దిల్లీ నూతన సిఎం అతిశి

న్యూదిల్లీ,సెప్టెంబర్‌17: ‌దిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్‌ ‌రాజీనామా చేయ డంతో..ఆయన స్థానంలో అతిషీని తదు పరి సిఎంగా ఆప్‌ ‌నేతలు ఎన్నుకున్నారు.  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌ప్రకటించిన నేపథ్యంలో తర్వాత సిఎంగా ఎవరు బాధ్యతలు తీసుకుంటారనే ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర మంత్రి అతిషిని దిల్లీ కొత్త సిఎంగా కేజ్రీవాల్‌ ‌ప్రకటించారు. సిఎంగా ఆతిషి బాధ్యతలు చేపడతారని ఆయన వెల్లడించారు. సిఎంగా ఎవరిని నియమించాలని పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో కేజీవ్రాల్‌ ‌చర్చించారు. అనంతరం శాసనసభా పక్ష సమావేశంలో మంత్రి అతిషి పేరును ప్రతిపాదించారు కేజీవ్రాల్‌. ఈ ‌ప్రతిపాదనకు శాసనస భాపక్షం ఆమోదం తెలిపింది. సాయంత్రం లెప్ట్ ‌నెంట్‌ ‌గవర్నర్‌ ‌ను కలిసి తన రాజీ నామా పత్రాన్ని గవర్నర్‌ ‌కు అందజే యనున్నారు.

సిఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ  జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రజలు తనకు సర్టిఫికెట్‌ ఇచ్చేంతవరకూ ముఖ్యమంత్రి పదవిలో ఉండబోనని స్పష్టం చేశారు. సీఎం కుర్చీ నుంచి దిగిపోయి.. మధ్యంతర ఎన్నికలకు వెళ్లి ప్రజల్లో తన విశ్వసనీయతను పరీక్షిం చుకు ంటా నని ప్రకటించారు. మద్యం విధానానికి సంబం ధించిన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌ ‌గతవారమే తిహాడ్‌ ‌జైలు నుంచి విడుదల య్యారు. ఈ క్రమంలోనే మంగళ వారం కేజీవ్రాల్‌ ‌తన పదవికి రాజీనామా చేయను న్నారు. ఈమేరకు లెప్టనెంట్‌ ‌గవర్నర్‌ (ఎల్జీ) వీకే సక్సేనాను కలిసేందుకు ఆయన అపాయింట్‌మెంట్‌ ‌కోరగా సాయంత్రం 4.30 గంటలకు సమయం కేటాయించినట్లు రాజ్‌భవన్‌ ‌వర్గాలు వెల్లడించాయి. కేజీవ్రాల్‌ ‌రాజీనామాను ఎల్జీ ఆమోదించిన తర్వాత.. కొత్త సీఎంగా ఆతిశీ పేరును ఆప్‌ ఎమ్మెల్యేలు గవర్నర్‌కు సమర్పించనున్నారు.

సెప్టెంబరు 26-27 తేదీల్లో దిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఆ సమావేశాల్లోనే ఆతిశీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఆప్‌ ‌వర్గాలు వెల్లడించాయి. ఈసారి డిప్యూటీ సీఎంగా ఎవరినీ ప్రకటించే అవకాశాలు లేవని తెలుస్తోంది. దిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే నవంబరులోనే మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని కేజీవ్రాల్‌ ‌డిమాండు చేస్తున్నారు. అయితే, ఎన్నికల సంఘం మాత్రం ముందస్తుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. ఫిబ్రవరిలోనే ఈసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం.కాగా, మద్యం పాలసీ కేసులో కేజీవ్రాల్‌ ఇటీవలే బెయిల్‌ ‌పై విడుదలయ్యారు. అయితే, బెయిల్‌ ‌మంజూరు చేస్తూ.. సిఎం కార్యాలయానికి వెళ్లకూడదని, అధికారిక ఫైల్స్ ‌పై సంతకం చేయకూడదని కేజీవ్రాల్‌ ‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో కేజీవ్రాల్‌ ‌సిఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page