మళ్లీ సీజనల్‌ వ్యాధులు.. అప్రమత్తత అవసరం!

వానాకాలంలో సీజనల్‌ వ్యాధులు చెలరేగితే ప్రజలకు కష్టాలు మరింతగా పెరుగుతాయి. యేటా వానా కాలంలో వ్యాధుల ముప్పు పెరిగి పేదల జీవితాలు దుర్భరమవుతున్నాయి. మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, మెదడువాపు, ఫైలేరియా, అతిసారం, ట్కెఫాయిడ్‌, తదితర సీజనల్‌ వ్యాధులు గ్రావిరీణులను తీవ్రంగా వేధిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండే చోట దోమలు వృద్ధి చెందే అవకాశమున్నందున పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారించాలి. సీజనల్‌ వ్యాధులతో పాటు, కరోనా నియంత్రణ చర్యలను కూడా ఏకకాలంలో కొనసాగించాలని వైద్య ఆరోగ్యశాఖల అధికారులకు సూచిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో నీటిసంబదిత, కీటక సంబందిత వ్యాధులు ప్రబలుతున్నందున్న జాగ్రత్తగా ఉండాలి.

జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో ఉన్న సామాజిక, భౌగోళిక వైరుధ్యాల కారణంగా యేటా వానాకాలంలో అంటు వ్యాధులతో పాటు డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక జ్వరాలు కూడా ప్రబలడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. మరీ ముఖ్యంగా కనుమరుగైపో యిందని భావించిన మలేరియా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. ఏజెన్సీ గ్రామాల్లో గత ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు అధికారిక గణంకాల ప్రకారమే 60 మలేరియా కేసులు నమోద్కెనట్టు తెలుస్తోంది. అనధికారంగా ఈ సంఖ్య నాలుగైదు రెట్లు అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు.. మలేరియా, డెంగ్యూ జ్వరాలతో బాదితులు మరణించినట్లు అధికారికంగా రికార్డు కాకపోయినా ఏజెన్సీలో ఎలాంటి డయాగ్నసిస్‌ చేయని కేసులే అధికంగా ఉన్నాయంటున్నారు.

ఇందులో పదుల సంఖ్యలో బాదితులు మృత్యువాత పడ్డారని అంటున్నారు. కొందరు డెంగ్యూ లక్షణాలతోనే మృత్యువాత పడ్డారనే విషయం తెలుస్తోందని నిపుణులు చెబుతున్నారు. కాగా వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం ప్రస్తుతం సీజనల్‌ వ్యాధుల నియంత్రణపై దృష్టి సారించామని చెబుతున్నా మారుమూల గ్రామాల్లో రహదారులు సరిగ్గా లేని కారణంగా సిబ్బంది గ్రామాల్లోకి వెళ్లి శాంపిల్స్‌ను సేకరించే పరిస్థితులు అంతంత మాత్రమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో చాలా మంది జ్వరాల బారిన పడిన రోగులు అందుబాలులో ఉండే ఆర్‌ఎంపీలు, సాంప్రదాయ నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తూ ప్రాణాల విరీదకి తెచ్చుకుంటున్నారని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా ఏజెన్సీలో మలేరియా వంటివ్యాధుల నియంత్రణ కోసం ఆదివాసీ గ్రామాల్లో దోమ తెరలను పంపిణీ చేశారు. మారుమూల అటవీ గ్రామాల్లో ప్రతి సీజన్‌లో అంటువ్యాధులు ప్రబలి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉత్పన్న మవుతోంది. ఇప్పటికీ జిల్లాలో ఉన్న ప్రాథమిక, ఉప కేంద్రాల్లో సిబ్బంది సంఖ్య పరిమితంగా ఉన్నప్పటికీ వారు కూడా సరిగ్గా విధులకు హాజరు కాక పోవడం వల్ల గిరిజనులకు వైద్యం అందని ద్రాక్షగా మారుతుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. సమస్యాత్మక గ్రామాల్లో దోమల నుంచి రక్షణ కోసం దోమతెరలను పంపిణీ చేశామని వైద్యాధికారులు తెలిపారు. గ్రామాల్లో సీజనల్‌ అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడిరచారు.
-రేగటినాగరాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page