అగ్రరాజ్యం అమెరికా అధిపతి ఎవరు..?

 అమెరికా ఎన్నికలు ప్రపంచం అంతా ఉత్కంఠం..

అమెరికా ఎన్నికలు.. కమలా హారీస్, డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్య హోరాహోరీ పోరుతో అమెరికా ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి, ఇంతకీ. అమెరికా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేదెవరు..? అనేది చూస్తే, ఇద్దరిలో ఎవరు గెలుస్తారో ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే.. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో చాలావరకు రిపబ్లికన్, డెమొక్రటిక్‌ పార్టీల్లో ఏదో ఒకదానికి స్పష్టంగా మద్దతిచ్చేవే కావడంతో వాటిని సేఫ్‌ స్టేట్స్‌గా పిలుస్తారు. ప్రతి అధ్యక్ష ఎన్నికల్లోనూ సదరు రాష్ట్రాలను ఆయా పార్టీలే గెలుచుకుంటాయి. ఎటూ తేల్చుకోని ఓటర్లు ఎక్కువగా ఉండే కొన్ని రాష్ట్రాలపై పోటీ ఆధారపడడంతో స్వింగ్‌ స్టేట్స్‌గా మారాయి. నువ్వా? నేనా? అనేలా పోటీ ఉండే స్వింగ్‌ స్టేట్స్‌ అమెరికాలో ఏడున్నాయి. పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, మిషిగన్, నార్త్‌ కరోలినా, జార్జియా, నెవడా, అరిజోనా.. ఈ ఏడు రాష్ట్రాల్లో 93 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి. వీటిలో మెజారిటీ ఓట్లను సాధించినవారే అమెరికా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకుంటారు. అధ్యక్ష పదవికి హోరాహోరి ప్రచారం జరిగింది… సర్వేలలో కూడా అంతుచిక్కని స్పష్టత.

కమలా హారిస్, డోనల్డ్ ట్రంప్, ఇద్దరిలో ఎవరు గెలిస్తే భారత్‌కు ప్రయోజనం..?
అమెరికా ఎన్నికల ఫలితాలు భారత్‌తో సహా మొత్తం ప్రపంచంపై ప్రభావం చూపుతుంటాయి. ప్రపంచంలోని చాలా అంశాలు అమెరికా వైఖరిపై ఆధారపడి ఉంటాయి. భారత్ ఇప్పుడు తన వస్తువులను వీలైనంత త్వరగా విదేశాలకు విక్రయించాలి. అప్పుడే దేశం పురోగమిస్తుంది. ట్రంప్ ప్రభుత్వం వస్తే అది పెద్ద అడ్డంకి కావొచ్చు.ట్రంప్ వాణిజ్య విధానం చాలా రక్షణాత్మకమైనది. ఆ అంచనాలను అందుకోవడం భారత్‌కు కఠినంగా ఉండవచ్చు.వలస విధానంలో ట్రంప్ కఠినంగా ఉంటారని, అది కూడా భారత ప్రయోజనాలకు ఇబ్బందిగా మారుతుంది., భారత ప్రభుత్వానికి, వాణిజ్యానికి ఇద్దరితో కొన్ని ప్రయోజనాలు, మరికొన్ని సవాళ్లు ఉన్నాయి, అయితే కమలహరిస్ విజయం సాధిస్తే ఇండియాకు ప్రయోజనంచేకూర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరియు ప్రపంచ శాంతికి తోడ్పాటుగా శాంతి పరిరక్షణ చెప్పటడం జరుగుతుంది అని విశ్వాసం.,

కమల పూర్వీకుల గ్రామంలో ప్రత్యేక పూజలు అధ్యక్ష ఎన్నికలలో భారత సంతతికి చెందిన కమలా హారిస్ డెమోక్రాటిక్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు దీంతో ఆమె పూర్వీకుల గ్రామమైన తమిళనాడు లోని తులసేంద్రపురం ఆలయంలో స్థానికులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయం వద్ద ‘ది డాటర్ ఆఫ్ ది ల్యాండ్’ అంటూ బ్యానర్ ఏర్పాటు చేసి. కమలా హారిస్‌కు మద్దతు తెలియజేయడం జరిగింది, అదే విధంగా యావత్ భారత కమల గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు, ప్రపంచ దేశాలలో అగ్రరాజ్యంగా అనుభూతి పొందుతున్న దేశానికి మన మూలాలు ఉన్న వారు అధిపతి కావాలి అని యావత్ భారత దేశం ఎదురుచూస్తుంది. కమలా గెలిస్తే తొలి మహిళా అధ్యక్షురాలిగా అధ్యక్ష పీఠం.. అధిరోహించిన వ్యక్తి అవుతారు.

