అమెరికాకు మళ్లీ స్వర్ణయుగాన్ని తీసుకువస్తానని అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే చెప్పారు. ట్రంప్ మరోమారు అమెరికా అధ్యక్షుడుగా ఎన్నిక కావడంతో..ఇప్పుడు మనదేశం కోణంలో చూస్తే సంబంధాలు బలంగానే ఉండే అకాశం ఉంది. ట్రంప్‌తో ప్రధాని మోదీకి మధ్య మంచి మితృత్వం ఉన్న కారణంగా ఆశాజనకంగా ఉంటుందన్న అంచనాలు మొదలయ్యాయి. అయితే ప్రధానంగా హెచ్-1 వీసాలు, గ్రీన్ కార్డులు, ఉద్యోగావకాశాలు వంటి వాటిపైనే యువత దృష్టి సారిస్తోంది. నిజానికి ఇప్పుడు ఉద్యోగ భద్రత అన్నది అమెరికాలో లేకుండా పోయింది. ఏ రోజు ఎవరిని ఊడబెరుకుతారో అన్నది సమస్యగా మారింది. ఈ అంశాల్లో మోదీ కూడా ట్రంప్‌తో అమరమరికలు లేకుండా మాట్లాడాలి. నిజానికి రాజకీయంగా మార్పు జరిగి నప్పుడు ప్రపంచంలో ఏ దేశంలో అయినా కొత్త ఆశలు పుట్టుకుని వస్తాయి. అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. ఈ రాజకీయ మార్పు అమెరికాను మళ్లీ గొప్పదిగా చేసేందుకు దోహదం చేయగలిగితే..అది ప్రపంచ దేశాలపైనా ప్రభావం చూపుతుంది. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లు నిర్వహించిన ప్రచారం అతిపెద్ద రాజకీయ ఉద్యమంగానే చూడాలి.
బ్కెడెన్ వయసు విరీద పడడంతో సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేక పోయారు. అలాగే కమలా హారిస్ కూడా అధ్యక్షుడిని ప్రభావితం చేసి ధృఢమైన నిర్ణయాలకు అడుగువేయలేక పోయారు. ఇది ఓ రకంగా సగటు అమెరికన్లను కలచి వేసిందనే చెప్పాలి. అందుకే గతంలో ఎప్పుడూ లేనంతగా అమెరికా గతంలో ఎన్నడూ చూడని విజయాన్ని ట్రంప్ చేజిక్కించుకున్నారు. అందువల్ల ఈ విజయానికి మరింత ప్రాముఖ్యత ఉంది. అమెరికా ను బలంగా, సురక్షితంగా, సుసంపన్నంగా చేసేవరకు విశ్రమించబోనని కూడా ట్రంప్ ప్రకటించారు. దేశాన్ని తీర్చిదిద్దే ప్రయత్నంలో, తన కర్తవ్య నిర్వహణలో ప్రజలంతా చేతులు కలపాలని కోరుతున్నట్లుగా కూడా ట్రంప్ ప్రకటించారు. అమెరికా చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ప్రజలు ఏకపక్షంగా ట్రంప్ విజయానికి దోహదపడ్డారు. భిన్నమైన సంస్కృతులు నేపథ్యాలున్నవారు ఉమ్మడి లక్ష్యాల కోసం ఏకతాటిపైకి రావడం చరిత్రాత్మకం. ప్రజలకిచ్చిన వాగ్దానాలు పూర్తిచేయడంలో ఏ శక్తీ తనను ఆపజాలదని ట్రంప్ కూడా ధృడంగానే ఉన్నారు. అసల్కెన అమెరికన్లకు దేశంలో ఉద్యోగ అవకాశాలు దక్కకుండా పోతున్నాయనీ, అమెరికా ఉత్పత్తుల అమ్మకాలకు అన్నిచోట్ల అడ్డంకులు ఎదురవుతున్నాయన్నదే ట్రంప్ నినాదం. తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు కూడా ఆయన ఇదే అభిప్రాయంతో ఉన్నారు.
