మంత్రి కొండా సురేఖతో క్షమాపణ

ఇంతటితో వివాదానికి తెరవేద్దామని పిసిసి చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ ప్రకటన

తెలుగు పరిశ్రమలో పెను దుమారం రేపిన మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌ చిచ్చు ఇంకా చల్లారలేదు. దీనిపై అమె ఒకడుగు వెక్కి తగ్గి వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నా సినిమా ఇండస్టీ నుంచి ఎదురుదాడి కొనసాగుతూనే ఉంది. ఫిల్మ్‌ ఛాంబర్‌ కూడా ప్రత్యేకంగా సమావేశమై దీనిపై చర్చించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఈ వివాదానికి ముగింపు పలకాలని కాంగ్రెస్‌ ప్రయత్నాలు ప్రారంభించింది. కొండాసురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నందున ఈ వివాదానికి పుల్‌స్టాప్‌ పెట్టాలని సినీ ప్రముఖులను తెలంగాణ పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ విజ్ఞప్తి చేశారు. ఇరు వైపుల కూడా మహిళలే ఉన్నందున అర్థం చేసుకొని శాంతించాలని కోరారు. తప్పును గ్రహించి కొండా సురేఖ వెనక్కి తగ్గారన్నారు. అందుకే వివాదాన్ని ముగిస్తే సమంజసంగా ఉంటుందన్నారు.

అదే టైంలో కొండా సురేఖపై కేటీఆర్‌ చేసిన కామెంట్స్‌, ట్వీట్‌లను కూడా పరిశీలించాలని సూచించారు. కాంగ్రెస్‌ నేతలు, మంత్రులు, కాంగ్రెస్‌ కార్యకర్తలకి కూడా మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పలు సూచనలు చేశారు. వివాదాల జోలికి పోవద్దని సూచించారు. ఏదైనా విషయంపై మాట్లాడే టైంలో జాగ్రత్తగా ఉండాలని హితవుపలికారు. పదాలు వాడే క్రమంలో కంట్రోల్డ్‌గా ఉండాలన్నారు. కేటీఆర్‌పై తీవ్రంగా విమర్శలు చేసే క్రమంలో అక్కినేని ఫ్యామిలీ, సమంతపై కొండ సురేఖ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇవి పెను దుమారానికికారణమయ్యాయి.

ఆమె విూద ఫైర్‌ అవుతూ తెలుగు ఇండస్ట్రీలోని పెద్దలంతా గళం విప్పారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి కామెంట్స్‌ చేయడం ఏంటని ప్రశ్నించారు. అటు అక్కినేని ఫ్యామిలీ కూడా తమను రాజకీయాల్లోకి లాగొద్దని అభ్యర్థించారు. సమంత కూడా ఘాటుగా స్పందించారు. వివాదం ముదురుతుందని గ్రహించిన తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. బుధవారం రాత్రి కొండా సురేఖతో మాట్లాడి వివాదానికి పుల్‌ స్టాప్‌ పెట్టే చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో వెంటే సమంతను ట్యాగ్‌ చేస్తూ కొండా సురేఖ ట్వీట్‌ చేశారు. తను తప్పుగా మాట్లాడినట్టు అనిపిస్తే తన కామెంట్స్‌ను వెనక్కి తీసుకుంటానంటూ చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page