ప్ర‌జా విజ‌యోత్స‌వాలకు ఏర్పాట్లు ముమ్మ‌రం..

ఎల్ఈడీ స్క్రీన్లు, షామియానాలు, మెడిక‌ల్ క్యాంపులు, మొబైల్ టాయిలెట్లు,
ఎల్బీ స్టేడియంలో అతిథులుకు స‌క‌ల వ‌స‌తులు
ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన  ఉన్నతాధికారులు

హైదరాబాద్ ఎల్.బి స్టేడియంలో  ఈనెల 14న నుంచి ప్రారంభం కానున్న ప్రజా విజయోత్సవాలకు సంబంధంచిన‌ ఏర్పాట్లను ప్రభుత్వ ఉన్న‌తాధికారులు మంగళ వారం సాయంత్రం పరిశీలించారు. సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ డాక్టర్. ఎస్.హరీష్, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకటరావు, సమాచార శాఖ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ రాధాకిషన్, రీజినల్ ఇన్ఫర్మేషన్ జయరామూర్తి, రోడ్లు, భవనాలు శాఖ అధికారులు, ఇంజనీర్లు ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు.

గత సంవత్సర కాలంలో విద్యార్థుల కోసం చేసిన గణనీయమైన మార్పులు, డైట్ చార్జీల పెంపు, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, ఇంటి గ్రేటడ్ స్కూల్స్ ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలకు ఉచిత కరెంట్, తదితర ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన సంద‌ర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

దాదాపు 14 వేల మంది పాఠశాల విద్యార్థులతో విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులు, ప్రతినిధులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. వాట‌ర్ ప్రూఫ్ టెంట్లు, ప్రత్యేక షామియనాలు, ఎల్ఈడీ స్క్రీన్లు,  మీడియా గ్యాలరీ, ప్రత్యేక వైద్య సదుపాయలు, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page