అతన్ని కొట్టి చంపిన ప్రయాణికులు
కాన్పూర్, సెప్టెంబర్ 14 : కదులుతున్న రైలులో బాలికపై రైల్వే ఉద్యోగి అత్యాచారం చేయడంతో అతడిని ప్రయాణికులు కొట్టి చంపిన సంఘటన బిహార్ నుంచి ఢిల్లీ వెళ్తున్న హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం ఢిల్లీకి వెళ్లేందుకు హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు. ఆ కుటుంబం జనరల్ టికెట్లు తీసుకుంది.
టిటిఇ అనుమతి ఇవ్వడంతో ఎసి కోచ్-డిలో బాలిక కుటుంబం కూర్చుంది. బాలిక తన తల్లితో కలిసి వాష్‌రూమ్‌కు వెళ్లింది. బాలిక ఒంటరిగా కనిపించడంతో అటెండెంట్ ప్రశాంత్ కుమార్ ఆమెపై అత్యాచారం చేశాడు. బాలిక ఏడ్చుకుంటూ వెళ్లి తన తల్లికి జరిగిన విషయం చెప్పింది.
ప్రయాణికులు, ఆ కుటుంబం కలిసి ప్రశాంత్‌పై దాడి చేయడంతో స్పృహ తప్పిపడిపోయాడు. గురువారం తెల్లవారుజామున రైలు కాన్పూర్‌కు చేరుకోగానే జిఆర్‌పి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ప్రశాంత్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయాడని నిర్దారించారు.