అమెరికాలో స్థిరపడిన భారతీయుల ఓట్లు ఎవరికి.?
సుమారు 26లక్షల భారతీయులు ఓట్లు ప్రభావం చూపే అవకాశం ఉంది, భారతీయులకు అమెరికా ఎన్నికల్లో వలసలు, వీసా విధానం ప్రధాన సమస్యలు. వలసలపై ట్రంప్ పాలసీ కూడా పెద్ద సమస్యగా మారింది. బైడెన్ ప్రభుత్వం అక్రమ వలసలను ఆపలేకపోయిందని ట్రంప్ విమర్శించడం జరిగింది.అమెరికాకు వస్తున్న భారతీయుల్లో ఎక్కువమంది విద్యావంతులే. అయితే, ట్రంప్ అధ్యక్షుడు అయితే, వీసాల విషయంలో కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది, అని అదే విధంగా అక్కడ ప్రస్తుతం నివాసం ఉంటున్నవారు ఇంకా ఏమైనా కఠిన ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందిఏమో అని సందేహం వ్యక్తంచెయ్యడం జరుగుతుంది…

ఎలక్టోరల్ కాలేజ్ వ్యవస్థ ఏంటి..?
ఇద్దరి భవితవ్యాన్ని తేల్చేది పాపులర్ ఓట్లు కాదు. ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు. ఇంతకీ ఈ ఎలక్టోరల్ కాలేజ్ వ్యవస్థ ఏంటి? అధ్యక్షుడిని ఎవరు ఎన్నుకుంటారు? ప్రతి రాష్ట్రంలో జనాభా ఆధారంగా ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. ప్రతి రాష్ట్రానికి ఇద్దరు సెనేటర్లు చొప్పున 100 మంది సెనేటర్లు కూడా ఉంటారు. రాజధాని వాషింగ్టన్‌లో ముగ్గురు సెనెటర్లు ఉంటారు. అంటే మొత్తం 103 మంది సెనేటర్లు. వీరు కాకుండా జనాభా ప్రాతిపదికన ఎలక్ట్రోరల్‌ కాలేజీలో ఓటేసేందుకు 435 మంది ప్రతినిధులు ఉంటారు. వీరినే ఎలక్టర్లు అంటారు. ఇవన్నీ కలిసి మొత్తం 538 ఎలక్టోరల్‌ ఓట్లు. అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు ఆయా రాష్ట్రాల్లో తమ ఎలక్టర్లను ముందే నిర్ణయిస్తాయి. ప్రజలు ఈ ఎలక్టర్లకే ఓట్లు వేసి గెలిపించుకుంటారు. కాలిఫోర్నియాకు అత్యధికంగా 54, టెక్సాస్‌కు 40 ఎలక్టోరల్‌ ఓట్లు ఉండగా.. తక్కువ జనాభా గల వ్యోమింగ్‌కు 3 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి.

మేజిక్ ఫిగర్ ఎంతంటే.?
అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. అందులో 270 ఓట్లు సాధించినవారు అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారు. ‘విన్నర్ టేక్స్ ఆల్’ విధానం ప్రకారం ఒక రాష్ట్రంలోని మెజార్టీ ఓట్లు సాధించిన అభ్యర్థి పార్టీకే అక్కడి మొత్తం ఓట్లు లభిస్తాయి. దీంతో పలు రాష్ట్రాల్లో ట్రంప్, కమల మెజార్టీ దక్కించుకోవడం ఖాయంగా మారింది. అయితే స్వింగ్ స్టేట్స్ (అటూ, ఇటుగా ఉండే) గా పిలవబడే రాష్ట్రాలే అధ్యక్షుడిని డిసైడ్ చేయనున్నాయి. ఈ లెక్కన కమలా హారిస్‌కు 226 ఓట్లు సాధిస్తారు. ట్రంప్‌కు మాత్రం 219 ఓట్లే వస్తాయి. దాంతో.. స్వింగ్‌ స్టేట్లలోని 93 ఓట్లు అత్యంత కీలకంగా మారాయి. ట్రంప్‌ గెలవాలంటే ఆ 93లో కనీసం 51 ఓట్లు సాధించాలి. హారిస్‌కు మాత్రం 44 ఓట్లు సరిపోతాయి. అలాగే.. 19 ఎలక్టోరల్‌ ఓట్లున్న పెన్సిల్వేనియా ఈసారి మొత్తం అమెరికా దృష్టినీ ఆకర్షిస్తోంది. అక్కడ నెగ్గిన అభ్యర్థే అధ్యక్షుడయ్యే అవకాశం 90 శాతం వరకూ ఉండడంతో పెన్సిల్వేనియాలో హారిస్, ట్రంప్‌ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.

విజేతను ఎప్పుడు ప్రకటిస్తారు అంటే…
అమెరికాలో బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ పూర్తయిన రోజు సాయంత్రం నుంచే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 2020లో ఓట్లను లెక్కించడానికి కొన్ని రోజుల సమయం పట్టింది. అందువల్ల ఫలితాల ప్రకటన ఆలస్యమైంది. ఎలక్టోరల్‌ కాలేజీకి ఎంపికైన ప్రతినిధులు డిసెంబరు 17న సమావేశమై అమెరికా అధ్యక్షులు ఎవరు అని ఎన్నుకుంటారు…

-జాజుల దినేష్.
పొలిటికల్ సైన్స్ లెక్చరర్,
సామాజిక విశ్లేషకులు..
ఎంఏ. ఏంఎడ్‌, సెట్, పిజిడిసిఎ.
నల్గొండ జిల్లా..
9666238266

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page