ట్రంప్ పదేపదే చెబుతు న్నట్లుగా.. అమెరికా ఎదుర్కొంటున్న ఈ సమస్యకు కారణం నాలుగు దశాబ్దాలుగా ఆ దేశ పాలకులు అనుసరించిన విధానాలేనని చెప్పవచ్చు. అలాగని అమెరికా విరీద ఆధారపడ్డ ఇతర దేశాల వారిని చులకన చేయడం కూడా మంచిది కాదు. అన్ని దేశాల ఆర్థిక విధానాలను నయానా భయాన సరళీకరించి విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచేలా చేసింది అమెరికా విధానకర్తలే. 1990ల నుంచి బాగా ఊపందుకున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక దశ దాటిన తర్వాత అవసరమైన స్థాయిలో అమెరికన్ యువతకు ఉద్యోగాలను సృష్టించలేదు. ఈ రంగంలో కూడా చౌకగా లభ్యమయ్యే ఆసియా నిపుణులే ఎక్కువగా లబ్ది పొందారు. ఇటీవల వచ్చిన కృత్రిమ మేధో సాంకేతిక పరిజ్ఞానం కూడా ఊడిపోయే ఉద్యోగాలతో పోల్చితే సృష్టి అయ్యే ఉద్యోగాల సంఖ్య తక్కువే. కోవిడ్ అనంతరం ఐటీ రంగంలో హేమాహేవిరీలు అనదగిన కంపెనీలు కూడా పోటీలు పడి ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ ప్రధానంగా మధ్యతరగతి శ్వేత జాతీయులను ఆకర్షించడమే లక్ష్యంగా చేసుకుని రాజకీయాలను మొదలుపెట్టారు. మొదటిదఫా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడేనాటికే ఆ దిశలో అడుగులు వేసి విజయం సాధించారు. శ్వేతజాతి మధ్యతరగతికి ఉద్యోగ అవకాశాలు దక్కకపోవటానికి విదేశాలే కారణమని దుమ్మెత్తిపోశారు.
తన ఉత్పత్తులతో అమెరికా మార్కెట్‌ను ముంచెత్తిన చ్కెనాతో మొదలుపెట్టిన రాజకీయయుద్ధంలో అవసరమను కున్న చోట భారత్‌నీ లాగారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ విపరీతంగా దిగుమతి సుంకాలు విధిస్తోందని విరుచుకుపడ్డారు. తాజా ఎన్నికల్లో అయితే మంచి జీతాలుండే ఉద్యోగాలన్నిటినీ భారతీయులు కొట్టేస్తున్నారనీ ఆక్షేపించారు. వివిధ రంగాల్లో అమెరికా ఆధిపత్యం తగ్గటానికి, ఉద్యోగాల క్షీణతకు ఇతర దేశాల చర్యలే కారణమన్నట్లుగా ఆయన చేసిన ప్రచారానికి లక్ష్యం శ్వేత జాతీయులను ఆకర్షించడమే. అమెరికా జనాభాలో 60 శాతానికి కాస్త అటుఇటుగా ఉన్న శ్వేతజాతీయులను తనవైపు తిప్పుకోవటంలో మొదటిసారిలాగే రెండోసారి ట్రంప్ విజయం సాధించారు. శ్వేతజాతీయుల ఆధిపత్యానికి ముప్పు ముంచు కొస్తుందనే ఒకరకమైన భయాన్ని, ఆందోళనను కలిగించటంలో ట్రంప్ సఫలీకృతమయ్యారు. ఉద్యోగ భద్రతను, ఉద్యోగ కల్పనను తగినంత ఇవ్వలేని ఆర్థిక వ్యవస్థ అభద్రతా సమాజాన్ని సృష్టిస్తుంది.
నియంతలే కాకుండా, ప్రజాస్వామ్య ఎన్నికల ద్వారా అధికారం చేపట్టి నియంతృత్వ పోకడలను ప్రదర్శిస్తున్న నేతలు ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టటాన్ని తమకు సానుకూలంగా భావిస్తున్నారు. రష్యా అధినేత పుతిన్ కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది. రష్యా పెట్టే షరతులకు ఉక్రెయిన్ అంగీకరించేలా చేసి యుద్దాన్ని విరమింపచేస్తానని ట్రంప్ బహిరంగంగానే ప్రకటించారు. ఇజ్రాయెల్ నేత నెతన్యాహుకు కూడా ట్రంప్ పట్ల వ్యతిరేకత ఉందని చెప్పలేం. హమాస్ నిర్మూలన పేరుతో గాజాలో సాగుతున్న నరమేధాన్ని ఆపేలా ట్రంప్ తనపై ఒత్తిడి తెస్తారని ఇజ్రాయెల్ పాలకవర్గాలూ భావించటం లేదు. వీటన్నిటికంటే ముఖ్యమైంది వాతావరణ మార్పులపై కార్యాచరణ. అసలు వాతావరణ మార్పులే ప్రమాదకరంగా లేవనీ ప్రమాదకరమని ప్రచారం చేసే వాళ్లవి డొల్ల వాదనేనని ట్రంప్ అనేకసార్లు ఈసడిరచారు. ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు తాను గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ప్రకటించారు. పాత వైఖరికే కట్టుబడి ట్రంప్ వ్యవహరిస్తే ప్రపంచానికి వాతావరణపరంగా గడ్డుకాలం తప్పదనే అనుకోవాలి. మొత్తంగా భారత్‌తో ఉన్న సంబంధాల విషయంలో పెద్దగా కఠిన వైఖరిని ప్రదర్శించే అవకాశం ఉండకపోవచ్చు. ి
రేగటినాగరాజు
(సీనియర్ జర్నలిస్ట్)