దశాబ్దాల కల సాకారమైన వేళ..

సీఎం  రేవంత్‌ ‌రెడ్డి చేతులమీదుగా కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం
ప్రజా కవి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
4601.15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభం
కాళోజీపై నిర్మించిన లఘుచిత్రన్ని వీక్షించిన ముఖ్యమంత్రి
హన్మకొండ అర్బన్‌,  ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ఓరుగల్లులో అద్భుతం ఆవిష్కృతమైంది. కళలు,  కళాకారులకు పుట్టినిల్లుగా పేరుగాంచిన ఓరుగల్లు కళామతల్లి శిఖలో మరో మణిహారం తొడిగారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి. జిల్లా ప్రజలు కళాకారులు కళాభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాళోజి కళాక్షేత్రం  మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు పోలీసు గౌరవ వందనాన్ని ముఖ్యమంత్రి స్వీకరించారు.  ముఖ్యమంత్రి హైదరాబాద్‌ ‌బేగంపేట విమానాశ్రయం నుంచి హన్మకొండ ‘కుడా’ గ్రౌండ్స్ ‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ ‌వద్దకు ప్రత్యేక హెలికాప్టర్‌ ‌ద్వారా మధ్యాహ్నం 2.30 కి చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా కాళోజీ కళాక్షేత్రానికి చేరుకొని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కతో కలిసి ముందుగా ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం హన్మకొండ, వరంగల్‌ ‌జిల్లాలకు సంబంధించిన 4,601.15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపణలు, ప్రారంభోత్సవాలు ముఖ్యమంత్రి  అక్కడ ఏర్పాటు చేసిన స్క్రీన్‌ ‌ద్వారా చేశారు. అనంతరం కళాక్షేత్ర  భవనాన్ని రిబ్బన్‌ ‌కత్తిరించి ప్రారంభించారు.
అక్కడ నుంచి నేరుగా కాళోజీ కళాక్షేత్ర భవన కింది అంతస్తులో  కాళోజీ నారాయణరావు  వ్యక్తిగత జీవితంలోని ప్రత్యేక క్షణాలను ప్రతిబింబించే ఫొటోలు, పురస్కారాలు, వ్యక్తిగత వస్తువులు ప్రదర్శించిన ఆర్ట్ ‌గ్యాలరీని సందర్శించారు. ఈ సందర్భంగా కాళోజీ ఫౌండేషన్‌ ‌ప్రతినిధులు వీఆర్‌ ‌విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాస్‌ ‌రావు ముఖ్యమంత్రికి  కాళోజీ జీవితం అక్కడి వస్తువుల గురించి వివరించగా ముఖ్యమంత్రి ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఆడిటోరియంలో కాళోజీ జీవిత విశేషాలతో నిర్మించిన లఘచిత్రాన్ని కాళోజి ట్రస్ట్ ‌ఫౌండేషన్‌ ‌సభ్యులు, ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి వీక్షించారు.  ఈ సందర్బంగా ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్‌  ‌ట్రస్ట్ ‌సభ్యులు ముఖ్యమంత్రికి  పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం ఆడిటోరియం బయట ఇందిరా ఫెలో షిప్‌ ‌సభ్యులు, స్థానికి పార్టీ ప్రజా ప్రతినిధులను ముఖ్యమంత్రి కలిశారు. అక్కడ నుంచి నేరుగా ఆర్టస్ ‌కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మధ్యాహ్నం 3.35 గంటలకు బయలుదేరారు.
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు..

కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం – రూ.90  కోట్లు
అండర్‌ ‌డ్రైనేజీ వ్యవస్థకు శంకుస్థాపన – రూ.4170  కోట్లు
నార్కోటిక్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌ప్రారంభం – రూ.12  లక్షలు
నయీమ్‌  ‌నగర్‌ ‌బ్రిడ్జి ప్రారంభం రూ. 8.30 కోట్లు
వరంగల్‌ ‌తూర్పు అభివృద్ధి పనుల శంకుస్థాపన రూ. 3  కోట్లు
పాలిటెక్నిక్‌ ‌కళాశాల శంకుస్థాపన రూ. 28  కోట్లు
కాకతీయ మెగా టెక్స్ ‌టైల్‌ ‌పార్క్ ఆర్‌ అం‌డ్‌ ఆర్‌ ‌లేఔట్‌, ఇం‌దిరమ్మ ఇళ్ల మంజూరు శంకుస్థాపన  – 863  ప్లాట్లు, 5 లక్షల ఏ 43.15 కోట్లు
ఫ్లడ్‌ ‌డ్రైనేజీ సిస్టం శంకుస్థాపన – 160.3 కోట్లు
కాకతీయ మెగా టెక్స్ ‌టైల్‌ ‌పార్క్ ‌టౌన్షిప్‌ ఆవరణలో  పిహెచ్‌ ‌సీ , ప్రైమరీ స్కూల్‌, ‌పశు వైద్యశాల శంకుస్థాపన – రూ.13  కోట్లు
వరంగల్‌ ‌రహదారుల అభివృద్ధి శంకుస్థాపన  – 49.50 కోట్లు
పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట రోడ్డు  4  లైన్ల విస్తరణ – 65.0 కోట్లు
కాకతీయ మెగా టెక్స్ ‌టైల్‌ ‌పార్క్ ‌లో మౌలిక సాధుపాయల కల్పనకు శంకుస్థాపన  రూ. 11.6 కోట్లు
వరంగల్‌ ఎల్‌ ‌బి నగర్‌ ‌లో ఉర్దూ భవనం శంకుస్థాపన  రూ. 1.50 కోట్లు

image.png
కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా ఇంచార్జి మంత్రి,  రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, ‌పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్‌, ‌గిరిజన శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ‌రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్రీధర్‌ ‌బాబు, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వేం నరేందర్‌ ‌రెడ్డి, ప్రభుత్వ రాజకీయ సలహాదారు కె. కేశవరావు, తెలంగాణ స్టేట్‌ ‌ఫైనాన్స్ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌సిరిసిల్ల రాజయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి అజిత్‌ ‌రెడ్డి,  ఎంపీలు బలరాం నాయక్‌, ‌డాక్టర్‌ ‌కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మధుసూదనాచారి, గ్రేటర్‌ ‌వరంగల్‌ ‌మేయర్‌ ‌గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌ ‌రెడ్డి, కడియం శ్రీహరి, రేవురి ప్రకాష్‌ ‌రెడ్డి, కెఆర్‌ ‌నాగరాజు, యశస్విని రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ఎంఏ యుడి ప్రిన్సిపాల్‌ ‌సెక్రెటరీ దానా కిశోర్‌, ‌రోడ్ల భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన, సమాచార శాఖ కమిషనర్‌ ‌డాక్టర్‌ ‌హరీష్‌, ‌విద్యాశాఖ డైరెక్టర్‌ ‌నర్సింహారెడ్డి, వరంగల్‌, ‌హన్మకొండ కలెక్టర్‌ ‌డాక్టర్‌ ‌సత్య శారదా, ప్రావీణ్య, కుడా చైర్మన్‌ ‌వెంకట్రామిరెడ్డి, జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్‌ అశ్విని తానాజీ వాఖేడే, ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page