కాంగ్రెస్ నేతలు పలువురు బిఆర్‌ఎస్‌లో చేరిక
తిరుగుబాటు మొదలైందన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్26:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఇలాఖాలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది
రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం పర్యటనలో ఉండగానే.. సొంత పార్టీకి చెందిన పలువురు నేతలు సీఎంకు షాకిచ్చారు. పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోనే కాంగ్రెస్ సర్కారుపై తిరుగుబాటు మొదలైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీపీ దయాకర్ రెడ్డితోపాటు.. బీఎస్పీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన నర్మద బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వీరందరికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దాదాపు వంద మంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కారెక్కారు. బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ మాజీ ఎంపీపీ, బీఎస్పీ కాంటెస్టెడ్ క్యాండిడేట్ నర్మదా, పలువురు కాంగ్రెస్ నాయకులు కారెక్కారు. వీరందరికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీని గెలిపించే దిశగా పని చేస్తామని నేతలు పేర్కొన్నారు.
ఆరు గ్యారెంటీల పేరుతో అన్ని వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారని వారు ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫార్మా సిటీని రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిం చారని, అధికారంలోకి వచ్చిన తరువాత కొడంగల్‌లోనే ఫార్మా కంపెనీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కొడంగల్ నియోజకవర్గాన్ని తక్కువ ఖర్చుతో సస్యశ్యామలం చేసే ప్రణాళికను పక్కన పెట్టారని.. కేవలం కషన్ల కోసం కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును చేపట్టారని ఆరోపించారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు పలు వర్గాల ఆందోళనలు, ధర్నాలతో తెలంగాణ అట్టుడుకుతోందని, మంత్రులు మాత్రం విహార యాత్రల్లో ఎంజాయ్ చేస్తున్నారని మండిపడ్డారు. చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని వ్యాఖ్యానించారు. పదేళ్లు ప్రగతిపథంలో పరుగులు పెట్టిన తెలంగాణ రాష్ట్ర ఆదాయం తగ్గుతోందని, కాంగ్రెస్ నేతల ఆదాయం మాత్రం పెరుగుతోందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ హెలికాప్టర్ ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో తరిస్తోందని, ఇది అధికార దుర్వినియోగం కాకపోతే మరేంటని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా కలిసికట్టుగా పనిచేసి కొడంగల్‌లో కాంగ్రెస్‌ను ఓడించాలని నేతలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫార్మా సిటీని తీవ్రంగా వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత కొడంగల్‌లోనే ఫార్మా కంపెనీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేయడంతో స్థానిక ప్రజలు తరిమికొట్టే పరిస్థితి ఏర్పడిందని గుర్తుచేశారు. పాలమూరు ? రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా కొడంగల్ నియోజకవర్గాన్ని తక్కువ ఖర్చుతో సస్యశ్యామలం చేసే ప్రణాళికలు పక్కనపెట్టి, కేవలం కమిషన్ల కోసం కొడంగల్ లిప్ట్ ప్రాజెక్టును చేపట్టారని మండిపడ్డారు. మొన్నటిదాకా రేవంత్ రెడ్డి తిట్టిపోసిన మెగా ఇంజనీరింగ్ కంపెనీకి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టడం వెనక ఉన్న మతలబు ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. ధర్నాలు, రాస్తారోకోలతో తెలంగాణ అట్టడుకుతుంటే? మంత్రులు విహార యాత్రల్లో ఎంజాయ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ హెలికాప్టర్ ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో తరిస్తోందని, ఇది అధికార దుర్వినియోగం కాకపోతే మరేంటని ప్రశ్నించారు.