అందరికీ ఉచిత విద్య, వైద్యం అందేనా?

 పాఠశాల స్థాయిలో విద్యను బలోపేతం చేయాలి
గురుకులాలతో అందరికీ విద్యను అందజేయడం  సాధ్యమా…
అందరికీ విద్య అన్నది కేవలం పాఠశాలల ద్వారానే సాధ్యం. ..
విద్యార్థులు లేక వెలవెలబోతున్న  ప్రభుత్వ పాఠశాలలు
గ్రామాల్లోకి చొచ్చుకు వొచ్చిన  ప్రైవేట్‌ విద్యాసంస్థలు

 
ప్రస్తుతం దేశంలో  విద్యావైద్యరంగాలను అంటరానివిగా చూస్తున్నారు. ఈ రెండు రంగాల బలోపేతంతో వ్యవస్థను మార్చవొచ్చు. ప్రజల్లో సామాజిక పరివర్తన తీసుకుని రావొచ్చు. కానీ ఏ ప్రభుత్వం కూడా అలా చేయడం లేదు. సర్కార్‌ బళ్ల గొప్పదనం గురించి పదేపదే చెబుతున్న  ప్రభుత్వాలు ఇందుకు తగ్గట్లుగా అడుగులు వేయడం లేదు. ధావులను సంప్రదించడం లేదు. ప్రజలతో చర్చించడం లేదు. గురుకులాల వల్ల తల్లి దండ్రుల ప్రేమకు పిల్లలు దూరం అవుతున్నారంటున్న పాలకులు వీటిని మార్చే అవకాశం ఉన్నా అలా  చేయడం లేదు. అందరికీ ఉచిత విద్య, వైద్యం అన్నది ఎండమావిగానే మారుతోంది. ఈ రంగాలపై బడ్జెట్‌ కేటాయింపులు పెంచి బలోపేతం చేద్దామన్న ఆలోచన ఏ ప్రభుత్వానికి ఉండడం లేదు. అది తెలంగాణ కావొచ్చు, ఏపీ  కావొచ్చు.. నిజానికి గతంలో ఉజ్వలంగా వెలిగిన ప్రభుత్వ స్కూళ్లు ఎందుకు వట్టి పోతున్నాయో పట్టించుకోవడం లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఒక నాడు  గ్రామాల వైద్య సేవలను తీర్చేవి. కానీ ఇప్పుడవి కనుమరుగు అయ్యాయి. ప్రతి గ్రామంలో స్కూళ్లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేస్తే తప్ప గ్రామాలు బలపడవు. అందిరీకి, విద్య, ఆరోగ్యం అందడం లేదని ప్రభుత్వం గుర్తించడం లేదు.
పాఠశాలలను అన్ని రకాలుగా బలోపేతం చేసి, అక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజన వసతి కల్పించినట్లు అయితే ఏ సమస్యా రాదు. స్కూళ్లను అన్ని విధాలుగా పటిష్టం చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న 28 సమీకృత గురుకులాల ఏర్పాటు పథకం ద్వారా విద్యారంగం బలోపేతం అవుతుందన్న మాటల్లో నిజం లేదు. పాఠశాల స్థాయిలో విద్యను బలోపేతం చేయడం మాని ఇలాంటి గురుకులాలతో అందరికీ విద్యను అందచేయడం సాధ్యం కాదు. ఓ రకంగా చెప్పాలంటే  ప్రభుత్వం అందరికీ సమాన విద్య అనే బాధ్యతల నుంచి వైదొలగడంగానే చూడాలి. కేవలం ఈ గురుకులాలతో కాంట్రాక్టర్లను బతికించడం తప్ప మరోటి కాదు. అవే డబ్బులతో గ్రామాల్లో ఉన్న స్కూళ్లను పరిశభ్రంగా ఉంచుతూ వసతులు కల్పిస్తే అంతకు మించిన సౌకర్యాలు అక్కర్లేదు.  ఇంచుమించు గత పదేళ్లుగా కేసీఆర్‌ అనుసరించిన సామాజిక గురుకులాలకు నేటి కాంగ్రెస్‌ ప్రభుత్వం  ప్రవేశ పెడుతున్న పథాకానికి పెద్దగా తేడాలేదు. గత పదేళ్ళుగా గురుకులాల పేరుతో కేసీఆర్‌ చేసిన విద్యారంగ విధ్వంసానికి పాల్పడ్డారు. గురుకులాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ప్రచారార్భాటాలతో మభ్య పెట్టారు. వాటి ఫలితమే ఇప్పుడు చూస్తున్న సమస్యలు.
