వాళ్ళెవరు..!?
అందరూ బతకడంకోసం
పోరాటం చేస్తూ
అడుగడుగు ప్రజాక్షేత్రంలో
అసువులుబాస్తూ
సాగుతున్న వాళ్ళెవరు !
“యాభై వసంతాలుగా
పరవళ్ళు తొక్కుతూ
త్యాగాల చాళ్ళలో
ప్రాణాల్ని నాటుతూ
అరుణోదయతో
కలిసిపాడుతూ
కదులుతున్న
వాళ్ళెవరు..!?
ఏ అన్నకు తమ్ములాళ్ళు
ఏ త్యాగాల
ఆశయానికి వారసులు !
పది యుద్ధ కాల ప్రాయంలో
వసంత వనానికి
ఎర్రమందారాల శోభనిచ్చి
మందారాల ఎరుపునింపుకుని
వెల్లువలకు పిలుపునిచ్చే
వాళ్ళెవరు.!?
బాయినెట్ మొనలమీద
కదంతోక్కుతూ
నిర్బంధాలమధ్య
తూటాల మాలలు ధరించి
జై కొట్టి జైలుకెల్లి
ఎర్రజెండెత్తిన వాళ్ళు
దుర్మార్గ వ్యవస్థను
తుత్తునియలు చేయ
నలు దిశల విస్తరించే
స్వేచ్ఛా తరంగాలం..!
కళ్ళ ఎరుపు సాక్షిగా
అడుగేస్తూన్నాం ముందుకు
గమ్యం చేరేందుకు
తటపటాయింపులు
ఎందుకు ఈ తరం
విప్లవ విద్యార్థులం మేం
పిడికిళ్ల పట్టుదలతో
చేస్తున్నాం ప్రతిజ్ఞ.!
శోభరమేష్
కాకతీయ విశ్వవిద్యాలయం
8978656327