నేడు ఎపి కేబినేట్‌ భేటీ

పలు కీలక నిర్ణయాలపై చర్చ
నేడు  ఉదయం సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలపై చర్చించి.. ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తుంది. వరదప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్‌లో స్టాంపు డ్యూటీ, రిజిస్టేష్రన్‌ ఫీజుల మినహాయింపుపై నిర్ణయించే అవకాశముందని సమాచారం. అలాగే చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది. ఇక 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 పోస్టుల భర్తీ ప్రతిపాదనపై ఈ కేబినెట్‌ భేటీలో చర్చించనుంది. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణ చేసేందుకు పలు ప్రతిపాదనకు రానున్నాయి.

వాటిపై చర్చించి.. కేబినెట్‌ ఓ నిర్ణయం తీసుకోనుంది. దేవాలయాల పాలక మండలిలో 15 నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై చర్చించి ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై ఈ సందర్భంగా చర్చించనుంది. దేవాలయాల్లో చైర్మన్‌ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి పచ్చ జెండా ఊపే అవకాశముందని తెలుస్తుంది. రాష్ట్రంలో స్వర్ణకారుల వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు ఈ క్యాబినెట్‌లో ఆమోదముద్ర పడనుంది. కూటమి సర్కారు అధికారంలోకి వొచ్చిన అనంతరం ప్రభుత్వ జిఓలు ఉండే  వెబ్‌సైట్‌ను తిరిగి పునరుద్ధరించాలని నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page