image.png
గురుకులాల్లో పుడ్‌ పాయిజనింగ్‌ మొదలు అన్ని సమస్యలు కెసిఆర్‌ ప్రభుత్వం కారణంగా  చెప్పుకోవాలి. తొలుత కేసీఆర్‌ కేజీ టూ పీజీ అంటూ ఊదరగొట్టారు. ప్రచారం చేసి తుస్సుమనిపించారు. ఈ క్రమంలో అసలు విద్యను పక్కనపెట్టి కుల ప్రాతిపదికన గురుకులాల ఏర్పాటు చేయడం మూలంగా ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కులాల వారి విద్య వల్ల పిల్లల్లో విభేదాలు రావడం సహజంగానే ఉన్నాయి. కులమతాలకు అతీతంగా అందరికీ విద్య అన్నది కేవలం పాఠశాలల ద్వారానే సాధ్యం. దీనిపై ప్రభుత్వాలు శ్రద్ద పెట్టడం లేదు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత కూడా నేటికీ ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. ప్రైవేట్‌ విద్యాసంస్థలు గ్రామాల్లోకి చొచ్చుకు వొచ్చాయి. ఊరూరా కాన్వెంట్‌ స్కూళ్లకు పంపడం అలవాటు చేసుకున్నారు. మరోపక్క గురుకులాల్లో తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బందిని నియమించి సరైన విద్యా సామర్థ్యాలు అందించడంలో విఫలం కావడం కారణంగా అవి కూడా కళ తప్పాయి. మరోపక్క ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సంఖ్యలో విద్యార్థులు లేక అనుభవజ్ఞుల్కెన ఉపాధ్యాయులు తరగతి గదుల్లో కాలక్షేపం చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితిని గతంలో విమర్శించిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు అధికారంలోకి వొచ్చాక అయినా దృష్టి పెట్టలేదు. గ్రామాల్లో ఉన్న బడుల్లో సౌకర్యాలు కల్పించి, విద్యార్థుల సంఖ్య పెంచడానికి చర్యలు తీసుకోవాల్సిందిపోయి, ఈ సవిరీకృత గురుకులాల ఆలోచన చేయడం ద్వారా మొత్తం వ్యవస్థనే ధ్వంసం చేస్తున్నారు.
స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ పేరుతో ఏవో వేళ్ళ విరీద లెక్కపెట్టే పాఠశాలల్ని ప్రారంభించి అంతర్జాతీయ ప్రమాణాల పేరుతో వంచన చేస్తున్నారు.  ప్రభుత్వ నిర్ణయాలతో విద్యారంగం మరీ కుదేలవడం ఖాయం. పెద్ద సంఖ్యలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల మూతపడడానికి ఇవి తోడ్పడతాయి.  విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడిచేందుకే పాలక పక్షాలు ఇలాంటి కసరత్తులు అన్నీ చేస్తున్నాయన్న భావన కలుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీల మూలంగా గ్రావిరీణ పేదలు, మురికి వాడల ప్రజలు, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారికి ఎందరికి న్యాయం జరుగుతుందీ అనేది ప్రశ్నార్థకమే!? మెరిట్‌ ప్రాతిపదికన ఏ కొద్దిమందికో అంతర్జాతీయ ప్రమాణాల భ్రమలో విద్యను అందిస్తామని చెప్పి మెజారిటీ వర్గాలకు అన్యాయం చేయడమే జరుగుతుంది.
లక్షలాది సంఖ్యలో ఉన్న ప్రభుత్వ విద్యార్థులను గాలికొదిలి తెలివైన వారిని కొందరిని ఎంపిక చేసి మరింత మెరుగైనవారిగా మారుద్దామన్న ప్రయత్నాలు మాత్రం జరుగుతాయి.  కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మారుస్తామని ప్రకటనలు ఇచ్చారు. ఆ మేరకు నిబద్ధత కలిగిన ఆకునూరి మురళి లాంటి మాజీ ఐఏఎస్‌ అధికారిని చ్కెర్మన్‌గా, తెలంగాణా రాష్ట్రంలో విద్యారంగంలో ఎంతో అనుభవం ఉన్న మేధావులను కమిటీ సభ్యులుగా విద్యా సలహా మండలిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అంతవరకు బాగానే ఉంది. మరి ఆ కమిటీ సిపార్స్‌ లేకుండా  విద్యార్థుల సంఖ్యను ఎలా పెంచగలుగుతుందన్నది చెప్పాలి. ఎప్పటికైనా  ప్రభుత్వం  ప్రజలకు అవసరపడే, అందుబాటులో ఉండే స్కూళ్లను బలోపేతం చేయాలి. అలాగే ఆరోగ్యశ్రీతో పనిలేకుండా వైద్యరంగాన్ని బలోపేతం చేయాలి. అప్పుడే సంకల్పం నెరవేరుతుంది.
 -వడ్డె మారన్న    
 9000345368.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page