నాటి బహుళార్థక సాధక ప్రాజెక్టులతోనే రికార్డు స్థాయి వరిసాగు

కాళేశ్వరంతోనే సాగు పెరిగిందంటూ బిఆర్‌ఎస్‌ అసత్య ప్రచారం..
•రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి రూ.72వేల కోట్లు
•ఒకే రోజు రూ.18వేల కోట్లు రుణమాఫీ చేశాం..
: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ‌కాలేశ్వ రంతో సంబంధం లేకుండా ఈ ఏడాది తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి కావడానికి దూర దృష్టితో ఆనాటి కాంగ్రెస్‌ ‌పాలకులు నిర్మించిన బహుళార్థక సాధక ప్రాజెక్టుల వల్లనే సాధ్యమైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా పిసిసి ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్‌లో మంగళవారం నిర్వహిం చిన ఇందిరా గాంధీ వ్యవసాయ ప్రతిభా పురస్కారాల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..  పిసిసి అధ్యక్షులు మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌తో కలిసి హాజరయ్యారు. ఆదర్శ రైతులకు, శాస్త్రవేత్తలకు ఈ సందర్భంగా అవార్డులను ప్రదానం చేశారు. ‘ఇండియా గుండె చప్పుడు ఇందిరా’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం జరిగిన సభలో రైతులను ఉద్దేశించి డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ..  కాలేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్‌ఎస్‌ ‌తప్పుడు ప్రచారం చేస్తోందని,  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన విషయం నేడు వాస్తవమైందన్నారు. కాలేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి.. నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపో యినా.. ఎన్డీఎస్‌ఎ ‌సూచన మేరకు అన్నారం, సుం దిళ్లలో నీటిని నిల్వ చేయకపోయినా ఈ సంవత్సరం వరి ఉత్పత్తి పెరగడానికి ఆనాటి కాంగ్రెస్‌ ‌పాలకులు కృష్ణా నదిపై నాగార్జునసాగర్‌, ‌శ్రీశైలం, జూరాల, నెట్టెంపాడు, కోయిల, కల్వకుర్తి ఎత్తిపోతల, గోదావరి నదిపై ఎస్సారెస్పీ, దేవాదుల, శ్రీపాద ఎల్లంపల్లి తదితర బహుళార్థక సాధక ప్రాజెక్టులే కారణమని అన్నారు. ‘‘దేశానికి స్వాతంత్రం వొచ్చిన తర్వాత ఆహార ధాన్యాల ఉత్పత్తి దేశ ప్రజలకు సరిపోయేత లేవు. ఉత్పత్తి పెరగాలంటే వ్యవసాయం చేసే వారు పెరగాలని, భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చి కొద్ది మంది చేతుల్లో ఉన్న లక్షల ఎకరాల భూములను పేదలకు పంచి లక్షల మంది రైతులను తయారు చేసిన ఘనత దివంగత ప్రధాని ఇందిరాగాంధీకే దక్కుతుంది అని అన్నారు.

ప్రపంచంలోని అనేక దేశాలకు ఆహార ఉత్పత్తుల ఎగుమతి చేసే విధంగా పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగాన్ని చేర్చిన ముందు చూపు ఉన్న దార్శనీకురాలు ఇందిరా గాంధీ అని కొనియాడారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే ప్రజా ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది వ్యవసాయ రంగానికి బడ్జెట్లో రూ.72 వేల కోట్లు కేటాయించి రైతులను ప్రోత్సహిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి వివరించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం అమలు  చేయని విధంగా కేవలం 15 రోజుల్లో రెండు లక్షల లోపు రుణాలు ఉన్న రైతులకు ఒకేసారి 18 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమచేసిన ప్రజా ప్రభుత్వం దేశానికి ఒక రోల్‌ ‌మోడల్‌గా నిలిచిందన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేసిన గొప్ప చారిత్రాత్మకమైన రుణమాఫీ కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ ‌శ్రేణులు ప్రతి రైతు దృష్టికి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.

పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌ ‌పాలకులు పంట నష్టం పరిహారం ఇవ్వలేదన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వరదల బీభత్సం వల్ల జరిగిన పంట నష్టాన్ని అధికారులతో అంచనా వేయించి పరిహారం ఇస్తున్నామని చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌ ‌రైతులకు పంట బీమా పథకాన్ని అమలు చేయలేదన్నారు. ప్రజా ప్రభుత్వం రైతులు చెల్లిం చాల్సిన బీమా డబ్బులను ఇన్సూరెన్స్ ‌కంపె నీలకు చెల్లించి పంట బీమా పథకాన్ని అమలు చేస్తున్నదని వెల్లడించారు.రైతులపై భారం మోపకుండా ప్రీమియం డబ్బులను ప్రభుత్వమే బీమా కంపెనీలకు చెల్లించి రైతు బీమాను కూడా ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం నుంచి వొచ్చే పథకాలను రైతులకు అందించడానికి రాష్ట్రానికి సంబంధించిన వాటా డబ్బులను ప్రజా ప్రభుత్వం చెల్లిస్తూ రైతులకు అండగా ఉంటుందన్నారు.

గత బిఆర్‌ఎస్‌ ‌పాలకులు విస్మరి ంచిన వ్యవసాయ యాంత్రీకరణ, పాలీహౌస్‌, ‌సబ్సిడీ విత్తనాల పంపిణీ తదితర పథకాలను పునరుద్ధరించి  రైతులను ప్రజాప్రభుత్వం ప్రోత్సహిస్తోందని  వివరిం చారు. వ్యవసాయ రంగాన్ని అస్థిరపరిచిన ధరణిని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రక్షాళన చేపట్టిందన్నారు. రైతుల కోసం ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి- సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా కాంగ్రెస్‌ ‌శ్రేణులు రైతుల చెంతకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌, ‌వ్యవసాయ కమిషన్‌ ‌చైర్మన్‌ ‌కోదండ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page