హైదరాబాద్‌ విమోచనానికి అద్దం పట్టేలా ఫోటో ఎగ్జిబిషన్‌

దఛాయచిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ కుమార్‌
దకేంద్ర సమాచార శాఖ సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహణ
దటీఎన్జీఎస్‌ ఫంక్షన్‌ హాల్లో శుక్రవారం వరకూ కొనసాగనున్న ఎగ్జిబిషన్‌. ఆసక్తికర ఫొటో ఎగ్జిబిషన్‌ను వీక్షించాలని కోరిన నిర్వహకులు

కరీంనగర్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 18 : హైదరాబాద్‌ విమోచన ఉదంతాలకు అద్దంపట్టేలా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ యొక్క ఫోటో ఎగ్జిబిషన్‌ ఉందని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఫీల్డ్‌ పబ్లిసిటీ ఆఫీసర్‌ శ్రీధర్‌ సూరునేని ఆధ్వర్యంలో టీఎన్జీఓ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ ఫోటో ఎగ్జిబిషన్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన బండి సంజయ్‌ హైదరాబాద్‌ విమోచన కోసం పోరాటం చేసిన యోధులు, అప్పటి సంఘటనలతో కూడిన ఫోటోలను తిలకించి సిగ్నేచర్‌ బోర్డు పై బండి సంజయ్‌ కుమార్‌ సంతకం చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ను ప్రారంభించారు. ఎగ్జిబిషన్‌ నిర్వాహకులు , ఫీల్డ్‌ పబ్లిసిటీ ఆఫీసర్‌ శ్రీధర్‌ సూరునేని మాట్లాడుతూ, హైదరాబాద్‌ విమోచనం దినం పురస్కరించుకొని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ యొక్క సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ తరఫున ఈ ఫోటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసినట్లు వివరించారు.

టీఎన్జీఎస్‌ ఫంక్షన్‌ హాల్లో శుక్రవారం వరకూ కొనసాగనున్న ఎగ్జిబిషన్‌ లో పొందుపర్చిన ఆసక్తికర ఫొటోలను వీక్షించాలని కోరారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ, ఈ సందర్బంగా బండి సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ విమోచన దినోత్సవ సందర్బంగా చోటుచేసుకున్న వాస్తవ విషయాలను అందరికి తెలిసేలా ఈ ఎగ్జిబిషన్‌ పొందుపర్చారని వివరించారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర ప్రతి గ్రామానికి ఉంది అన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన ప్రాంతానికి స్వతంత్రం రాలేదు.

1948  సెప్టెంబర్‌ 17 నాడు మనకు స్వతంత్రం వచ్చింది అన్నారు. సర్ధార్‌ పటేల్‌ కారణంగా హైదరాబాద్‌ సంస్థానం దేశంలో విలీనం అయిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం, సర్టిఫికేట్ల పంపిణీని ముఖ్య అతిథి చేతుల మీదుగా ఫీల్డ్‌ పబ్లిసిటీ అధికారి శ్రీధర్‌ అందజేశారు. అనంతరం అందరితో స్వచ్ఛభరత్‌ ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా ఫంక్షన్‌ హల్‌ ముందు పరిసరాలను శుభ్రంగా చీపురు తో ఉడ్చారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు శ్రీధర్‌ సూరునేని, నెహ్రూ యువ కేంద్ర జిల్లా అధికారి  వెంకట రాంబాబు, టిఎన్‌జిఓ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page