రైతుల ఇష్ట ప్రకారమే.. భూసేకరణ జరగాలి

గ్రామాలల్లో పోలీసులను మోహరించడం దారుణం : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌ 12 : ‌భూసేకరణ రైతుల ఇష్టప్రకారం జరగాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. కొడంగల్‌ ‌చుట్టుపక్కల మండలాల్లో ఇం టర్నెట్‌ ‌సేవలు, కరెంటు బంద్‌ ‌చేసి వందల మంది పోలీసులను గ్రామాల్లో మోహరించి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తు న్నామని చెప్పారు. కలెక్టర్‌, అధికారులపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నా మని, అయితే రైతులపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకునేది లేదని వెల్లడించారు. భూసే కరణ రైతుల ఇష్ట ప్రకారం జరగాలి తప్ప.. బలవంతంగా తీసుకునే అధికారం ప్రభు త్వానికి లేదన్నారు.

గతంలో ముచ్చర్లలో ఫార్మా సిటీ కోసం భూములు సేకరించినప్పుడు ఆ సమయంలో ప్రతి పక్షంలో ఉన్న ఇదే కాంగ్రెస్‌ ‌పార్టీ వ్యతిరే కించదని ఆయన గుర్తుచేశారు. అప్పుడు వ్యతిరేకించిన రేవంత్‌ ‌రెడ్డి.. ఇప్పుడు భూములు గుంజు కుని రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులపై దాడిని ఖండిస్తు న్నామని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ ‌రెడ్డి అన్నారు. దుద్యాల ఘటన ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందని చెప్పారు. దాడి వెనుక ఎవరున్నా సహించేది లేదని చెప్పారు. ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని డిమాండ్‌ ‌చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page