తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. మహిళా ట్రాన్స్ జెండర్ సంఘాల రాజకీయ ప్రశ్నలు- డిమాండ్లు!
తెలంగాణ ఎన్నికల రణరంగం జోరుమీద నడుస్తోంది. అలవికాని వాగ్దానాలు, పరస్పర దూషణలు నిస్సిగ్గుగా ప్రవహిస్తున్నాయి. ఇంకో రెండు వారాల్లో తెలంగాణ రాష్ట్ర అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్లబోతున్నదనేది తెలిపోతుంది. ఈ సందర్భంగా కొన్ని ‘రాజకీయ ముచ్చట్లు’ చెప్పుకుందాం. ఇప్పుడు జరుగుతున్నదంతా అదేగా, మళ్లీ కొత్తగా మీరు చెప్పే రాజకీయం ఏముంది అని ఎగతాళి చేయవచ్చు కొందరు! రాజకీయం అంటే…