వ్యవసాయ రంగానికి ఊతం ఇవ్వాలి..!

రైతు శ్రేయస్సే జాతి శ్రేయస్సు…

దేశంలో ఎక్కువ శాతం వ్యవసాయం వర్షాధారం పైనే ఆధారపడివుంది. ఋతు పవనాలు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఏమైనా తేడా చేశాయో ఇక రైతు పని అంతే. ఒక్కోసారి ఎండలు అధికంగా ఉండం, పంటకు నీరు అవసరమైనప్పుడు వర్షాలు పడకపోవడం లేదా నీరు అవసరం లేనప్పుడు ఎక్కువ వర్షాలు కురవడమో జరుగుతుంది. ఈ విధమైన అతివృష్టి, అనావృష్టి , పంట ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయి. ఇంకా చీడ పురుగులు దాడి చేసే అవకాశం ఉంది. వీటిని నివారించడానికి పురుగు మందులు అవసరం. ఇక్కడ కూడా మరలా నకిలీలతో మోసపోతున్నాడు. అందరూ స్వంత వ్యవసాయ కమతాలు కలిగి ఉండరు. ఇంకో పెద్ద రైతు దగ్గర వ్యవసాయ క్షేత్రాన్ని కౌలుకు తీసుకుంటారు. పంట సరిగా పండకపోతే వీరు మరింత పేదరికంలోనికి నెట్టబడుతున్నారు. రైతు శ్రేయస్సే జాతి శ్రేయస్సు. రైతులు జాతికి ఆత్మ. అందరి కడుపులు నింపేవాడు. వ్యవసాయం తప్ప ఇంకో పని ఎరుగని వాడు.

తన కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నోడు. నిత్య కృషీవలుడు. పండిరచడం మాత్రమే తెలిసిన అమాయకుడు.  భారతదేశంలో దాదాపు మూడిరట  రెండొంతుల మంది ఉపాధి పొందే ఏకైక మార్గం వ్యవసాయం. ప్రతి ఒక్కరికీ అవసరమయ్యే పంటలు, పప్పులు, కూరగాయలు రైతులు పండిస్తున్నారు. వారు చాలా కష్టపడి పనిచేస్తారు కాబట్టే మన కడుపు చల్లగా ఉంటుంది. మనం భోజనం చేసినప్పుడల్లా ఆహారం తిన్నప్పుడల్లా రైతుకు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. మన దేశంలో ప్రధానమైన రంగం వ్యవసాయరంగం. దీనిలో రైతులదే కీలక పాత్ర.  దేశంలోని మొత్తం జనాభాలో 72.8% మంది ఇప్పటికీ గ్రామంలోనే నివసిస్తున్నారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయం లేదా దాని సంబంధిత వ్యవసాయ పరిశ్రమ నుండి జీవనోపాధి పొందుతున్నారు. వ్యవసాయం తరచుగా గ్రామీణ సమాజాలకు వెన్నెముక. గ్రామీణ ప్రాంతాలను ఉత్సాహంగా అభివృద్ధి చెందడంలో రైతులు కీలక పాత్ర పోషిస్తారు. భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జి.డి.పి)కి తోడ్పడటంలో అన్నదాతలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఒక భారతీయ రైతు చాలా కష్టపడి పనిచేస్తాడు. తెల్లవారుజామున లేచి, తన నాగలిని తీసుకొని, పగటిపూట కూడా తన పశువులతో తన పొలానికి వెళ్తాడు. వాతావరణ కష్టాలను పట్టించుకోకుండా రోజంతా అక్కడే పనిచేస్తాడు. చలికాలమైనా, ఎండాకాలమైనా, వర్షమైనా అతనికి ఒకటే. కాలంతో పని లేకుండా తన పొలంలో విత్తడం, దున్నడం, కోయడం చేసుకుంటాడు. రైతులు పండిరచే  పద్ధతులు పర్యావరణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. స్థిరమైన వ్యవసాయ పద్ధతులు సహజ వనరులను సంరక్షించడానికి, గ్రీన్హౌస్‌ వాయు ఉద్గారాలను తగ్గించడానికి, జీవవైవిధ్యాన్ని రక్షించడానికి సహాయపడతాయి. ఉపాధి, ఉత్పత్తి పరంగా ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం ప్రధాన దోహదపడుతుంది.

రైతులు వారి ఉత్పాదకత, లాభదాయకత జీవన నాణ్యతకు ఆటంకం కలిగించే అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. విద్యార్హత లేకపోవడంతో చాలా మంది రైతులు వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోలేక పోతున్నారు. వీరు పండిరచే  పంటలను విక్రయించడానికి ఇప్పటికీ దళారులపైనే ఆధారపడుతున్నారు. దళారులు రైతులను మోసం చేస్తున్నారు. మంచి పంటకు మంచి విత్తనాలు ఉండటం చాలా అవసరం. కానీ ఇప్పటికీ  కొంత మంది వ్యాపారులు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారు. తక్కువ ధరకి వస్తున్నాయనో లేదా అరువుగా ఇస్తున్నారనో, అవగాహనా లోపంతోనో చాలామంది రైతులు ఇటువంటి వ్యాపారుల దగ్గర విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. విత్తనాలే కాకుండా ఎరువుల విషయంలో కూడా ఇలానే జరగడం వలన సరైన పంట ఉత్పత్తి కాక రైతులు ఉసురూమంటున్నారు. ఇంకా ప్రకృతి కూడా వీరికి సహకరించాలి.

