Category సాహిత్యం-శోభ

తొలితరం దళిత కవి కుసుమ ధర్మన్న

రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపు పేటలో,కుసుమ నాగమ్మ,  వీరస్వామి,దంపతులకు 17/03/1900 నాడు జన్మించాడు. వైద్య విద్వాన్‌, సంస్కృతం,ఆంధ్రం, ఆంగ్లం, హిందీ,ఉర్దూలలో, పాండిత్యం కలిగిన వ్యక్తి, నిన్మ జాతి, ముక్తి తరంగిణి, నల్ల దొరతనం, హరిజన శతకం, మాకొద్దీ నల్ల దొరతనం, వంటి రచనలు చేశారు.  చదువుకున్న రోజుల్లోనే సంఘసంస్కరణ అభిలాష కలిగి కందుకూరి వీరేశలింగం, చేత ప్రభావితం అయ్యారు.…

నీరే ఆధారం!

ఎర్రటి ఎండల్లో నెర్రలు బారిన నేలల్లో వలసల్లా సాగుతోన్న దాహం! నెత్తిన ఖాళీ బిందెలతో దూరాలు జయించినా చెమటల్లో తప్ప నీటిని నిజంగా చూడలేని నిస్సహాయత ఒక్క చెలమ చెలిమి లేని ఒంటరి ఇసుక దారుల్లో కన్నీటి పొరల్లోంచే కానరాని నీటిజాడ కోసం అన్వేషణ! చేతులు కాలాక ఆకులు పట్టినట్టు.. అమృత దారల్లాంటి వర్షపు నీళ్ళు…

నెత్తుటి లేపనం!

నిజమే…. మన ప్రమేయం లేకుండానే ఏ మాత్రం తెలియకనే వయసు పెరిగి పోతోంది ! రోజూ రోజటిలా లేకున్నా నిన్నటి రోజులా అనిపించక కొత్తగా నేడు మనముందు తెర తీసి ఆవిష్కారమై నిన్నను మరిచేలా నేడు కొత్తగా అందంగా దర్షనమౌతోంది ! అవును నిజంగానే గడిపిన రోజులు పాత జ్ఞాపకాలు బాల్యపు స్మృతుల చెలిమెలు యవ్వన…

ఇంతేనా ?

ఇంతగా చదివిన ఇన్నాళ్ళకు గానీ జీవితానికి తెలియలేదు లోకమనే  పుస్తకాన్ని చదివి పరీక్ష వ్రాయాలని .. ఎవరిని అడిగినా జవాబు రాని ప్రశ్నలను ఒకరిని కాఫీ కొట్టడానికి వీలుకాని పోటీ ఒకటి ఉంటుందని విధి ఫలితాల్లో ఓటమిని చదువుకుంటూ మధ్య మధ్యలో గెలుపు బరువుగా మోయడం ఉంటుందని ఊహల అందం చేసే మోసం ఒంటరితనంతో ఇంతేగా…

అరణ్యరోదన..

ఒకప్పుడు అడవంటే భయం అడవిలో పులులుంటాయని సింహాలుంటాయని భయం! అడవిని చూస్తే పారి పోయేవారు లోనికి ప్రవేశం ఒక సాహసం కాలచక్రం గిర్రున తిరిగేసరికి మనుషులు విపరీతంగా పెరిగి అడవులు తరిగి భయం స్థానంలో జాలి చేరింది.. అడవిలో కలప వనరులు జంతుజాలం మనిషి కంటి కిందకు పంటి కిందకు కూడా రావటం లేదు.. మనిషి…

మనుషుల పాట

ఈరోజు పొద్దున్నే వెలుతురొచ్చింది వెండిలా పరుచుకుంది వాకిట్లో చెట్లు నిశ్చలంగా పాటలు పాడుతున్నాయి కండ్లు ప్రకృతిని మొరపెట్టుకున్నాయి నీ అప్పు తిరిగి ఇచ్చేస్తాం ఆలస్యమైనా కడతాం మాటిస్తున్నాం మమ్ములను నీ వాసన దారుల్లో తచ్చాడనీయ్‌ అలగకు ఒరగకు క్షమించు గాయాలకు నూనె రాస్తే తగ్గవని తెలుసు మరచి మాయామోహంతో ఉన్నాం వైరుధ్యాల తలంపై తిరుగాడుతున్నాం వైషమ్యాలను…

కడలి తరంగం..

మగాడు శాస్త్రకారుడై అపుత్రస్య గతిర్నాస్తని విషం కక్కితే! ఆతడు నిరాదరించిన తల్లిదండ్రుల్ని ఆదరణతో గుండెలకు హత్తుకుని అపుత్రికస్య గతినాస్తని తిరగరాసింది! వంటింటి కుందేలు కమ్మని శాసిస్తే అంతరిక్షాన్నే అలవోగ్గా చుట్టి సత్తా చాటింది! అబలవని కించపరచబోతే అన్నిట్లో మగాళ్ళను మించి సబలనంది! ఏ రంగమైనా సరే.. ఆమె దిగనంత వరకే! ఆమె రంగప్రవేశం చేసిందా అతడి…

భావి సారథి

అంతరంగం అంతు చిక్కని అనంత పారావారమై, బంధాలకు,అనుబంధాలకు నెలవైన నెలత, ఆత్మీయతానురాగాలనందించే అమృతకలశం. ఆమె… కుటుంబసభ్యుల సేవలో రేయింబవళ్లను ఒకటిగా చేసి, వారిని జాగృతంచేసే చైతన్యకిరణం, ఆశయాల తీరం చేర్చే నావ, తలపుల వినీలాకాశంలో స్వేచ్ఛగా విహరింపచేసే విహంగం. నవ్యచరితలు లిఖించుటకై ద్విగుణీకృతమైన పట్టుదలతో, మొక్కవోని దీక్షతో, సర్వం తానై, సకలానికి నెలవై, విశ్వవిపంచిjైు నిశ్శబ్దాన్ని…

ఆమె…

ప్రపంచంలో ప్రేమ పలురూపాల్లో  పలుపాత్రల్లో కనిపించే బలమైన బంధం స్త్రీ. ప్రతి ఒక్కరి బతుకులో కొండంత గొప్పగా ఊహించని ఆధారం కోరని వరంగా  కురిసే ఆనందం.. అమ్మ, అక్క, చెల్లి,భార్య, పాత్ర ఏదైనా జీవితంలో ఘనమైన ప్రేమకు ‘‘ఆమె’’ నిజరూపం. (మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా…) -శ్రీసాహితి 9704437247

You cannot copy content of this page