బిఆర్‌ఎస్‌ ‌కుట్రలను సహించేది లేదు

కలెక్టర్‌పై భౌతిక దాడి దుర్మార్గపు చర్య
అభివృద్దిని అడ్డుకోవ‌డ‌మే బిఆర్ఎస్ ల‌క్ష్యం
అధికారం పోవడంతో ఉన్మాద చర్యలకు ప్రేరేపణ
మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్‌ ‌బాబు హెచ్చరిక

: ‌లగచర్ల ఘటన వెనక ఎవరున్నా వొదిలి పెట్టే ప్రసక్తే లేదని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ ‌బాబు హెచ్చరించారు. దీని వెనక బిఆర్‌ఎస్‌ ‌నేతల హస్తం ఉందని తెలుస్తోందని, ఎవరున్నా.. ఎంతటి వారున్నా వదిలేది లేదని మంత్రి స్పష్ట చేశారు. వికారాబాద్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌ప్రతీక్‌ ‌జైన్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారం పోయిందనే ఆక్రోశంతో బీఆర్‌ఎస్‌ ‌కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అడ్డుకోవడం బీఆర్‌ఎస్‌ ‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. అభివృద్ధి అవరోధకులుగా బీఆర్‌ఎస్‌ ‌నేతలు తయారయ్యారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ ‌ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రోజు ఈ విధంగా వ్యవహరించలేదని గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో ముఖ్యమని.. ఇందులో భాగంగానే ప్రభుత్వం పరిశ్రమలను ఏర్పాటు చేస్తుంటే బీఆర్‌ఎస్‌ అడ్డుపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకం ప్రకారమే కొందరు రైతులను రెచ్చగొట్టి కలెక్టర్‌పై భౌతిక దాడికి పాల్పడేలా చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విధానాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఉపేక్షించమని తేల్చి చెప్పారు. కలెక్టర్‌పై దాడి ఘటనపై కచ్చితంగా సమగ్ర విచారణ చేస్తామని చెప్పారు. కలెక్టర్‌పై దాడి ఘటనలో కుట్రదారులెవరు.

తప్పుదోవ పట్టించి కలెక్టర్‌ను గ్రామంలోకి తీసుకెళ్లింది ఎవరనే దానిపై సమగ్ర విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధిని అడ్డుకోవాలని ఎవరూ యత్నించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు, ప్రజలకు ఏమైనా అభ్యంతరం ఉంటే ప్రజాస్వామ్య పద్దతిలో చెప్పొచ్చని.. ఇలా అధికారులపై భౌతికి దాడులకు పాల్పడటం సరికాదని హితవు పలికారు. సమస్యలపై ప్రజాస్వామిక పద్దతిలో ముందుకెళ్తున్నామన్నారు. రైతులను సభాస్థలికి రాకుండా కొందరు అడ్డగించారని.. దీంతో రైతుల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుందామని కలెక్టర్‌ ‌వెళ్లాడని.. ఈ క్రమంలోనే పథకం ప్రకారం అధికారులపై దాడి చేశారని చెప్పారు. అప్రజాస్వామికంగా దాడులు చేస్తే సహించమని గట్టిగా వార్నింగ్‌ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page