- రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఆప్షన్
- స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు పలు సదుపాయాల్ని తీసుకొచ్చిన ప్లాట్‌ఫామ్
- తాజాగా ఇమేజ్‌ల మూలాలను గుర్తించే పనిలో పడింది
వాట్సాప్ యూజర్ల భద్రతను దృష్టిలోఉంచుకొని ఎప్పటికప్పుడు వారికి మెరుగైన ఫీచర్లు అందించడం జరుగుతోంది. అలాగే భద్రత పరంగా అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు పలు సదుపాయాల్ని తీసుకొచ్చిన ప్లాట్‌ఫామ్ తాజాగా ఇమేజ్‌ల మూలాలను గుర్తించే పనిలో పడిరది. దీనికోసం రివర్స్ ఇమేజ్ సెర్చ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది.
వాట్సప్‌లోని చిత్రాల కోసం మెసేజింగ్ యాప్ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. దీని సాయంతో వాట్సప్‌లోనే నేరుగా ఇమేజ్ గురించి సెర్చ్ చేయొచ్చు. ప్లాట్ఫామ్లో నేరుగా ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది కాబట్టి.. ఇతర యాప్ లేదా బ్రౌజర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. వాట్సప్ ద్వారా షేర్ చేసే కంటెంట్‌కు పారదర్శకతను మెరుగుపరచడమే ఈ ఫీచర్ లక్ష్యం. వాట్సప్ చాట్‌లో ఇమేజ్‌ని ఓపెన్ చేయగానే పైన కుడివైపున త్రీ డాట్స్ మెనూ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే పలు ఆప్షన్లు దర్శనమిస్తాయి. దాన్ని క్లిక్ చేయగానే ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. అందులో క్లిక్ చేసి రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను మొదలుపెట్టొచ్చు.
అయితే ఇలా వెబ్ సెర్చ్ కోసం గూగుల్‌కు పంపే ఫొటోలు గోప్యంగా ఉంటాయని, మెటాతో షేర్ అవ్వవంటూ వాబీటా ఇన్ఫో స్పష్టం చేసింది. ఇక ఇమేజ్ గురించి సెర్చ్ చేయగానే దానికి సంబంధించిన మూలం, ఆ ఫొటో ఎక్కడినుంచి వచ్చింది, ఆన్లైన్లో ఈ ఫొటో వినియోగించిన ఇతర సందర్భాలు.. ఇలా అన్నీ కనిపిస్తాయి. అంతేకాదు ఆ ఫొటోను ఎడిట్ చేశారా, తప్పుదారి పట్టించేలా మార్చాలా అనే విషయాన్ని కూడా తెలుసుకోవొచ్చు. కచ్చితత్వాన్ని అంచనావేయడం సులభతరం కానుంది. మొదటి బీటా యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందని వాబీటా ఇన్ఫో తన బ్లాగ్‌లో పంచుకుంది. సంబంధిత ఫొటోను పోస్ట్ చేసింది. రానున్న వారాల్లో ఇది అందరికీ అందుబాటులోకి రానుందని వెల్లడిరచింది.
-కరిష్మా