- శాంతిభద్రతలపై రాజీ ప్రసక్తి లేదు
- కఠినంగా ఉండాల్సిదే
- డిజిపికి సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
- నగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ట్రాఫిక్ వలంటీర్లుగా ట్రాన్స్ జెండర్లు : అధికారులకు సిఎం రేవంత్ సూచన
రాజకీయ కుట్రలు సహించేది లేదని..హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే పనిలో బీఆర్‌ఎస్ ఉందని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని ట్రై కమిషనరేట్లలో శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని..లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగిస్తే ఎంతటివారైనా ఉపేక్షించొద్దని డీజీపీని ఆదేశించారు. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తుండడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారం కొల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఇబ్బంది కలిగిస్తే ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్‌ను ఆదేశించారు. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలతో ఆయన శుర్రకవారం సమావేశం నిర్వహించారు. హైదరాబాద్, తెలంగాణలో పరిస్థితిని చెడగొట్టేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని..రాష్ట్ర ప్రతిష్టను ఎట్టిపరిస్థితుల్లోనూ కాపాడాలని అన్నారు.
కాగా, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య తలెత్తిన వివాదం క్రమంలో గురువారం నుంచి నగరంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. గురువారం పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై గాంధీ అనుచరులు దాడికి పాల్పడగా.. బీఆర్‌ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు. కాగా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం మొదలైనప్పటి నుంచి పడగొడతామని బీఆర్‌ఎస్, బీజేపీలు పదేపదే చెప్పాయని, అయితే, కేసీఆర్ లక్కీ నెంబర్ తమ దగ్గర ఉన్నందున ప్రభుత్వానికేవి• ఢోకా లేదని, ఉప ఎన్నికలొస్తాయని బీఆర్‌ఎస్ మైండ్ గేమ్ ఆడేందుకు యత్నిస్త్తుందని, కేసీఆర్ కోసం కొత్త రాజ్యాంగమేవి• ఉండదని, ప్రభుత్వం చేసే మంచి పనుల గురించి మాట్లాడకుండా తొలిరోజు నుంచే ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడుతున్నారని, తాము నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని రేవంత్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. కాగా తాజాగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు పోలీసులు షాక్ ఇచ్చారు. పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అడిషనల్ ఎస్పీ రవి చందన్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.