Category సాహిత్యం-శోభ

ఎవరిది తప్పు?

పారే నీటిని దాచుకోని నదీ గర్భం వెల్లువని ప్రక్క దారి పట్టించిన మెరక దర్పం! అదను చూసి జెండా పాతేసిని కబ్జాదారులు జేబు తడుపుకు సరిహద్దులు మార్చిన అధికారులు!     లేని దానికి సదుపాయాలిచ్చిన ప్రభుత్వవిభాగం కాని దానికి పన్నులు దండుకున్న పాలక పక్షం! మాయాగృహం చూపి మంత్రం వేసిన గుత్తేదారు భ్రమలు చూపి…

బూడిద రంగు ఆకాశం

భూమిని తొడిగిన మొక్క ఒక దిగ్దర్శనం విలోమానుపాతంగా విలీనం అంచుల్లో ఒకే రంగు కల పొదిగి పొదిగి వెచ్చని గడ్డిలోంచి అనేకానేక వర్ణపు రెక్కలతో బూడిదరంగు ఆకాశంలోకి అనంతాస్పృశ్యం అసాధారణ మానసికం జారుడు పదార్థంలోంచి పక్కున పగిలి ఉదారంగు గుడ్డుగా దొర్లినా మొన్న మిగిలిన మాటల గీతలు ఏ కోణమానినిలో పొసగక విఫలయత్నం కార్చిచ్చుల కాలిబాట…

జీవ‌న ల‌య‌ల స‌వ్వ‌డులు…

Studying the rhythms of life

ఆలోచ‌న‌ల్లోని నిర్మ‌ల‌త్వంలా, నిర్మాణంలో నిపుణ‌త‌లా, అనుభూతుల పాల‌వెల్లిలా క‌విత్వం ఉండాలంటారు. జ‌ల‌పాత స‌దృశంగా మినీక‌విత‌, నిశ్చ‌ల స‌ర‌స్సులా హైకూ ఎంతో నిదానంగా మొదులై గుండెలోని అణువ‌ణువునూ త‌డ‌ముతూ ప్ర‌వ‌హించి చైత‌న్య ఝ‌రిగా నిలిచిపోయే నానీలు ఆధునిక వ‌చ‌న క‌విత్వ ప్ర‌క్రియ‌లు. వ‌స్తువుకు సంబంధించిన ష‌ర‌తులేవీ లేకుండా నాలుగు పాదాల్లో స్వేచ్చ‌గా శిల్పాన్ని, స‌ముగ్ర‌త‌ను పాటిస్తూ అభివ్య‌క్తిని…

ఒక్కో వాక్యం వెనుక ఒక్కో అనుభవం

ఇప్పుడు చమురంటిన దీపంలా ఆ ఇల్లు ఒక్కటే  పెద్ద పెద్ద డాబాల మధ్య మిణుకు మిణుకు మంటుంది.. పడక కుర్చీలో చొక్కా లేకుండా ఆయన వృద్ధాప్యంలోనూ  హుందాగా ఉంటే చాప పై ఒత్తులు చేసుకుంటా దేవుడిని స్మరించుకుంటూ ఆమె కనిపిస్తుంది. ఇంకెవ్వరితో సంబంధం లేని వాళ్ళలా ఇంటి ఒడిలో గువ్వలై ముడుచుకుని ఏదో చెప్పుకుంటారు… కాదని,…

ఓ అందాల మేఘమా!

andhala meghamaa

ఆకాశంలో ఆవిరి మేఘమా అంబరాన అందాల రూపమా కారు మబ్బై గర్జించే మేఘమా గాలి కెరటాలకే భీరువువై పోతావా దూది పింజమై దూరాలకు తేలిపోతావా! నింగి క్రింద నువ్వో మొగులు ఎండకు నువ్వో గొడుగు వానకు నువ్వో మొయిలు ఇంద్రధనస్సు కు నువ్వో వెండి తెర! గగనంలో జలతారు తేరు అప్సరసలు విహరించు విహారాల తీరు…

ధ్యానమే నీ జ్ఞానమై…!

best telugu articles, special stories in telugu, telangana politics, shobha

పుట్టి నూటయాభై వసంతాలు గడిచినప్పటికీ ఓ పురాణ అవతార పురుషుడిలా పుడమితల్లి పై అ”సామాన్యుడై” మన మధ్యే బాపూజీ కదలాడుతున్నాడు..! సత్యం గాంధీజీలా జీవం పోసుకొని మానవ నాగరికతకు బ్రతుకు పాటపు నడక నేర్పుతుంది. అహింస నేటి ఉషోదయాన్ని గుండెకత్తుకొని సత్యాగ్రహమై ఈ జగతి గొంతుకై మాట్లాడుతుంది..! శారీరక మానసిక ఆధ్యాత్మిక ఎదుగుదలలో ప్రకృతి వైద్యమే…

ప్రవక్త

ప్రవక్త ప్రేరిపిత బోధకుడు గడువు ముగిసిన మనిషి సత్యన్వేషణావధి దాటి పరిణామ క్రమం లో వ్యక్తి ప్రవక్త గా మార్పు చెందుతాడు జీవనానికీ కావాలిసిన సిద్దాంతాలు, మార్గదర్శకాలు లోకము, పరలోకము సచ్చిలత, హెచ్చరికలన్నీ మతగ్రంథాలాధారం గా ప్రభోదించబడుతాయి మానవాళి మంచిని మరచిన వేళ దైవత్వము ఆయుధమవుతుంది దైవాన్ని క్రమంగా నమ్మిన నరుడు మానవత్వాన్ని విస్మరిస్తాడు బట్టి…

You cannot copy content of this page