వికారాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13 : కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నరేందర్ రెడ్డి వెంటనే విడుదల చేయాలని కోస్గిలో బీఆర్‌ఎస్ నాయకుల రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై బ్కెఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఆందోళనలు చేపట్టిన బీఆర్‌ఎస్ నాయకు లను పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా వాహనాల్లో అక్కడ నుంచి తరలించారు. కాగా, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్కెర్యం చెప్పారు. బుధవారం ఉదయం హైదరా బాద్‌లోని కేబీఆర్ పార్కులో వాకింగ్ వెళ్లిన నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పట్నం నరేందర్ రెడ్డికి కేటీఆర్ ఫోన్ చేశారు. అక్రమ అరెస్టుపై ఆందోళన చెందవద్దని, ధ్కెర్యంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ అప్రజాస్వామిక నియంత విధానాలపై పార్టీ న్యాయపరంగా పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు. నరేందర్ రెడ్డి సతీమణి శ్రుతికి కూడా కేటీఆర్ కాల్ చేసి ధ్కెర్యం చెప్పారు. మీ కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ మొత్తం అండంగా ఉంటుందని తెలిపారు. నరేందర్ రెడ్డి అరెస్టుపై బీఆర్‌ఎస్ పార్టీ లీగల్ సెల్ కోర్టులో న్యాయపోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు.
బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది : కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. కొడంగల్‌లో రైతుల తిరుగుబాటుతో రేవంత్ రెడ్డి కంగుతిన్నారని అన్నారు. ఆ డ్యామేజీ కంట్రోల్ కోసమే లగచర్లలో జరిగిన ఘటనను బీఆర్‌ఎస్ పార్టీకి ఆపాదించే కుట్రలో భాగంగానే తనను అరెస్టు చేశారని పేర్కొన్నారు. సమస్యలకు పరిష్కారం ఆలోచించకుండా ప్రతిపక్ష నాయకులను వేధించడం ప్రభుత్వ పనిగా మారిందని విమర్శించారు. ప్రభుత్వం బాధ్యత మరిచినప్పుడు ప్రతిపక్షం ప్రశ్నిస్తూనే ఉంటుందని.. అది తప్పా అని ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో సోమవారం అధికారులపై దాడి ఘటనపై ఆ అర్ధరాత్రి నుంచే పోలీస్ యాక్షన్ షురూ అయింది.
అర్ధరాత్రి వేళ.. కరెంట్ సరఫరా నిలిపేసి.. ఇంటర్నెట్ సేవలు బంద్ చేసి.. ఇండ్ల తలుపులు బద్దలు కొడుతూ.. ఇల్లిల్లూ సోదాలు చేసి.. సుమారు 300 మంది పోలీసులు 55 మందిని అదుపులోకి తీసుకుని పోలీ• •స్టేషన్‌కు తరలించారు. విచారణ అనంతరం 16 మంది రైతులకు కోర్టుకు రిమాండ్ చేశారు. వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వగా, పరిగి సబ్ జ్కెలుకు తరలించారు. అలాగే బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ వద్దకు వాకింగ్‌కు వొచ్చిన పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. కాగా, నరేందర్ రెడ్డి అరెస్టుపై బీఆర్‌ఎస్ భగ్గుమంది. కొడంగల్ నియోజకవర్గవ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చింది.
కామారెడ్డిలో…
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని అజమాబాద్ గ్రామంలో అదనపు కలెక్టర్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. సన్న వడ్ల కొనుగోలులో సొసైటీ నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేశారు. గ్రామాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్ విక్టర్ ఎదుట రైతులు తమ సమస్యలను ప్రస్తావి ంచారు. సొసైటీ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైస్ మిల్లర్లు ధాన్యం కటింగ్ తీస్తుండడంతో తమకు ఆర్థిక నష్టం కలుగుతోందని, సొసైటీ అధికారులు సన్న వడ్ల కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం చూపిస్తున్నారని రైతులు పేర్కొన్నారు. తక్షణమే సొసైటీ విధానంలో మార్పులు చేసి ధాన్యం కొనుగోళ్లను చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు.