త్వరలో సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు..

•వ్యవసాయ యాంత్రికరణ పథకం పునరుద్ధరణకు కసరత్తు
•జిల్లాల్లో వ్యవసాయ పనిముట్లపై ప్రదర్శనలు
•ప్రణాళికల రూపకల్పనకు మంత్రి తుమ్మల ఆదేశాలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 12: ‌త్వరలో వ్యవసాయ యాంత్రికరణ పథకాన్ని పునరుద్దరించడానికి కావాల్సిన నిధులు, పథకం అమలు తీరుతెన్నులపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమీక్షించారు. మంగళవారం వ్యవసాయ కార్యదర్శి రఘునందన రావుతో, వ్యవసాయ డైరెక్టర్‌ ‌గోపితో సహకార సంస్థలప్రతినిధులతో సమావేశం నిర్వహి ంచారు. మంత్రి  ఆదేశాలతో ఈ యాసంగి నుంచి రైతులకు అవసరమైన పనిముట్లు, యంత్రాలను సబ్సిడీపై సరఫరా చేయడానికి, ప్రణాళిక సిద్దం చేశామని, అందులో భాగంగా జిల్లాల వారీగా ఎక్కువ డిమాండ్‌ ఉన్న పనిముట్లను, యంత్ర పరికరాల జాబితా సిద్దం చేసినట్లు డైరెక్టర్‌, ‌వ్యవసాయశాఖ గోపి తెలిపారు. అంతేకాకుండా  మంత్రి ఆదేశాల మేరకు త్వరలోనే జిల్లాల వారీగా యంత్ర పరికరాలు.

పనిముట్ల తయారీ సంస్థల సహకారంతో మార్కెట్లలో కొత్తగా వొచ్చిన పరికరాలపై రైతులలో అవగాహన పెంపొందించే విధంగా ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా యంత్రాంగం ప్రదర్శనకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రోటవేటర్స్, ఎం‌బి నాగళ్ళు, కల్టివేటర్స్, ‌తైవాన్‌ ‌స్ట్రేయర్లు, బేలర్స్, ‌పవర్‌ ‌వీడర్స్, ‌మొక్కజొన్న వొలుచు యంత్రాలు, ట్రాక్టర్లు, కిసాన్‌ ‌డ్రోన్లు తదితర వాటిని ప్రతిపాదించినట్లు తెలిపారు. దీనిపై మంత్రి తుమ్మల స్పందిస్తూ, గత 5 సంవత్సరాల నుంచి వ్యవసాయ యాంత్రికరణ పథకానికి, కేంద్ర ప్రభుత్వం తమ వాటా నిధులు విడుదల చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా నిధులు విడుదల చేయకపోవడంతో, కేంద్రం తమ వాటా నిధులను విడుదల చేయడం నిలిపివేసిందని తెలిపారు. గతంలో ఇచ్చిన నిధులను కూడా తిరిగి తీసుకోవడంతో రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు.

అంతేకాకుండా గత ఐదేళ్ల నుంచి రైతులకు దీనికి సంబంధించి ఎటువంటి అవగాహన లేకపోవడంతో, ఎగ్జిబిషన్లను ప్రభావవంతంగా నిర్వహించాలని, ఎగ్జిబిషన్‌ ఏర్పాటుకు కావాల్సిన నిధులు కూడా సమకూర్చు కోవాలని, అలాగే సంబంధిత మంత్రి, స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించి రైతులందరికీ సౌకర్యంగా ఉండేలా జిల్లా స్థాయిలో స్థలాన్ని ఎంపిక చేసుకోవాలని సూచించారు. వ్యవసాయశాఖ తయారు చేసిన ప్రతిపాదనలను పరిశీలించి, ఇది ఆరంభం మాత్రమేనని, వ్యవసాయ యాంత్రీకరణ నిరంతర కార్యక్రమం అని, అందుకని ఎక్కడా, ఎటువంటి పొరపాట్లు జరగకుండా పటిష్టంగా నిబంధనలు రూపొందించి, రైతులకు ఈ సీజన్‌ ‌లోనే యంత్రాలను, పనిముట్లను అందజేయాలని ఆదేశించారు. జిల్లా స్థాయి ఎగ్జిబిషన్‌ ‌లను కూడా వెంటనే ఏర్పాటుచేయాలని, వ్యవసాయ, అనుబంధ రంగాల వారందరినీ ఈ ఎగ్జిబిషన్‌ ‌లో భాగస్వాములను చేయాలని కోరారు. ఎగ్జిబిషన్‌ ‌సమాచారం అన్ని ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి, రైతులను పెద్దఎత్తున పాల్గొనేటట్లు చేయాల్సిందిగా మంత్రి తుమ్మల సూచించారు.

సోయాబిన్‌ ‌సేకరణలో తెలంగాణ నెంబర్‌ ‌వన్‌
ఇప్పటిదాకా రైతుల వద్ద నుంచి మద్ధతు ధరకు సోయాబీన్‌ ‌ను సేకరించిన రాష్ట్రాలలో తెలంగాణ అగ్రగామిగా ఉన్నదని మార్క్‌ఫెడ్‌ అధికారులు వెల్లడించారు. డిపార్ట్ ‌మెంట్‌ ఆఫ్‌ అ‌గ్రికల్చర్‌ ‌ఫార్మర్స్ ‌వెల్పేర్‌ ‌జాయింట్‌ ‌సెక్రటరీ  సోయాబీన్‌ ఉత్పత్తి చేసే రాష్ట్రాలయిన కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ‌రాజస్థాన్‌, ‌గుజరాత్‌ ‌రాష్ట్రాల వ్యవసాయ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఇప్పటిదాకా జరిగిన సోయాబిన్‌ ‌సేకరణ గురించి సమీక్షించారు. ఇప్పటిదాకా రైతుల వద్ద నుంచి మద్ధతు ధరకు సోయాను సేకరించిన రాష్ట్రాలలో తెలంగాణ అగ్రగామిగా ఉన్నదని, సేకరణలో సాంప్రదాయ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, ‌మహారాష్ట్రాలను కూడా అధిగమించిందని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వ కృషిని అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 47 సెంటర్ల ద్వారా సోయా సేకరణ జరుగుతుందని, రూ. 4892 మద్ధతు ధర చెల్లిస్తూ, ఇప్పటికి 118.64 కోట్ల విలువ గల 24,252 మెట్రిక్‌ ‌టన్నుల సోయా చిక్కుడును, 1464 మంది రైతుల నుంచి సేకరించినట్లు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు  మంత్రి  ఆదేశాలతో గతంలో ఉన్న ఎకరా పరిమితి 6.5 క్వింటాళ్ళ నుంచి 10 క్వింటాళ్ళకు పెంచారని మన రాష్ట్రం నుంచి సమీక్షలో పాల్గొన్న మార్క్ ‌ఫెడ్‌ అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page