తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మ

బతుకమ్మ పండుగను భాద్రపద అమావాస్య మొదలు ఆశ్వియుజ శుక్ల అష్టమి వరకు తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులు ఘనంగా జరుపుకునే పూల పండుగ బతుకమ్మ పూరాతనంలో బృహదమ్మ (పార్వతి) నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకు గాను, తమ దు:ఖాన్ని చోళులకు తెలియజేస్తూ మెరూ పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలు పెట్టారు తెలంగాణ వాసులు. అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. బతుకమ్మను దాదాపు పది శతాబ్దల నుండి జరుపుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతానికి సొంతమైన, శక్తివంతమైన పండుగగా తెలంగాణ వాసులు బతుకమ్మ పండుగను మహిళలు మాత్రమే విశేషంగా జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ప్రత్యేకంగా పూసే పువ్వులను తీసుకు వచ్చి బతుకమ్మను పేర్చి మహిళలందరూ కలిసి జరుపుకునే వేడుక. ఈ పండుగ తెలంగాణ సాంస్కృతిక గుర్తింపుకు చిహ్నం. బతుకమ్మ శీతాకాలం ప్రారంభానికి ముందు, వర్షాకాలం చివరలో అంటే రెండు కాలాలకు సంధికాలంలో వస్తుంది. వర్షాకాలంలో తెలంగాణలోని అన్ని చెరువులు , కుంటలు పుష్కలంగా నీటితో నిండి ఉంటాయి. సాగు చేయని, బంజరు భూములలో అడవి పువ్వులు వివిధ రంగులలో వికసించి ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తాయి.

ప్రకృతి పరవశంలో ఉన్నప్పుడు గౌరీ దేవిని పూజించి జరుపుకునే బతుకమ్మకు ఎంతో విశిష్టత ఉంది. బతుకమ్మ పండుగ సమయంలో గునుగు పూలు, తంగేడు పూలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెలోనూ మహిళలు విశేషంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. ఆడపడుచులు బతుకమ్మ వేడుకలను చేసుకోవటానికి అమ్మగారింటికి చేరుకుంటారు. పుట్టింట్లో తొమ్మిదిరోజుల పాటు రంగురంగుల పుష్పాలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను పూజిస్తారు. వేములవాడ కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఉండేది. ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు, చోళులు నమ్మేవారు. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలాగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నారు తెలంగాణ వాసులు. బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు బొడ్డెమ్మలు ఆడుతూ జరుపుకునే వారు అదే విధంగా మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మను నవ రాత్రులు పూజించి బతుకమ్మతో పాటూ అమ్మవారిని నిమజ్జనం చేస్తారు. తెలంగాణ పూల జాతర వచ్చేసింది ఈ ఏడాది బతుకమ్మ వేడుకలకు విస్తారంగా కురిసిన వర్షాలతో ఎటు చూసిన అడవి పూలు అందంగా విరబూసి రకరకాల పువ్వులు దర్శనము ఇస్తున్నాయి. భక్తితో బతుకమ్మను పూజించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

బతుకమ్మ పూలు అన్ని కూడా ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి సమర్పించే నైవేద్యాలకు అనుగుణంగా బతుకమ్మ పేర్లు కూడా ఉంటాయి. తెలంగాణ పూల జాతర వచ్చేసింది. తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో సంబురంగా జరుపుకునే పండుగ బతుకమ్మ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేళ తొమ్మిది రోజుల పాటూ రాష్ట్ర వ్యాప్తంగా ఊరూ వాడా ఎక్కడ చూసినా సందడే కనిపిస్తుంది. ఈ తొమ్మిది రోజుల పాటు రోజుకు ఒక రకమైన నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు. మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు తొమ్మిది రోజులు బతుకమ్మకు నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. రోజుకో విధమైన బతుకమ్మను పేర్చి ఎంగిలి పువ్వుల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకుంటారు.

కులాలకు అతీతంగా వేడుకలలో పాల్గొంటారు. ముచ్చటగా ముస్తాబై బతుకమ్మలు తయారు చేసి అమ్మ, అక్కలందరూ కలసి ఆడి పాడుతారు. బతుకమ్మను పండుగను జరుపుకోవడానికి అనేక కథలు ఉన్నాయి దాంట్లో భాగంగానే చోళ రాజవంశానికి చెందిన ధర్మాంగద అనే రాజుకు ఒక కూమర్తే ఉండేది. ఈ రాజు ఎక్కువగా దక్షిణ భారతదేశాన్ని పాలించాడు. ఆ రాజుకు వంద మంది కుమారులు పుట్టి మరణించగా లక్ష్మీ దేవి అనుగ్రహంతో అతని భార్య ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది, ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టారు, ఆమె పెరుగుతున్న క్రమంలో ఊహించని ప్రమాదాలు, సంఘటనల నుండి బయటపడింది, తల్లిదండ్రులు తమ ఏకైక బిడ్డను సాదుకుంటునే లక్ష్మి గురించి ఆందోళన చెందుతూ తమ కుమార్తెకు బతుకమ్మ అని పేరు పెట్టారు, అలా పెట్టడం వల్ల గండాలను అధిగమించి ఆమె బ్రతుకుతుందని విశ్వసించారు. రాజకుమార్తె పుట్టిన రోజున ఈ బతుకమ్మ పండుగను జరుపుకునేవారు. అమ్మవారిని భక్తితో ఆరాధిస్తూ ఈ పండుగను జరుపుకోవడం వల్ల శుభాలు కలుగుతాయని భావించేవారు. బతుకమ్మ తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో కూడా కీలకంగా మారింది, ఊరురా బతుకమ్మ ఆట పాటతో తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపింది. బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్యపాత్ర పోషించింది. రాష్ట్రం వచ్చకా బతుకమ్మ పండుగను అధికారికంగా ప్రకటించింది గత రాష్ట్ర ప్రభుత్వం. నేడు బతుకమ్మ ప్రపంచ వ్యాప్తం అయింది.

మిద్దె సురేష్
కవి, వ్యాసకర్త
9701209355

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page