున ఉప ముఖ్య మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క , ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా దక్షిణ తెలంగాణ విద్యు త్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషరఫ్ ఫరూఖి, ఐఏఎస్ ఈ సమా వేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లా ల్‌తో ప్రత్యేకంగా సమావేశమైన ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రానికి సంబంధించిన వివిధ విద్యుత్ సంబంధిత అంశాలను చర్చించారు.