అప్పుల కోసమే టాస్క్‌ఫోర్స్

కెసిఆర్‌ ‌బాటలోనే అప్పులు చేస్తున్న సీఎం రేవంత్‌ ‌రెడ్డి
మరోమారు మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, నవంబర్‌18: ‌కేసీఆర్‌, ‌రేవంత్‌రెడ్డి రాజకీయాల్లో నైతిక విలువలు వదిలేశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ‌రూ.7 లక్షల కోట్ల మేర అప్పులు చేస్తే…రేవంత్‌ ‌రెడ్డి ఏకంగా అప్పుల కోసం ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌,  ‌కాంగ్రెస్‌ ‌పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని కిషన్‌రెడ్డి మరోమారు విమర్శించారు. గతంలో బిఆర్‌ ఎస్‌ ‌ప్రభుత్వం ఎలా ఉందో.. ఇప్పుడు కాంగ్రెస్‌ ‌సర్కారు కూడా అలాగే ఉందన్నారు. అదే రకమైన అవినీతి, గాలి మాటలు విని ప్రజలు విసిగి పోతున్నారన్నారు. రైతు భరోసా, రుణమాఫీ లేదు. పింఛన్లు పెంచుతామన్నారు.. ఒక్క రూపాయి పెంచలేదు, కొత్త పింఛన్లు ఇవ్వలేదు. రేవంత్‌రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు.

హామీలన్నీ ఆయన గాలికొదిలేశారు. పైగా మహారాష్ట్రలో నిర్వహిస్తున్న ప్రచారంలో తెలంగాణ సస్యశ్యామలం అయిందంటూ మాట్లాడుతున్నారు. ఇంతకంటే అబద్దాలు ఉంటాయా? కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ ‌తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని కిషన్‌ ‌రెడ్డి ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్‌ ‌పార్టీ మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉండి భ్రష్టు పట్టించిందని విమర్శించారు. బిజెపి నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని బిజెపి పోలింగ్‌ ‌బూత్‌ ‌కమిటీల నియామకం చేపట్టాలన్నారు.  మళ్లీ మండల స్థాయి వర్క్‌షాపు లు ఉంటాయని, ఈ నెల 22న దిల్లీలో జరగనున్న పార్టీ సంస్థాగత సమావేశాల్లో మండల, జిల్లా ఎన్నికల తేదీలు వెల్లడవుతాయని తెలంగాణలో పనిచేయడానికి గుత్తేదారులు ముందుకు రావడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో గ్రహించాలని కిషన్‌రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page