వ్యవసాయ ఉత్పత్తులు, శాస్త్ర సాంకేతికా భివృద్ధి ఫలాలు, ప్రపంచంలోనే న్కెపుణ్య యువ దేశంగా నిలవడం, మహమ్మారులను సమర్థవంతంగా ఎదుర్కోవడం, ప్రజారోగ్య ప్రగతి, విద్య వనరులు, న్కెపుణ్య యువభారత నిర్మాణం లాంటి పలు రంగాల్లో కొంత ప్రగతి సాధించామని అంగీకరించాల్సిందే. అంతరిక్ష పరిశోధనలు, డిజిటల్‌ యుగ పుణాదులు, అంతర్జాతీయ గుర్తింపులు, పునరుత్పాదక శక్తి వనరులు, పారిశ్రామిక ప్రగతి రథ గమనాలు, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ విస్తరణలు, సర్వ శక్తివంతమైన త్రివిధ దళాలు, స్మార్ట్‌ఫోన్‌ సంచలనాలు, ఆర్థిక పటిష్టతలు, ఆటోమొబ్కెల్‌ ఉరుకులు పరుగులు, వ్యవస్థీకృత సంస్కరణలు, కృత్రిమ మేధోయుగం వైపు పయనాలు లాంటి రంగాల్లో భారతం కొంత ప్రగతిని సాధించిందనటంలో అతిశయోక్తి కాదు.  అయితే నేటికీ దేశాన్ని పలు సంక్షిష్ట సమస్యలు చుట్టుముడుతూ అభివృద్ధి నిరోధకాలుగా నిలుస్తునే ఉన్నాయి. దేశవ్యాప్తంగా అవినీతి మహమ్మారిలు విస్తరించడం, అధిక జనాభా విస్పొటనం, సురక్షిత నీరు ఇంకిపోవడం, వెర్రి తలలు విసురుతున్న సామాజిక మాధ్యమాలు, రాక్షస నీచ రాజకీయాలు, నిరుద్యోగ దయ్యం, నిరక్షరాస్యత సంక్షోభం, కార్బన్‌ ఉద్గారాల చీకట్లు, పారిశుద్ధ్య కంపు, ప్రజారోగ్య తరుగు, పేదరిక సిండ్రోమ్‌, పలుచబడుతున్న సుపరిపాలనలు, రెచ్చిపోతున్న ప్రపంచీకరణ భూతం, భావ/పర్యావరణ కాలుష్య కోరలు విస్తరించడం, గాల్లో దీపాల్కెన మహిళా భద్రత, రెచ్చి పోతున్న అసమానతల భూతం, ఉత్తదవుతున్న ఉన్నత విద్య కలలు, మౌళిక వసతుల లోటు, రైతుల వెతలు, కూడు గూడు గుడ్డ కోసం హాహాకారాలు, శ్రమ దోపిడి శాపాలు, వలసల వెతలు లాంటి పలు తీవ్రమైన సమస్యలతో భరతమాత అనారోగ్యం పాలవుతున్నది. దీనికి తోడుగా కులాల కుళ్లు, మతాల మంటలు, ప్రాంతీయ గోడలు, ఉగ్రవాదుల ఉన్మాదాలు, భాషాదురభిమానాలు, మత్తులో తూగుతున్న యువత, వరకట్న పిశాచాలు, స్వార్థ పరంపరల ఊడలు, బడుగుల బహు వేదనలు, అన్కెతిక రాజకీయాలు, అత్యాచార హత్యల విష శృంఖలాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, లింగ భేదభావాలు, బక్కచిక్కిన బాలలు, స్థూలకాయ సుందరులు, విలువల పతనాలు, ప్రలోభాల వరదల ఎన్నికలు లాంటి గంభీరమైన సంక్లిష్ట సామాజిక సమస్యలతో భారతం సతమతం అవుతున్నది. నవ యువత న్కెపుణ్య శక్తిగా మారాలి. శిలాజ ఇంధనాలకు స్వస్తి పలికి సాంప్రదాయేతర ఇంధనాలను వినియోగించాలి. శాంతి స్థాపనలో పౌరులు భాగస్వాములు కావాలి. అసమానతల తొలగింపులో ముందడుగు వేయాలి. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి. కులమత సామరస్యాన్ని పెంచి పోషించాలి. న్కెతికతను నమ్మి నడవాలి. అమ్మాయిలో అమ్మను దర్శించాలి. వ్యవసాయ రంగానికి ఊతం ఇవ్వాలి. అక్షరాస్యతను పరిపూర్ణం చేయాలి. అంతర్జాల వలలో చిక్కకుండా తెలివిగా వినియోగించుకోవాలి. అసాధ్యాలను సులభంగా సుసాధ్యాలు చేయాలి.
 -ఎం.అజయ్‌కుమార్‌   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page