బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు డ్రగ్స్ ‌టెస్ట్ ‌చేయాలి

  • కాంట్రవర్సీకి కేంద్రంగా జన్వాడ ఫామ్‌ ‌హౌజ్‌
  • ‌కెటిఆర్‌ ‌బినామిగా విజయ్‌ ‌మద్దూరి
  • రాజ్యసభ సభ్యుడు అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 29: ‌బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ ‌టెస్ట్ ‌చేయాలని రాజ్యసభ సభ్యుడు అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. విజయ్‌ ‌మద్దూరి కేటీఆర్‌ ‌బినా అని అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ ఆరోపించారు. గత ప్రభుత్వం డ్రగ్స్ ‌కేసును ఎలా దారి మళ్లించిందో అందరికీ తెలుసన్నారు. జన్వాడ పామ్‌ ‌హౌస్‌ అం‌టే నే కాంట్రవర్సీ అని అన్నారు. డ్రగ్స్ ‌వ్యవహారం బయటికొచ్చిన ప్రతిసారి ఆ పార్టీ ఎమ్మెల్యేలు బయటికి వచ్చి మాట్లాడుతున్నారని ఆరోపించారు. సిగ్గు, శరం ఉంటే డ్రగ్స్ ‌టెస్ట్ ‌చేసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ఆయన గాంధీభవన్‌ ‌లో డియాతో  మాట్లాడుతూ..రాజ్‌ ‌పాకాలా, విజయ్‌ ‌మద్దూరిని వెనకేసుకు రావడానికి కేటీఆర్‌కు సిగ్గుండాలని అన్నారు.  కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం డ్రగ్స్ ‌ప్రీ రాష్ట్రంగా చేస్తుంటే.. వాళ్ళు డ్రగ్స్ ‌ని ప్రేరేపించాలని చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణను కేసీఆర్‌ ‌కుటుంబం ఏం చేయాలనుకుంటుందో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. రాజ్‌ ‌పాకాల తనకు డ్రగ్స్ ఇచ్చారని విజయ్‌ ఒప్పు‌కున్నారని చెప్పారు. ఇప్పుడు స్టేట్‌ ‌మెంట్‌ ‌మార్చుతున్నారని మండిపడ్డారు. ఫాంహౌస్‌ ‌దొర కేసీఆర్‌ ‌డీజీపీకి ఫోన్‌ ‌చేసి ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.

ఈ కేసులో ఆయన పర్సనల్‌ ఇం‌ట్రెస్ట్ ఏమిటో అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్‌ ‌బయటికి రావాలని, ఆయన ఎక్కడ ఉన్నారని ప్రజలు అడుతున్నారని అన్నారు.రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్‌ ‌నేత అనిల్‌ ‌యాదవ్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. భారాస ఎమ్మెల్యేందరికీ డ్రగ్స్ ‌టెస్టులు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. గాంధీ భవన్‌లో ఆయన డియాతో మాట్లాడారు. డ్రగ్స్ ‌బయట పడిన ప్రతిసారి వాళ్లు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. భారాస ఎమ్మెల్యేలు డ్రగ్స్ ‌టెస్టులు చేయించుకోవాలి. రాజ్‌ ‌పాకాల, విజయ్‌ ‌మద్దూరిని వెనుకేసుకరావడానికి కేటీఆర్‌కు సిగ్గు ఉండాలి. గత ప్రభుత్వం డ్రగ్స్ ‌కేసుని ఏ విధంగా దారి మళ్లించిందో ప్రజలకు తెలుసు. జన్వాడ పామ్‌ ‌హౌస్‌ అం‌టేనే వివాదాలకు కేంద్రం. ఒకసారి దీపావళి ఫెస్టివల్‌, ఇం‌కోసారి గృహ ప్రవేశం అంటున్నారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తెలంగాణను డ్రగ్స్ ‌ఫ్రీ రాష్ట్రంగా చేస్తుంటే.. వాళ్లు డ్రగ్స్‌ను ప్రేరేపించాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page