నిజాయితీ కొరవడుతున్న కేసులు!

  • అసలు దోషులను పట్టించుకోని వైనం…
  • కేంద్ర ప్రభుత్వ వైఖరిలో నామమాత్రపు
  • మార్పు కూడా కనిపించడంలేదు
  • బిజెపి దుర్నీతికి, దుర్వినియోగానికి ఉదాహరణాలెన్నో…!

దేశంలో  మోదీ సర్కారు  రాజకీయ ప్రత్యర్థులను వేధించడమే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడానికి బరితెగిస్తోందన్న విమర్శలు వెల్లువలా కొనసాగుతున్నాయి. తమకు అనుకూలంగా ఉన్నవారిని ఒక రకంగా లేనివారిని మరో రకంగా చూస్తున్నారు. జగన్‌ విషయంలో చేసిన ఆరోపణలపై బిజెపి నేతలు స్పందించడం లేదు. జగన్‌ లోపాయకారిగా బిజెపికి అనుకూలంగా ఉన్నాడని విమర్శలు ఉన్నాయి. తెలంగాణలో కూడా కెసిఆర్‌ అనుకూలంగా ఉన్నందువల్లే ఆయన పైనా ఈగ వాలనీయలేదని వాపోతున్నారు.  ఈ విషయమై ఎన్ని విమర్శలు చేసినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో నామమాత్రపు మార్పు కూడా కనిపించడంలేదు. గతంలోనే ప్రతిపక్షాలన్నీ కలిసి మూకుమ్ముడిగా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వొచ్చిందంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవొచ్చు. అయినా.. ఇడి, సిబిఐ వంటి సంస్థలను తమ జేబు సంస్థలుగానే మోదీ  ప్రభుత్వం భావిస్తోంది. ప్రతిపక్షనేతలను నయానో, భయానో లొంగదీసుకోవడానికి, అలా లొంగని వారిని కేసులతో వేధించడానికి ఆ సంస్థలను దుర్వినియోగపరుస్తున్న తీరుపై రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.  పొంగులేటి, గ్రంధి శ్రీనివాస్‌ లాంటి వారిని తప్ప పెద్ద తలకాలయ జోలికి వెళ్లడం లేదు.

దర్యాప్తు సంస్థల దుర్వినియోగానికి తాజా నిదర్శనం. బిజెపి నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్నందునే ఇడి విపక్ష నేతలను  లక్ష్యంగా చేసుకుంది. దేశ రాజధాని దిల్లీలోనూ ఇదే స్థితి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆప్‌ అధ్యక్షుడు కేజ్రివాల్‌తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు ఇడి బాధితులుగా మారడానికి కారకులెవరో అందరికీ తెలిసిందే. ప్రత్యేకహోదా కోసం నిలదీసినందుకు ఇడి తనను వేధిస్తోందంటూ  గుంటూరు ఎంపి గల్లా జయదేవ్‌ ఏకంగా రాజకీయాలకు గుడ్‌బ్కె చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే బిజెపి దుర్నీతికి, దుర్వినియోగానికి ఉదాహర ణాలెన్నో! 2014వ సంవత్సరంలో నరేంద్రమోదీ  ప్రభుత్వం అధికారంలోకి వొచ్చినప్పటి నుండి గత ఏడాది జనవరి వరకు దేశ వ్యాప్తంగా 121 మంది రాజకీయ నేతలపై ఇడి కేసులు పెట్టి విచారణ చేపట్టింది. వీరిలో 115 మంది అంటే 95 శాతం మంది ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు చెంది, బిజెపిని గట్టిగా వ్యతిరేకించేవారే కావడం గమనార్హం. ఇలా కేసులు  నమోదైన వారు బిజెపిలో చేరితే వెంటనే వారిపై నమోద్కెన కేసులను ఎత్తివేయడం, వారిలో కొందరికి ప్రభుత్వ పదవులను సైతం కట్టబెట్టడం మోదీ  సర్కారు బరితెగింపునకు మరో నిదర్శనం. మరోవైపు ఇడి కేసుల్లో నేరం రుజువై శిక్షపడినవి చాలా తక్కువ.

అధికారిక లెక్కల ప్రకారం 2011 నుండి ఇడి 1600 కేసులు నమోదు చేసి, 1800 దాడులను ఇడి నిర్వహించింది. అయితే, నేరం రుజువై శిక్ష పడిరది మాత్రం కేవలం 10 మందికి మాత్రమే! గడిచిన 18 ఏళ్లలో ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ (పిఎంఎల్‌ఏ) కింద 5,422 మందిపై ఇడి కేసులు పెట్టి దర్యాప్తు చేయగా, 23మందికి మాత్రమే శిక్ష పడిరది. ఇది కేవలం 0.5శాతం మాత్రమే!  దర్యాప్తు సంస్థలకు లేని ప్రత్యేక అధికారాలు ఇడికి ఉండటమే కారణంగానే అంతా ఇడి అంటే భయపడుతున్నారు.   ముఖ్యంగా న్యాయస్థానాల అనుమతి లేకుండానే ఆస్తులు జప్తు చేసే అధికారం ఒక సారి కేసు నమోద్కెతే నేరం చేయలేదని రుజువు చేసుకునే బాధ్యత నిందితునిపైనే మోపడం వంటి అధికారాలను ఇ.డి కి అప్పగించారు. ప్రస్తుత పార్లమెంటులోని ప్రతిపక్ష సభ్యుల్లో దాదాపు 90 శాతం మంది ఏదో ఒక కేంద్ర దర్యాప్తు సంస్థ నిఘానీడలో ఉన్నట్లు ఇటీవల విడుదల్కెన ఒక నివేదిక పేర్కొంది. తీవ్ర స్థాయిలో జరుగుతున్న ఈ అధికార దుర్వినియోగాన్ని అరికట్టి, దర్యాప్తు సంస్థల నిష్పాక్షికతపై ప్రజానీకంలో తిరిగి నమ్మకం కలిగించాల్సి ఉంది.
-చరణ్‌ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page