అలాగే ఉంటుంది

పిట్టలు మాత్రమే ఎగిరిపోతాయి
చెట్టు అలాగే దర్జాగా నిలబడుంటుంది

పరిమళం మాత్రమే ఆగిపోతుంది
గాలి అలాగే మంద్రంగా వీస్తుంటుంది

పైరు మాత్రమే కోయబడుతుంది
నేల అలాగే బలంగా ఉండిపోతుంది

పడవలు మాత్రమే తీరం చేరుకుంటాయి
సముద్రం అలాగే గంభీరంగా ఘోషిస్తుంటుంది

సూర్యుడు మాత్రమే అస్తమిస్తాడు
ఆకాశం అలాగే ఠీవిగా నిలిచుంటుంది

రోజులు మాత్రమే గడిచిపోతాయి
జ్ఞాపకం అలాగే తేలుతుంటుంది
మనసు ఆకాశాన విమానంలా

ఉద్యమకారుడు మాత్రమే మరణిస్తాడు
అతని భావజాలం అలాగే బతికుంటుంది
మున్ముందుకు ప్రయాణిస్తుంటుంది
గుండె నుండి గుండెకు దూకుతూ
తరం నుండి తరానికి చేరుతూ

౼ కార్తీక రాజు
    హనుమకొండ
    8977336447

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page